సబ్ ఫీచర్

మొదటిసారి కవాతుకు స్ర్తి నేతృత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ఆర్మీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి మగ జవాన్ల కవాతుకు నాయకత్వం వహించబోతున్నారు. అదీ హైదరాబాద్‌కు చెందిన తెలుగమ్మాయి లెఫ్టినెంట్ భావనా కస్తూరి నేతృత్వం వహించనున్నారు. పురుష కవాతును మహిళా అధికారి లీడ్ చేయడం ఇదే తొలిసారి. 2015 రిపబ్లిక్ డే పెరేడ్‌లో మహిళా కవాతుకు కెప్టెన్ దివ్య అజిత్ నేతృత్వం వహించారు. . అప్పుడు 148 మంది మహిళా సైనికుల దళం పరేడ్‌లో పాల్గొంది. మహిళా సైనిక దళానికి మరో మహిళ నేతృత్వం వహించడం సాధారణ విషయం. కానీ పురుషుల కవాతుకు ఒక స్ర్తి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. బెంగళూరులోని ఆర్మీ పటాల కేంద్రంలో భావనా కస్తూరితో పాటు 144 మంది సైనికులు ఆరునెలలుగా సాధన చేస్తున్నారట. ఆమెతో పాటు మరో ఇద్దరు పురుష అధికారులు దళ కమాండర్లుగా సాధన చేస్తున్నారట. ఈ అవకాశం వచ్చినందుకు భావనాకస్తూరి ఆనందంగా భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆర్మీలో పరిణామ క్రమానికి తనని ఎంపిక చేయడం నిదర్శనమని, భవిష్యత్తులో మరింత మంది మహిళా అధికారులు దళానికి నేతృత్వం వహిస్తారు’’ అని భావనా కస్తూరి చెబుతున్నారు. ఈసారి జరిగే గణతంత్ర పరేడ్‌లో మహిళా నేతృత్వంలో కవాతుతో పాటు నూతనంగా సైన్యంలో చేరిన రక్షణ సామాగ్రి ఎం777, ఏ2 రకానికి చెందిన తేలికైన హోవిట్జర్లు, కే వజ్ర-టి ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు.