సబ్ ఫీచర్

గర్భిణుల్లో గ్యాస్ సమస్యా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపుతో ఉన్నప్పుడు పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు సర్వసాధారణం. ఇలాంటి సమస్యలను సులభంగా తగ్గించే పద్ధతులను పెద్దవాళ్లు తరచూ చెబుతూ ఉంటారు. ఆ చిట్కాలేంటో చూద్దాం.
* కడుపుతో ఉన్న మహిళలకు గ్యాస్ సమస్యను తగ్గించాలంటే ఉత్తమ మార్గం నీటిని ఎక్కువగా తాగడం. ప్రతిరోజూ పండ్ల రసాలతో పాటుగా ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని తాగాలి. ఒకవేళ కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తే అది ఇరిటబుల్ టోవేల్ సిండ్రోమ్ అని అర్థం చేసుకోవాలి. నీటిని అధికంగా తాగడం వల్ల ఈ సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
* గర్భిణులు చిన్న చిన్న వ్యాయామాలతో కూడిన పనులను ప్రతిరోజూ చేస్తూ ఉండాలి. కడుపుతో ఉన్నారని తెలియగానే పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా ప్రతిరోజూ 30 నిముషాలపాటు వాకింగ్ చేయాలి. వాకింగ్‌తో పాటు డాక్టరు సలహాతో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. స్వతహాగా ఇలాంటి కార్యాల వల్ల ఫిట్‌గా ఉండటమే కాదు, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.
* గ్యాస్ సమస్య కలిగించే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. మొలకెత్తిన విత్తనాలు, బ్రకోలీ, గోధుమపిండి, బంగాళాదుంప వంటి ఆరోగ్యకర ఆహారపదార్థాలను గ్యాస్ సమస్యలకు కారణంగా పేర్కొంటారు. అందువల్ల గర్భిణులు పోషకాహార నిపుణుడి సహాయంతో ఒక ఆహార ప్రణాళికను తయారుచేసుకుని దాని ప్రకారం ఆహారం తీసుకుంటే మంచిది.
* ఫైబర్ గర్భిణుల్లో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రోజులో 25నుండి 30 గ్రాముల ఫైబర్‌ను తీసుకోవడం మంచిది. అరటిపండు, ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
* ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలతో పాటుగా సైలియం, మేథేల్సెల్యూలోజ్, పాలిథిలిన్ గ్లైకాల్ వంటి ఫైబర్ ఉపభాగాలను కూడా తీసుకోవచ్చు. కానీ వీటిని వైద్యుని అంగీకారం మేరకు మాత్రమే వాడాలి.