సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

167. చైతన్య దేవుడు దక్షిణ దేశమున తీర్థయాత్రలు చేయుచు; గీతను జదువునొక పండితుని మ్రోల కన్నీరు గార్చుచు గూరుచుండిన యొక భక్తుని గాంచెను. ఈ భక్తునికి ఓనమాలైనను రావు. గీతలోని ఒక్క శ్లోకముకైనను పండితుడు చేయుచున్న అర్థమేమో గ్రహంచునట్టి స్థితిలో లేడు. కన్నీళ్లు గార్చుచుండుటకు కారణమేమని చైతన్యదేవుడు ప్రశ్నింపగా నాతడిట్లు పలికెను: ‘‘గీతలోని ఒక్క మాట కూడ నాకు తెలియదనుమాట నిజము. కాని గీతా కాలక్షేపము జరుగుచున్నంతసేపు కురుక్షేత్రమున రథము పైని, అర్జునుని యెదుట గూర్చుండి గీతలోని రుూ దివ్యతత్త్వములనన్నింటిని ఉపదేశించుచున్న శ్రీకృష్ణపరమాత్ముని సుందర రూపము నాలోపలి కన్నులకు అగపడుచున్నది. కాబట్టి వానియందలి భక్తిచేతను ఆనందముచేతను నా కన్నులు బాష్పములతో నిండినవి.’’
ఆతడు ఓనమాలైనను నేర్వకున్నను బ్రహ్మజ్ఞాని, నిర్మల భక్తిచే భగవత్సాక్షాత్కారము పొందగలిగిన భక్తిపరుడు.
**
‘బాధ గురువులు: బోధ గురువులు’
168. ఓ ఆచార్యుడా! బోధించుటకు నీకడ అధికార చిహ్నముకలదా? రాజుచే అధికారముద్ర పొందిన యెంతటి అల్పసేవకుడైనను వాని మాటలను జనులు భయభక్తులతో విందురు. ఆతడు తన డవాలుబిల్లను జూపి యెంతటి అల్లరినైనను అణచివేయగలడు. అటులనే నీవును మొట్టమొదట ఈశ్వరుని యాజ్ఞను బొంది ఈశ్వర ప్రేరితుడవు కావలయును. ఈ రుూశ్వరాదేశ చిహ్నము నీకడ లేనియెడల జీవత కాలమంతయు నీవు దర్మోపన్యాసములు చేయుదువుగాక, వట్టి కంఠశోషయే కాని మఱేమియు ప్రయోజనము ఉండబోదు.
169. భక్తిసాగరమున మునుగుట కెవ్వనికిని అభిలాషగాని, ఓరిమి గాని లేదు. వివేక వైరాగ్యములను గాని, సాధనలను గాని ఎవ్వరును లక్షింపనే లక్షింపరు. ఏ పుస్తకము నుండియో నాలుగుముక్కలు నేర్చినంతనే యిక నుపన్యాసములు చేయుటనిన, పరులకు ధర్మోపదేశము చేయుటనిన, ప్రతి వ్యక్తికిని తహతహ, అందులకై పరుగు! ఎంత విచిత్రము! పరులకు బోధించుటనిన అంత తేలికయైన పనియా? కష్టాత్కష్టతరము. ఈశ్వర సాక్షాత్కారమునుబొంది, ఈశ్వరావేశమును బొందినవాడే బోధింపగలడు!
170. మంచి వక్తయు బోధకుడునయ్యును ఆత్మవికాసము లేనివాడెట్టివాడో తెలియునా? ఆతడు తనయొద్ద కుదువబెట్టిన పరులద్రవ్యమును దుర్వినియోగము చేయువాని వంటివాడు. ఇతరుల కాతడు ధారాళముగా ఉపదేశింపగలడు. దానివలన తనకేమి నష్టము? ఆతడు బోధించు భావములు ఎరవు సొమ్ములు గదా!
171. సుప్రసిద్ధుడైన యొక ఉపన్యాసకుడొకనాడు ఒక హరిసభలో నుపన్యసించుచుండెను. ఉపన్యాసము నడుమనాతడిట్లనెను; ‘‘్భగవంతుడు కేవలము రస విహీనుడు, మన స్వభావమునందలి రసమొసగి యాతని మనము రసమయుని జేయవలయును.’’ రసమనగా ప్రేమ, భగవంతుని పనిచెప్పబడు నితరగుణములునని యాతని భావము. ఈ మాటలను వినినప్పుడు నాకొక బాలుని సంగతి జ్ఞప్తికి వచ్చినది. వాడు తన మామకు చాల గుఱ్ఱములున్నవని చెప్పుచు, వినువారిని తన మాటలను నమ్మింపనెంచి తన మామ యింట ప్రత్యేకముగానొక గోశాలయంతయు గుఱ్ఱములతో నిండియున్నదని చెప్పెను. గోశాలలు గుఱ్ఱములకోసము కట్టబడునవి కావని, బాలుడు చెప్పునది అసత్యమని, గుఱ్ఱములను గూర్చి వానికెట్టి యనుభవములేదని వివేకులగువారు వెంటనే గ్రహించి యుందురని వేఱుగ జెప్పనక్కఱలేదు.
భగవంతుడు రసవిహీనుడనుట కేవలము అసంగతము, (శాస్తమ్రునకును, అనుభవమునకును, యుక్తికినిగూడ) విరుద్ధము. (* రసోవై స?’- (్భగవంతుడు రసస్వరూపుడు) అని తైత్తిరీయోపనిషత్తు.) ఆ ఉపన్యాసకునకు తన మాటల యర్థమేమో తనకే బొత్తిగా తెలియలేదన్న మాట. సచ్చిదానందమూర్తియగు భగవానునాతడెన్నడును గన లేదని, భగవదనుభవము నాతడెన్నడును పొందలేదని వాని మాటల వైఖరియే తెలుపుచున్నది.
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి