సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

172. నేటి మత బోధకుల విధానము లెట్టివో మీకు తెలియునా? ఒక్కనికి మాత్రమే సరిపోవు అన్నము ఉండగా నూఱు మందిని విందునకు బిల్చుట వంటివి. అణుమాత్రమైన ఆత్మానుభవము ఉన్నదో లేదో, కేవలము మహోధర్మోపదేష్టలుగా నటించుచుందురు.
173. మొదట నీ హృదయ దేవాలయమున భగవానుని ప్రతిష్ఠించుకొనుము, మొదట వాని సాక్షాత్కారము పొందుము. భగవంతుని జూచిన పిమ్మట ప్రసంగములు, బోధలు, ఉపన్యాసములు మొదలగు వానినెన్ని చేసినను చేయవచ్చును. అంతేకాని అంతకు పూర్వము కాదు. విషయలోలురయ్యును జనులు భగవంతుని గూర్చియు బ్రహ్మమును గూర్చియు ప్రసంగములు సాగించుచుందురు. ఆలయములో దేవుడులేనిదే ఆరాధనకై సంకు ఊదెనట!
174. ఒకనాడు నేను పంచవటి నుండి పోవుచుండ కప్పయొకటి భయంకరముగా కూయుచుండుట వింటిని. దానిని పాము పట్టుకొనియుండునని ఊహించితిని. చాలసేపైన తర్వాత ఆ దారినే వచ్చుచు, తిరిగి ఆ శబ్దమునే వింటిని. పొదలనుండి తొంగి చూడగా ఒక బురదపాము కప్పను బట్టుకొనియున్నది. దానిని అది మ్రింగను మ్రింగ జాలకుండెను, విడువను విడువ జాలకుండెను, పాప మా కప్ప దురవస్థ చెప్పనలవి కాకుండెను. అప్పుడు నేనిట్లనుకొంటిని: ‘‘అదియే తాచుబాము ఐన యెడల రెండు మూడు కూతలతో ఆ కప్ప పని ముగిసి యుండెడిది. (అంతటితో కప్పకును పామునకును గూడ బాధ నివర్తించెడిది.) కాని యిచట పాము పాధము కప్పబాధయు ఇంచుమించుగా సరిసమానముగానున్నవి. అటులనే ఆత్మజ్ఞానహీనుడు అహంకరించి మఱియొక నిని తరింపజేయు బాధ్యత బూనిన యెడల ఇరువురి బాధకును అంతము ఉండదు. శిష్యుని యహంకారము గాని, వాని సంసార బంధములు గాని తొలగవు. అనర్హునాశ్రయించిన శిష్యుడెన్నడును తరింపనేరడు; కాని సమర్థుడగు గురువు నాశ్రయించిన జీవుని యహంకారమో, మూడు బెక బెకలతో సరి.’’
175. ధర్మప్రచారమును వృత్తిగా బెట్టుకొనిన యొక బోధకుడు వినువారలు భక్తిపరవశులగునట్లు ఉపన్యసించెడి వాడు. కాని స్వయముగ ఆతడు యోగ్యమైన నడవడి కల వాడు కాడు. వాని ప్రవర్తన జూచి, మనస్సునొచ్చి, అంతమంది హృదయములలో భక్త్భివములను పురికొల్పగల్గియు తాను స్వయముగా అయోగ్యుడై మనుటకు కారణమేమని నేనాతని నడిగితిని. ఆతడు గౌరవార్థము తలవంచి యిట్లనెను: ‘‘అయ్యా, నిజము. చీపురు స్వయముగా నీచమైన వస్తువయ్యును నేలమీదను వీధులందును గల ధూళిని తొలగించును గదా!’’ ఆతనికి నిజముగా నేనేమియు బదులు చెప్పలేకపోయితిని.
బోధ గురువులు
176. తత్త్వజ్ఞానశోభితుడే సద్గురువు. అతడే బోధగురువు.
177.అనేకులు మంచుగడ్డను గూర్చి వినియుందురు. కాని చూచియుండరు. అటులనే చాలామంది ధర్మోపదేష్టలు భగవానుని యనంతకల్యాణ గుణములను గూర్చి గ్రంథములలో జదివియుందురు. కాని స్వయముగా వానియనుభవము పొందినవారు కారు. అనేకులు మంచుగడ్డను జూచినవారయ్యును చవిచూచినవారుకారు. ఈ తీరుననే ధర్మబోధకులు పెక్కురు ఈశ్వర విభూతిని లేశముగాంచినను తత్త్వానుభవము పొందినవారు కారు. మంచుగడ్డను రుచిచూచినవాడే అది యెట్టిదో చెప్పగలడు. అటులనే ఒకప్పుడు దాసునిగను, మరియొకప్పుడు సఖునిగను, వేరొకప్పుడు ప్రియునిగను వివిధ భావములలో భగవదనుభవము పొంది మరల సమాధి స్థితిలో వానితో సంపూర్ణైక్యమును సాధించినవాడే భగవత్కల్యాణ గుణములను వర్ణింపగలడు.
178. తాను నాయకుడననియు సంప్రదాయ నిర్మాతననియు తలంపు కలవాని యహంకారము అపక్వమైనట్టిది. కాని సాక్షాత్కారము పొందిన వెనుక ఈశ్వరాదేశమును పొంది లోక శ్రేయము కోసము బోధించునేని దానివలన నెట్టి హానియు గలుగదు. పరీక్షీత్తునకు భాగవతమును బోధించుటకై శుకదేవుడట్టి యాదేశమును బడసెను.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి