సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

196. లౌకికులు భక్తులతోగూడి ఒక్కొక్కప్పుడిచ్చటికి వచ్చుచుందురు. లౌకికులకు పారమార్థిక ప్రసంగములనిన గిట్టదు. ఇతరులు భగవంతుని గూర్చియు పరమార్థమును గూర్చియు చాలసేపు ముచ్చటించుచుండ, వారు విసుగుకొని చీకాకుపడుదురు. ఊరక కూర్చుండుట కూడ వారికి చాల కష్టముగా నుండును. అందుచే తమ మిత్రుల చెవిలో, ‘‘ఎప్పుడు మీరు బయలుదేఱుట? ఇంకను ఎంత సేపుందురు?’’ అని గుసగుసలాడుదురు. అప్పుడప్పుడు వారి స్నేహితులిట్లు సమాధానము చెప్పుచుందురు: ‘‘కొంచెము తాళుడు, ఇప్పుడే వచ్చుచున్నాము.’’ ఈ మాటలను విని విసుగుకొని వా రిట్లందురు: ‘‘సరే, మీరు మాటలాడుచుండుడు. మేము పోయి పడవలో కనిపెట్టుకొనియుందుము.’’ (కలకత్తానుండి జనులు శ్రీరామ కృష్ణదర్శనార్థము పడవపై దక్షిణేశ్వరము వచ్చువారు.)
197. పావురము యొక్క కుత్తుక అది యేరుకొని తిను గింజలతో నిండియుండు రీతిని లౌకికుని హృదయము అడ్డమైన లౌకిక చింతలతోడను క్రిక్కిఱిసి యున్నదని వానితో రవంత ప్రసంగించినంతనే తెలియనగును.
198. పాపాత్ముని మనస్సు ఉంగరాల జుట్టు వంటిది. ఎంత ప్రయత్నించినను ఉంగరాల జుట్టును నీవు సాపుగా నుండునట్లు చేయజాలవు. అటులనే దుర్జనుని వక్రబుద్ధిని సరిచేయుట దర్లభము. (చూ.579.)
199. సాధువు చేతనున్న కమండలువు ఆతడు తీర్థయాత్రలు చేయుచు ధామములను (దర్శింపవలసిన ముఖ్యమైన పుణ్యస్థలములు) నాల్గింటిని దర్శించినను ఎప్పటివలెనే చేదుగనే యుండును. సంసారబద్ధుల స్వభావముగూడ నిట్టిదే.
200. కాల్పని రేగడిమట్టితో కుమ్మరి బొమ్మలను జేయగలడుగాని కాల్చినమట్టితో జేయజాలడుగదా! నరుని హృదయము లౌకికవాంఛలను దావానలమున బడి దగ్ధమైన వెనుక ఉత్తమాశయముల ప్రభావముచే చక్కని మార్పునొందవలయుననిన సాధ్యముకాదు.
201. ఱాతిముక్కలో నీరు ఇంకజాలని రీతిని ధర్మబోధలు సంసారబద్ధుని మనసున కెక్కజాలవు,- అందెట్టి మార్పును గల్గింపజాలవు.
202. మేకును ఱాతిలో గొట్టజాలము, కాని మట్టిలో సుళువుగ గ్రుచ్చవచ్చును. అటులనే సాధుజనుల హితబోధ లౌకికుని మనస్సున చొరదు, కాని శ్రద్ధ్భాక్తులుగల ఆస్తికుని హృదయమున అతిసులభముగ నాటుకొనును.
203. మెత్తని రేగడిమట్టిపై ముద్రపడును, కాని ఱాతిపై బడదు. అటులనే తత్త్వజ్ఞానము భక్తుని హృదయమున హత్తుకొనునట్లు సంసారబద్ధుని హృదయమున హత్తుకొనదు.
204. వంతెన క్రింద నీరు ఒకవైపునుండి ప్రవేశించి రెండవ వైపునుండి పోవునటుల సాంసారికులకు జేయు ధర్మబోధ ఒక చెవిలోనుండి వారి మనసున బ్రవేశించి రెండవ చెవినుండి పలాయనమగును. వారి హృదయమున రవంతయు మార్పు గలుగదు.
205. లౌకికుని లక్షణమేమి? (ముంగిసను బెంచువాని) కుండలోని ముంగిస వంటివాడు లౌకికుడు. ముంగిసను మచ్చికచేయువాడు ఎత్తుగా గోడలో ఒక కుండ నుంచును, అదియే దానిగూడు. మఱియు, ముంగిస మెడకు ఒక త్రాటినిగట్టి దాని రెండవ కొనకు బరువు నొకదానిని గట్టును. ముంగిస కుండలోనుండి వెలువడి, గోడ దిగి వచ్చి, యిటునటు తిరుగాడును. కాని యేదేని భయము తోపగనే తుఱ్ఱున పైకి పోయి కుండలోదూరి దాగుకొనును. కాని, పాపము, త్రాటి రెండవ కొనను గట్టియున్న బరువు దానిని దిగలాగుచుండుటచే అది యచట చాలసేపు ఉండజాలదు. అటులనే లౌకికుడు జీవితముననెన్నియో యాతనలను అనుభవించి, యెట్లో బుద్ధితెచ్చుకొని, లౌకిక చింతల విడిచి, భగవంతుని శరణుజొచ్చును. కాని, పాపము, దురంతమైన సంసార భారమును, వ్యసనములును వాని నచట నిలువనీయవుకదా! అవి వానిని మఱల సంసార తాపత్రయములోనికి లాగివేయుచుండును!
-ఇంకావుంది