సబ్ ఫీచర్

పసిబిడ్డలకు ‘ప్రాణధార’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన ప్రతి బిడ్డ తల్లిపాలు తాగితే, వారి పెరుగుదల ఆరోగ్యవంతంగా వుంటుంది. అందువల్లనే, ప్రభుత్వం తల్లిపాలు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్న విషయం సర్వవిదితమే. కొందరు తల్లులకు పాలు ఉండవు. అందువలన వారి పిల్లలకు తప్పనిసరిగా గేదె లేదా డబ్బా పాలు పట్టించాల్సి వస్తున్నది.
కొందరు మహిళలు ప్రసవించిన తరువాత వివిధ కారణాలవలన (ఆరోగ్య సమస్యలు) మరణిస్తున్నారు. వీరి పిల్లలకు కూడా తల్లిపాలు లభించవు. ఇటువంటి పిల్లలందరికీ తల్లిపాలను అందుబాటులోకి రాజస్థాన్ ప్రభుత్వం వినూత్నంగా తల్లిపాలు బ్యాంక్‌లను ఏర్పాటుచేస్తున్నది.
రాజస్థాన్ ప్రభుత్వం తొలిసారిగా ఉదయపూర్‌లో ‘జీవన్‌ధారా’ పేరిట తల్లిపాల బ్యాంక్‌ను ఏర్పాటుచేసింది. ఈ బ్యాంక్ విజయవంతంగా పనిచేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా తల్లి పాల బ్యాంక్‌లను ఏర్పాటుచేయడానికి రాజస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. జీవన్‌ధారా విజయంనుంచి స్ఫూర్తిని పొందిన ఫోర్టీస్ లపెమ్మె సంస్థ బ్రెస్ట్ మిల్క్ ఫెడరేషన్ సహకారంతో ఢిల్లీ నగరంలో ‘అమరా’ పేరిట తల్లిపాల బ్యాంక్‌ను ఏర్పాటుచేసి, విజయవంతంగా నిర్వహిస్తున్నది.
పిల్లలు తల్లిపాలు త్రాగడంవలన వారిలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు, పౌష్టికాహార లోపం అనేది ఏర్పడదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఆరు నెలలపాటు తల్లి పాలు త్రాగిన పిల్లలు డబ్బా పాలు లేక పోత పాలు త్రాగిన పిల్లలు కన్నా ఎక్కువ కాలం జీవిస్తారని ది లాన్‌సెట్ అనే సైన్స్ పత్రిక ఇటీవల పదిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది.
మన దేశంలో ఐదు సంవత్సరాలలోపు వయస్సు కలిగిన పిల్లలలో సుమారు 48శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. దేశంలో విరివిగా తల్లి పాల బ్యాంక్‌లను ఏర్పాటుచేయడం వలన పిల్లల్లో ఉన్న పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దే అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో తల్లిపాల యొక్క విశిష్టత కూడా ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు అవగతం అవ్వడానికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఈ తల్లి పాల బ్యాంక్‌లను ఏర్పాటుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.

- పి.్భర్గవరావు