సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

206. వరి పొలముల నడుమనుండు కాలువలలో చేపలను బట్టుటకు వెదురుమావులను బెట్టుదురు. వాని ద్వారములనుండి తళతళలాడుచు నీరు ప్రవహించుచుండుట జూచి చిఱుచేపలు అందు మహోల్లాసముతో బ్రవేశించును. కాని యందొకసారి ప్రవేశించిన వెనుక మఱల నవి తప్పించుకొని పోజాలవు. అటులనే అవివేకులగువారు మాయాసంసార సుఖములచే మోహితులై సంసారమున బ్రవేశింతురు. సంసార జాలమున సులభముగా బ్రవేశింపగలరు గాని వెలువడజాలరు, పాపము! వెదురు మానవులందు చేపలవలెనే వీరును అందు దగుల్కొని దరిగానక బద్ధులైయుందురు.
207. సంసారబద్ధుల కెన్నడును తెలివిరాదు. ఎన్ని దుఃఖములపాలైనను, ఎన్ని యాతనల బడినను, ఎన్నిసార్లు వంచింపబడినను వారు తెలివి తెచ్చుకొనరు. ఒంటెను జూచితిరా? దానికి ముండ్ల తుప్పలనిన ఇష్టము. వాని నది మేసిన కొలదియు ముట్టెనుండి నెత్తురు కాఱుచుండును. ఐన నేమి? వానిని దినుట మానదే! సాంసారికుడు ఎన్నియో యిడుమల గుడుచును. ఎన్నియో పాట్లుపడును. ఐననేమి? కొలదినాళ్లకే అన్నిటిని మఱచును. బహుశః వాని భార్య చనిపోయి యుండవచ్చును. ఇంతలోనే మఱల పెండ్లియాడునుగదా! ఒకవేళ వాని బిడ్డ చనిపోయి యుండవచ్చును, అందులకాతడేడ్చును. కాని కొలదినాళ్లు ఐనంతనే ఆ విషయమునంతయు మఱచిపోవును. బిడ్డ చనిపోవుటచే ఘోర దుఃఖము ననుభవించిన స్ర్తి మఱల నూతన వస్తమ్రులను ఆభరణములను దాల్చి కులుకుచున్నది! కుమార్తెకు పెండ్లిచేసి తల్లిదండ్రులు దారిద్య్ర పీడితులగుచున్నారు. ఐననేమి? ఏటేటను బిడ్డలను గనుచునే యుందురు. ఇక వ్యాజ్యెములచే ధ్వంసమగుచున్నను వానిని నడిపించుచునేయుందురు. ఉన్న బిడ్డలకు అన్న వస్తమ్రులు లేకున్నను ఏటేట కానుపులు! ఒక్కొక్కప్పుడు వీని (సంసారబద్ధుని) గతి కొండెలుకను బట్టుకొనిన పాముగతిని బోలును. అది దానిని మ్రింగనుజాలదు, విడువను జాలదు. ఆతడు ఒకవేళ సంసారము అసారమనియు, అంబాళవు పండువలె సంసారమున నంతయు తొక్కయు టెంకయునేకాక అనుభవింపదగిన గుంజు ఏమియులేదనియు గ్రహించిన గ్రహించుగాక, సంసరమోహమును త్యజించి భగవంతునిపైకి బుద్ధిమఱల్చునా? మఱల్పడే! సంసార తాపత్రయమునుండి తొలగించి వానికి సత్సాంగత్యము కలుగజేసితిమా, నిరుత్సాహియై, దిగులు చెంది, చిక్కిపోవనారంభించును. మాలిన్యమున బుట్టిపెరుగు పురుగును గైకొని బియ్యపుగూనలోనుంచిన యెడల అది యచట బ్రదుకలేక చచ్చునుగదా!
208. ఒకసారి పెరుగు తోడుపెట్టిన కుండలో పాలుపోసి యుంచుట కెవ్వరును సాహసింపరు, పాలు విఱిగిపోవునేమోయను భయము వారిని బాధించును. ఆ కుండను వంట చేయుటకును వినియోగింపరు, నిప్పు మీద బెట్టిన విచ్చిపోవునేమోయని జడియుదురు. కాబట్టి అది యించుమించుగా నిరుపయోగమన్నమాట! అట్లే అనుభవశాలియగు సద్గురువెప్పుడును సాంసారికునకు అమూల్యమగు సద్బోధలను జేయవెఱచును. ఏలన వానికి అపార్థములను గల్పించి నీచమగు స్వకార్యములను సమర్థించుకొనజూచుట నిశ్చయము. కొంచెము శ్రమపడవలసిన సత్కార్యములందు గురువాతని నియోగింపజాలడు. ఏలన తన మంచితనమునుబట్టి గురువు తనవలన ఏదియో లాభము పొందజూచుచున్నాడని యాతడు తలచినను తలపవచ్చును.
209. ప్రారబ్ధకర్మమును సంస్కారములును అడ్డుతగులు చుండుటచే నరుడు సంసారమును త్యజింపదలచినను త్యజింపజాలడు. ఒక రాజు నొకప్పుడొకయోగి తన కడ గూర్చుండి భగవద్ధ్యానము చేయుమనెను. అందులకు రాజిట్లనెను: ‘‘అయ్యా! అది అసాధ్యము. నేను మీ సన్నిధి నుండవచ్చును, కాని నా భోగకాంక్ష యెచ్చటికి బోవును నాయొద్దనే యుండునుగదా! నేనీ అడవిలో నుండిన యెడల బహుశః ఇక్కడనే ఒక రాజ్యమేర్పడవచ్చును. నేను నా భోగముననుభవింపక తీరదుగదా!’’

ఇంకావుంది...