సబ్ ఫీచర్

వంటగది శుభ్రత తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి కుటుంబంలో ఇంట్లో ఏ గది ఉన్నా లేకపోయినా వంటగది శుభ్రత తప్పనిసరి. అది ఇంట్లోవారి సంబంధ బాంధవ్యాలతో పాటు ఇంట్లో వారి శుభ్రత, క్రమ పద్ధతిని కూడా ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఇంటి ఆరోగ్యం ఈ గది మీదనే ఆధారపడి ఉంటుంది. వంటగదిని సక్రమంగా నిర్వహించడం ఇల్లాలికి ఛాలెంజింగ్ జాబ్ అనే చెప్పాలి. ఆరోగ్యవంతమైన కుటుంబం.. శుభ్రమైన వంటగదితోనే సాధ్యం. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి..
* రోజూ ఉదయానే్న స్నానం చేసిన తర్వాత, కనీసం ఉదయానే్న మొహం, కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లాలి. ఇది అలవాటుగా మారితే అనేక అనారోగ్యాలను దూరంగా పెట్టవచ్చు.
* వంటగదిలో తగినంత వెలుతురు, గాలి వచ్చేలా ఉండాలి. గాలి రావడానికి, వెళ్లడానికి వీలుగా కిటికీలను తీసి ఉంచాలి.
* స్టౌ ఉంచిన ప్లాట్‌ఫామ్‌ను, నేలపై పడిన నూనె మరకలను, ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు తుడిచేయాలి. వీటిని అలాగే వదిలేస్తే బాక్టీరియాలకు ఆవాసంగా మారతాయి. అలాగే ప్లాట్‌ఫామ్‌పై వెనిగర్ చల్లి తుడిస్తే బాక్టీరియా చనిపోతుంది.
* వంటగది చెత్తడబ్బాలోని వ్యర్థాలను పారేసి సరిపెట్టుకోకుండా.. చెత్తడబ్బాను రోజూ శుభ్రంగా కడగాలి.
* క్లీనింగ్ కెమికల్స్‌ను ఆహారపదార్థాలు, వంటదినుసులకు దగ్గరగా ఉంచకూడదు. వీటిని విడిగా ఉంచాలి.
* వంటగదిని రోజూ సాధారణంగా శుభ్రం చేయడంతో పాటు పూర్తిస్థాయిలో శుభ్రం చేయడానికి ఒక కేలండర్‌ను మెయిన్‌టైన్ చేసుకోవడం మంచి పద్ధతి. అయితే ఖచ్చితంగా వారానికి ఒకసారి పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలి.
* అలాగే ఏరోజుకారోజు మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫ్రిజ్‌ల్లో తోయకుండా పడేయాలి.
* పురుగుపట్టిన ఆహార దినుసులను కూడా ఎప్పటికప్పుడు పారవేసి శుభ్రం చేసుకోవాలి.
* వంటగది సింక్‌లో అరకప్పు ఉప్పు చల్లి, నిమ్మచెక్కతో రుద్ది పది నిముషాల తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది కడగాలి.
* వంటగదిలో వాడే టవల్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వీటిని డిటర్జెంట్స్‌తో ఉతికి, బాగా ఎండ తగిలే చోట ఆరేయాలి.
* కటింగ్ బోర్డ్, చాకులను వారానికి ఒకసారి బ్లీచింగ్, వెనిగర్ కలిపిన వేడినీటిలో వేసి శుభ్రం చేయాలి. కూరగాయలను ప్లాస్టిక్ కటింగ్ బోర్డుపై తరగినప్పుడు కూరగాయలతోపాటు చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు కూడా ఆహారంలో కలుస్తాయి. కాబట్టి ఉడెన్ కటింగ్ బోర్డు వాడడం మంచిది.
* చిన్న కప్పులో బోరిక్ యాసిడ్ వేసి వంటగది మూలల్లో ఉంచితే బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
* ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనాలు, విషపదార్థాల అవశేషాలు ఆహారపదార్థాలను విషపూరితం చేస్తాయి. *