సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

219. నెమ్ముకొనిన అగ్గిపుల్ల నెంత గీసినను పొగవచ్చునే కాని వెలుగదు. కాని పొడిగానున్న అగ్గిపుల్ల నెంత మెల్లగా గీసినను వెంటనే బుస్సున మండును. ఉత్తమ భక్తుని హృదయమే ఈ యెండిన యగ్గిపుడక. లేశమగు భగవన్నామోచ్చారణమైనను సరియే, వాని హృదయమున భక్త్యగ్నిని ప్రజ్వలింపజేయును. కామినీ కాంచనములలో మునిగితేలుచున్న వాని మనస్సో, నెమ్ముకొనిన అగ్గిపుల్లవలె ప్రబోధ తేజమును పొందదు. అట్టివానికి భగవంతుని గూర్చియెన్ని బోధలు చేసినను భక్త్యగ్ని వాని హృదయమున రగుల్కొననేరదు.
220. లౌకికునకు జ్ఞాని కున్నంత తెలివియు జ్ఞానమునుండవచ్చును, యోగిపడునంత శ్రమను కష్టమును ఆతడు పడవచ్చును, సన్న్యాసి చేయునంత మహాత్యాగమును చేయవచ్చును. కానీ వాని శ్రమయంతయు నిరర్థకము, ఏలన, వాని శక్తిసామర్థ్యములన్నియు పెడత్రోవను నడచుచున్నవి. ఆతడెన్ని పాట్లు పడినను భగవంతునికోసము గాక, సిరిసంపదలు, ఖ్యాతి మొదలగు క్షుద్రమగు భౌతిక విషయముల కోసమే!
221. మకిలపట్టిన అద్దము సూర్యకిరణములను ప్రతిఫలింపజేయజాలదు. అట్లే మాయామోహితులగు మలిన హృదయులును అపవిత్రహృదయులను భగవన్మహిమమును గనజాలరు. కాని నిర్మలమగు నద్దము సూర్యుని ప్రతిఫలింపజేయు రీతిని పవిత్ర హృదయములు భగవంతుని గనజాలుదురు. కావున పవిత్రుడవు కమ్ము.
222. రెట్టింపు నీటితో గలిసిన పాలను గడ్డకట్టిన పాలుగా మార్చుటకు చాలసేపు పట్టును, చాల శ్రమపడవలసి వచ్చును. లౌకికుని మనస్సు దుష్టచింతలు, పాపపుటాలోచనలు అను ముఱికి నీటితో గలిసి చాల పలుచబడిపోయి యుండును. దానిని పరిశుద్ధమొదర్చుకొని ఉత్తమమైన పవిత్ర హృదయమునకు లక్షణమగు బలస్థైర్యములను గలుగజేసికొనుటకు వానికి చాలకాలము పట్టును, అందులకై చాలశ్రమపడవలసి యుండును.
223. ప్రశ్న: లౌకికులు భగవంతుని గాంచుటకై సర్వము ఎందుచే త్యాగముచేయరు?
ఉ: నాటక రంగమునకు వచ్చిన నటుడు వెంటనే తన వేషమును తీసివేయగలడా? లౌకికులను తాము దాల్చిన పాత్రల కనుగుణముగా నటింపనిండు, కాలపరిపాకమున వారు తమ మాయావేషములను తీసివేయుదురు.
224. పూర్తిగా సంసార బంధమున జిక్కిన నరుడు అశుద్ధమున బుట్టి శుద్ధమున జచ్చు పురుగువంటివాడు; వానికి మఱేమియు తెలియదు. అంతటి పరమ నీచమైన లోలత లేని సామాన్య సంసారి ఒకప్పుడు అశుద్ధముమీదను, ఒకప్పుడు మిఠాయి మీదను వ్రాలుచుండు ఈగ వంటివాడు. ముక్తుడు మాత్రమే సదా మకరందమును గ్రోలుచు, ఇతరమును చవిచూడని తేనెటీగను బోలును. (చూ.213, 217)
225. లౌకికుడు మొసలివంటివాడు. ఎట్టి ఆయుధములకైనను దాని చర్మము దుర్భేద్యముకదా! కడుపుపై గొట్టిననే కాని అది చావదు. అదే విధమున లౌకికునకు నీవు ఎంత హితబోధ చేసినను వానిపై వానికెంత వెగటు పుట్టించినను ఆతడు అంటిపట్టుకొనిన విషయములనుండి రుూవలకు లాగిననే కాని తన పరిస్థితులనాతడు గుర్తింపజాలడు.
226. సమస్తమును త్యజించి భగవంతుని పాదారవిందములను ఆశ్రయింపుడని లౌకికులను మీరు కోరినయెడల వారు మీ మాటలను విందురా? వినరు. కావున ఎంతయో ఆలోచించి, అట్టివారి నాకర్షించు నిమిత్తము గౌరనితాయులు (చైతన్యనిత్యానందులు) ఒక యుపాయమును పన్నిరి. ‘‘అన్నలారా! రండు! హరినామస్మరణము చేయుడు.
-ఇంకావుంది