సబ్ ఫీచర్

వేయిన్నొక్క నవలల ‘కొవ్వలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పుస్తకాలు చదవడమంటే రామాయణ, భారత, భాగవతాలు చదవడమనీ, చదవలేకపోతే వాటిని పురాణాలుగా చెబుతూ ఉంటే వినడమనీ, జనబాహుళ్యం అనుకునే రోజుల్లో- తెలుగు పుస్తకాలు చదవడంలో విప్ల వం తెచ్చిన రచయిత కొవ్వలి. తెలుగు చదవడం రాని వాళ్లు ఆయన పుస్తకాన్ని చదవడం కోసం తెలుగు నేర్చుకున్నారంటే అతిశయోక్తి అనిపించుకోదు’’ అన్నారు డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావుగారు. ‘‘నాలో పఠనాసక్తి పెంచడానికి, తరువాత రచయితగా రూపొందడానికి కొవ్వలివారి ప్రేరణ ఉండి ఉండవచ్చు’’ అంటారు పురాణం సుబ్రహ్మణ్యంగారు. ‘‘సరసమైన సంభాషణలతో ఆద్యంతం పాఠకులను ఆకట్టుకొని కథను నడిపించడంలో కొవ్వలి సిద్ధహస్తులు. నేను కలం చేపట్టడానికి ముందు ఆయన నవలలు కూడా ఎన్నో చదివాను. నా రచనల మీద ఆయన ప్రభావం ఉంది. అందుకే నా నవలను ఆయనకే హృదయ పూర్వకంగా అంకితమిస్తున్నాను’’ అన్నారు జి.వి.జి. మాట్లాడే భాషలో రాయడం వల్ల గ్రాంథికవాదుల కోపాన్ని చవిచూడక తప్పలేదు. మధ్యతరగతి ఇళ్లలోని పరిస్థితులు, మనస్తత్వాలను విశే్లషించడంతో బాటు అప్పటికి ఇంకా ఇళ్లకే పరిమితమైన స్ర్తిల కష్ట సుఖాల్ని చర్చించడంతో మరికొందరి కోపానికి గురి కావలసి వచ్చింది. స్ర్తి పాఠకులు దగ్గరవుతుంటే అది జనానికి మరోబాధ..ఇలా ఆ రోజుల్లో ఆయన ఎందరి బాధలనో తన బాధగా ఎదుర్కొనవలసి వచ్చింది. అందరికీ బాధ్యతలు చెప్పడానికి కలం పట్టాల్సి వచ్చింది.
అలా నాటి సమాజంలోని అతి సున్నితమైన సమస్యలెన్నింటినో ఆయ న తన నవలలో చర్చించారు. సమస్యలు సామాన్య మనిషివి కావడం, అందరు చదువుకునే భాషలో రాయడం...నవలలకోసం వెళ్లకుండా, అవే మన దగ్గరకు వచ్చేట్లు అందుబాటులోకి తీసుకొని రావడం, అందరూ కొనగలిగే తక్కువ ధర పెట్టడం వల్ల పాఠకులు పెరిగారు గాని ఒకవిధంగా చెప్పాలంటే ఆయనకు కొంత అన్యాయం జరిగింది. అందుకే అంతటి మహోన్నతులు జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. కొంతమంది ప్రముఖుల అభిప్రాయాల్ని గమనిస్తే ఆ రోజుల్లో ఆయన నవలలు ఎలా ప్రభావితం చేసాయో మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది.
‘మాతృహృదయం గల ఏ తల్లికయినా నా వెయ్యవ రచన ‘మంత్రాలయ’ను అర్పణం చేయాలన్న సంకల్పంతో అందుకు సర్వవిధాలా అర్హతలు గల సాహిత్యాభిమాని, విఖ్యాత సినీమానటి సూర్యకాంతంను ఎన్నుకున్నారు. హృదయ పూర్వకంగా ఈ కావ్యకుసుమాన్ని నేను సమర్పించారు. ఆ తల్లి స్వీకరించింది. ధన్యోస్మి’ అంటూ ఆ నవలను ఆమెకు అంకితమిచ్చారు కొవ్వలి. ‘కృతి స్వీకర్త సప్త సంతానాలలో ఒకటి అనీ, పితృదేవతలను తరింపజేయగల మహా పుణ్యకార్యమని పెద్దలు చెప్పగా విన్నాను. అటువంటి మహత్కార్యానికి నీవు తగుదువమ్మా అని సాహిత్య సార్వభౌమ కొవ్వలి ‘మంత్రాలయ’ అనే కావ్యకన్యకను నాకు అర్పణ చేస్తుంటే కాదనడమెలా?...అందుకే వేవేల కృతజ్ఞతలతో స్వీకరిస్తున్నాను,’’ అంటూ స్వీకరించారు సూర్యకాంతం.ఈ గ్రంథావిష్కరణ సభ 1973 ఆగస్ట్ 3 సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో మద్రాసు పాండీ బజారులోని మధుర కళానికేతన్‌లో జరిగింది. ప్రముఖ నటులు జె.వి. సోమయాజులు నాటి సభకు అధ్యక్షత వహిస్తే, ప్రముఖ హాస్య నటులు రాజబాబు గ్రంథావిష్కరణ చేశారు. ఈ సభలో యామిజాల పద్మనాభస్వామి, చల్లా రాధాకృష్ణశర్మ, దాశరథి, లింగమూర్తి లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఆవిష్కరణ, కృతి సమర్పణ-స్వీకారం కాగానే పి.బి.శ్రీనివాస్ బృందం పాట కచేరీ చేశారు. ఈ సభను బి.బి.ఎస్. పబ్లిషింగ్ హౌస్ వారు నిర్వహించారు.

-డాక్టర్ వేదగిరి రాంబాబు సెల్: 9391343916