సబ్ ఫీచర్

పీచుపదార్థం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్సర్లు, గుండెపోటును దూరంచేసే దినుసు మన ఇంట్లోనే ఉందని చాలామందికి తెలియదు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కువ కాలం జీవించడానికి ఇది సూపర్‌ఫుడ్.. సహజంగానే ఇది గుండెపోటు, మెదడుపోటు అవకాశాలతో పాటు, జీవితకాలం వేధించే టైప్-2 డయాబెటిస్ వంటి వ్యాధులనూ దూరంగా ఉంచుతుంది. శరీర బరువు, రక్తపోటు, కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండటానికి దోహదం చేస్తుంది ఇది. అంతేకాదు.. ఇది చాలా చౌకైన ఆహారం.. ఇంతకీ అదేంటో చెప్పలేదు కదూ.. అదే ఫైబర్.. పీచుపదార్థం. ఇది అత్యంత ఆకర్షణీయమైన ఆహారమేమీ కాదు కానీ మనం ఎంత ఫైబర్ తినాలి అనే అంశంపై చేసిన పరిశోధనల్లో దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించారు. మలబద్ధకాన్ని ఈ ఫైబర్ తగ్గిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే.. కానీ పీచుపదార్థం వల్ల అంతకన్నా విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఒక వ్యక్తి రోజుకు 25 గ్రాముల ఫైబర్ తినాలని న్యూజిలాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఒటాగో పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇది తగినంత మోతాదు అనీ, నిజానికి రోజుకు 30 గ్రాముల ఫైబర్ తినడం వల్ల ఇంకా అధిక ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. 120 గ్రాములున్న అరటిపండులో సహజమైన చక్కెరలు, నీరు తీసేస్తే.. కేవలం మూడు గ్రాముల ఫైబర్ మాత్రమే శరీరానికి అందుతుంది. ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు రోజుకు 20 గ్రాముల కన్నా తక్కువ ఫైబర్ తింటున్నారు. బ్రిటన్‌లోప్రతి పది మంది వయోజనుల్లో ఒకరికన్నా తక్కువమంది మాత్రమే రోజు 30 గ్రాముల ఫైబర్ తింటున్నారు. సగటున మహిళలు రోజుకు 17 గ్రాములు, పురుషులు 21 గ్రాముల ఫైబర్ తింటున్నారు.
* పండ్లు, కూరగాయలు, పూర్ణ్ధాన్యాల రొట్టెలు, కాయధాన్యాలు, పాస్తాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
* బీన్స్, పప్పులు, సెనగలు, గింజలు వంటివాటిల్లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది.
* ఓట్స్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ఉదయంపూట అల్పాహారం తీసుకుంటే మంచిది.
* తృణధాన్యాల్లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
* సెనగలు, బీన్స్, పూర్ణ్ధాన్యాలను కూరల్లో కలిపి వండుకుంటే కూడా శరీరానికి ఫైబర్ బాగా అందుతుంది.
* మధ్యమధ్యలో స్నాక్స్‌గా గింజలు, తాజా పండ్లు తినడం వల్ల కూడా శరీరానికి పీచు పదార్థం అందుతుంది.
* రోజుకు కనీసం ఐదో వంతు పండ్లు, కూరగాయలు తినడం మంచిది.
ప్రయోజనాలు
పరిశోధకులు 185 అధ్యయనాలను, 58 క్లినికల్ ప్రయోగాలను విశే్లషించి.. ఫలితాలను ద లానె్సట్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు. రోజుకు 15 గ్రాముల కన్నా తక్కువ ఫైబర్ ఆహారం తీసుకునే వెయ్యిమందిని, రోజుకు 25 నుంచి 29 శాతం ఫైబర్ తీసుకునేలా మార్చితే.. దానివల్ల 13 మరణాలు, ఆరు గుండెపోట్లను నివారించవచ్చునని ఈ అధ్యయనం చెబుతోంది. టైప్-2 డయాబెటిస్ స్థాయి తక్కువగా ఉండటం, పెద్ద పేగు కేన్సర్ అవకాశాలు తగ్గిపోవడంతో పాటు.. బరువు, రక్తపోటు, కొవ్వు స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఎంత ఎక్కువ ఫైబర్ తింటే అంత మంచిదని కూడా అధ్యయనం సూచిస్తోంది.
* ఫైబర్ వల్ల శరీరానికి పెద్దగా ఉపయోగం లేదని, మానవ శరీరం దానిని జీర్ణం చేసుకోలేదని గతంలో భావించేవారు. కానీ ఫైబర్ వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. చిన్నపేగు కొవ్వును గ్రహించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక పెద్దపేగుల్లో కోట్ల సంఖ్యలో ఉండే బాక్టీరియాకు ఆహారం లభిస్తుంది.
* పెద్దపేగులో ఉన్న బాక్టీరియా ఫైబర్‌ను పులియబెడుతూ అనేక రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తంపై ప్రభావం చూపుతాయి.
* ఫైబర్, ముడి ధాన్యాలు, కూరగాయలు, పండ్లు అనేవి ఆరోగ్యకమైన ఆహారం అనే విషయం కొత్తకాదు. అయితే తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు ప్రజాదరణ పొందడంతో ఫైబర్‌ను ప్రజలు విస్మరిస్తుండటం ఆందోళకరం. ప్రజలు తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంత మొత్తంలో ఫైబర్ తినాలి అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను రూపొందించటం కోసం ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.