సబ్ ఫీచర్

ప్రజాస్వామ్యానికి సివిల్ సర్వెంట్లే మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సివిల్ సర్వీసులకు మార్గదర్శక సూత్రాలు భిన్నస్థాయిలో వడపోతల తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా 1078 మంది విజేతల్ని ప్రకటిస్తే అందులో 67 మంది తెలుగు విద్యార్థులు రాణించడం హర్షణీయం. అందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విజేత ఫలితాల్లో చోటుచేసుకోవడమన్నది గ్రామీణ భారతానికే గర్వకారణం. సామాజిక ఆర్థిక ప్రతిబంధకాలు ఎన్నిఉన్నా పట్టుదల, దృఢ సంకల్పం, ఎలాగైనా తాము రాణించాలన్న మొక్కవోని ధైర్యంతో సివిల్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) నిబంధనల్లో చేసిన గణనీయమైన మార్పులవల్ల, లక్ష్యానే్న ఏకైక ధ్యేయంగా ఎంచుకొన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు గణనీయంగా లబ్దిపొందారన్న విషయం ఫలితాల్లో తేటతెల్లమయింది. ముఖ్యంగా గణితం, ఆంగ్లంపై పట్టును పరీక్షించే సీశాట్‌కు గతంలో ప్రాధాన్యం ఉండేది. వీటిల్లో ఉత్తీర్ణులు కాకపోతే ఇతరేతర సబ్జెక్టుల్లో ఎంతగా రాణించినా ప్రయోజనం లేకపోయేది. ఈ అంశంపై దేశవ్యాప్త ఆందోళన అనంతరం సీశాట్ మార్కుల్ని మూడోవంతుకు పరిమితం చేయడంతో గ్రామీణ విద్యార్థుల విద్యాశ్రమ మంచి ఫలితాల్ని రాబట్టగలిగారు. గత ఏడు జూలై నాటి సివిల్స్ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ అనే అభ్యర్థిని తొలి ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించగా, ద్వితీయ, తృతీయ చతుర్థ ర్యాంకుల్ని కూడా అమ్మాయిలకే దక్కింది. ఈసారి అలా కాకుండా తొలి ప్రయత్నంలోనే ఢిల్లీకి చెందిన టినాదాబి అనే అమ్మాయి సాధించగా, తెలుగు రాష్ట్రాల్లో ఒక అటెండర్ కూతురు, ఓ ఆటోడ్రైవర్ కుమారుడూ పట్టుదలతో సమున్నత లక్ష్యాల్ని సాధించి స్ఫూర్తిదాతలుగా నిలచారు.
పాలక ప్రభుత్వాల తీరు, ఆ ప్రభుత్వాలలోని మంత్రులు ఇతర నాయక దిగ్గజాల తీరు ఎలా వున్నా రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని అందులోని ప్రజలకు అండదండలుగా నిలిచి, ప్రజలకు రాజ్యాంగం సమకూర్చిన పూర్తి హక్కులు నిక్షేపంగా అమలుజరిపే రీతిలో సివిల్ అధికారులు పూనుకొంటే ప్రజాస్వామ్యం మూడు పూవులు ఆరుకాయలుగా రాణిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరచాల్సిన అధికారులు వీరే. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రభుత్వపరమైన ఒత్తిళ్ళకు సివిల్స్ అధికారులు తల వొంచితే పాలన అస్తవ్యస్తమవ్వడమే కాకుండా ఏ అండా లేని నిర్భాగ్యులు నిలువునా బలైపోతారు. ఏ పరిపాలన అయినా సమర్ధవంతంగా ఉండాలంటే నిబంధనల్ని గుదిగుచ్చి పని పోకడల్ని నిర్దేశిస్తే సరిపోదు రాజ్యాంగబద్ధంగా వాటిని పర్యవేక్షించే సివిల్ అధికారులు సరైన వారుండాలని 1955లోనే రాజగోపాలాచారి, సర్దార్ వల్లబాయ్‌పటేల్ ఆనాడే దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకొని అమలు జరపాలని సివిల్స్ అధికారుల్ని ఆదేశించినా చట్టనిబంధనలు ఒప్పవంటూ సున్నితంగా తోసిపుచ్చిన అధికారులకేం కొదవలేదు.. నిబద్ధతగల ఉద్యోగి స్వామ్యం.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే మాసిపోయింది.
బారతావని పరివర్తనకు ప్రతిస్థాయిలో ప్రతి ఒక్కరూ మార్పునకు ప్రతీకలుగా నిలవాలని ఇటీవల సివిల్ సర్వీసెస్ దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఉద్బోధించారు. సామాజికపరంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, పేదరిక నిర్మూలనకు, వారికి సక్రమ న్యాయమందించేందుకు జిల్లా సచివాలయ అధికారి పూనుకొంటే ఆయా జిల్లాలలో పేద సాదలకు అంతో ఇంతో న్యాయం చేకూరుతుందనేది నిర్వివాదాంశం. పేదరికం, దుర్భర దారి ద్య్రం వెసులుబాటు లేని జన జీవితాలకు సివిల్స్ అధికారులు చొరవ చూపి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంచేసే జనాల అగచాట్లు తీరుతాయి. పాలక నేతల లేదా ప్రజాప్రతినిధుల మాటలకు తలవొగ్గి, జిల్లా అధికారులు ప్రవర్తిస్తే ఏకపక్ష న్యాయంతోపాటు, పేద సాదలు మరిన్ని అన్యాయాలకు గురవుతారు.
సమాజానికి మంచి చేయాలన్న తపన ఉంటే చాలు- నేటి తరం సివిల్ సర్వెంట్ల సృజనాత్మక శక్తితో సవాళ్ళను అధిగమిస్తూ ప్రజానీకానికి ఉత్తమ సేవలందించే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రమోషన్ల కోసం రాజకీయ అవినీతి నేతల మోచేతి నీళ్ళు త్రాగడంకంటే ప్రజలకు సేవచేయాలనే సద్బుద్ధితో జిల్లా సచివాలయ అధికారులు వ్యవహరిస్తే అవినీతి నాయకులు తోకలు ముడుస్తారు. అలాంటి కోవలో తమిళనాడు సగాయం, హరియాణా భెంకా, కర్ణాటకలోని తుముకూరులో శాలినీరజనీశ్ ప్రజలకు ఆరాధ్యులైన అధికారులుగా గుర్తించబడ్డారు. సివిల్ సర్వీస్ అధికారుల్ని ప్రజా సమస్యలకు స్పందించే వారిగా, పారదర్శకత, జవాబుదారీతనంతో రుజువర్తనులుగా తీర్చిదిద్దడానికి హోడా కమిటీ సిఫార్సులు ఆమోదయోగ్యమైనవి. నరేంద్రమోదీ ప్రభుత్వం సివిల్ సర్వీస్ అధికారులకు ప్రజలకు మెరుగైన సేవలందించే విషయంలో తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. ముఖ్యంగా కొత్తతరం సివిల్ సర్వీసెస్ అధికార్లకు ఇటువంటి ప్రోత్సాహం ఎంతో ప్రయోజనకరం. రాజకీయ నాయకులు సివిల్ సర్వెట్ల పనితీరులో ఏవిధమైన జోక్యం కలిగించుకోకుండా ఉంటే మనదేశంలో ప్రజాస్వామ్యం మరింత పారదర్శ కంగా మనగలుగుతుంది.
ప్రజాస్వామ్యమనే దేహానికి సివిల్ సర్వెంట్లు అస్థిపం జరం వంటివారు. వీరి దన్నుతోనే వ్యవస్త ముందుకెళు తుంది.

- దాసరి కృష్ణారెడ్డి