సబ్ ఫీచర్

ప్రాంతీయతత్వం ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలు వలె వెలిగిపోతున్నదనడంలో సందేహం లేదు. ప్రజలు అవినీతి పరులను అం దలం ఎక్కిస్తున్నారు. వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని అకృత్యాలు చేసినా వారిని ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. హంతకులను దోపిడీదారులను ఎన్నుకుంటున్నారు. ఖైదులో శిక్ష అనుభవిస్తున్నవారిని కూడా గెలిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదే కాబోలు. ఆ సేతు హిమాచలం మనమంతా ఒకటే అనే భావన క్రమంగా నశించిపోతోంది. అధికారం సంపాదించడానికి ఎన్నికల్లో గెలవాలి. అందుకు విపరీతంగా ఖర్చుచేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు తప్పు అని న్యాయస్థానాలు చెప్పవు. ఎన్నుకున్న ప్రజలు వారిని బహిరంగంగా నిలదీయాలి. అలా జరగడంలేదు. ఇలా పార్టీలు మారేవారు పదవులకోసమే కానీ ప్రజాసేవకి కాదు.
మన దేశంలో ఉన్నన్ని రాజకీయ పార్టీలు ఏ దేశంలోను వుండవు. స్వాతంత్య్రానంతరం కుల మత ప్రాంతీయ పార్టీలు విజృంభించిపోయాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశమని కేంద్ర ప్రభుత్వం ఏదో పరాయి ప్రభుత్వమని భావిస్తున్నారు. అందువల్ల అనేక ప్రాంతీయ పార్టీలు వెలిసాయి. స్థానిక ప్రజలు ఆ పార్టీలను గెలిపిస్తున్నారు. జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తేడా చాలామందికి తెలియదు. ఎన్నికల ముందు ఓటర్లకి బహుమానాలు ఇవ్వడం అవినీతి కాదా? ఎవరు ఎక్కువ బహుమతి ఇస్తే వారికి ఓటు వేస్తున్నారు. దేశ సమగ్రత గురించి ఎవరూ ఆలోచించడంలేదు. ఒక ప్రాంతీయ పార్టీ విజయం చూసి మరో ప్రాంతంవారు కొత్త పార్టీ పెట్టి విజయం సాధిస్తున్నారు. కొందరు పదవి కోసం కొత్త పార్టీలు పెడుతున్నారు. ఇటీవల భారతీయ జనతాపార్టీ అఖండ విజయం సాధించించిది. నేటి పరిస్థితులు పరిశీలిస్తే ఈ విధంగా ముందు కూడా ఏదో ఒక జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటుందనే నమ్మకం కలగడంలేదు. పార్లమెంటుకి ఎన్నుకునే అభ్యర్థులు ఏదో ఒక జాతీయ పార్టీకి చెందినవారు వుండాలి. ఇది దేశానికి సంబంధించిన విషయం. కేంద్రం బలంగా ఉన్నప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తుంది. నేటి ప్రతిపక్ష పార్టీలవారు అధికార పార్టీలను ఏదో విధంగా తొలగించాలనే కృషి చేస్తున్నారుకానీ దేశాభివృద్ధికి సూచనలిచ్చి అధికార పార్టీతో సహకరించడంలేదు. పార్లమెంటు జాతీయ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవడం మంచిది అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. వివిధ ప్రాంతీయ పార్టీల ఎంపీలు దేశాన్ని పాలించడం ఎలా? అందుకు కొందరు పార్టీలు ఫిరాయుస్తున్నారు. కొన్ని పార్టీలు మరి కొన్ని పార్టీలతో కలిసిపోతాయి. ఈ విధంగా కేంద్ర పాలన ఒక కలగూర గంపవలె తయారవుతున్నది.
తమిళనాడు కేరళ తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా మొదలైన రాష్ట్రాలు మొదలైన రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల మయం. వివిధ పార్టీల పొత్తు వలన కేంద్రంలో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తాలూకు వ్యక్తి ప్రధాని అవుతాడు. అలాంటి వారికి అధికార బలంతో తమ స్వంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరిక కలుగుతుంది. కొందరు స్వంత రాష్ట్రానికి ఏం చేశారు అని ప్రధానిని రాష్టప్రతిని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంకుచిత భావాలు పెరగడానికి ముమ్మాటికీ ప్రాంతీయ పార్టీలే కారణం. దేశానికి జాతీయ భాష హిందీ. దీనిపై రాష్ట్రాలు శ్రద్ధ చూపడం లేదు. దేశానికి అనుసంధాన భాష అత్యవసరం. ఇది ఇంకా ఇంగ్లీషే కావడం దురదృష్టం. హిందీ అనుసంధాన భాషగా ఎదగడానికి కేంద్రం కృషి చేస్తున్నది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు సహకరించాలి.
న్యాయస్థానాలు పార్లమెంటు గట్టి కృషి చేసి ప్రాంతీయ పార్టీలను నిషేధించాలి. దేశ సమగ్రతకు ఈ విధానాలు దోహదం చేస్తాయి. త్రిభాషా సూత్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఇంగ్లీషు మీడియం స్కూళ్లను రద్దు చేయాలి. ఇంగ్లీషు ఒక భాషగా నేర్పుతున్నప్పుడు ఇంగ్లీషు మీడియం సూళ్లు ఎందుకు? ప్రతి రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలి. మేము హిందీ వ్యతిరేకులం అని బాహాటంగా ప్రకటించేవారు జాతీయ సమైక్యతకు వ్యతిరేకులు కాదా? ప్రాంతీయ తత్వం ఏ విధంగా వెర్రి తలలు వేసింది పాలగుమ్మి పద్మరాజుగారు తమ ‘రెండవ అశోకుని మూణ్ణాళ్ల పాలన’ అను నవలలో చక్కగా చిత్రీకరించారు. తెలుగు భాషలో ఇది ఒక చక్కని రాజకీయ వ్యంగ్య రచన. సంఘటనలు అన్ని వాస్తవాలను పరిశీలించి రాయబడినవే. ఇప్పుడు పిల్లలకు నేర్పవలసింది సెక్యుఎడ్యుకేషన్ కాదు జాతీయ సమైక్యతా భావం.

- వేదుల సత్యనారాయణ