సబ్ ఫీచర్

విజయం పొందాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు పరీక్షల సమయం వచ్చేసింది. సబ్జెక్టుల వారీగా ఉన్న కాలాన్ని విభజించుకుంటే విజయం సొంతమవుతుంది. పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందుకోసం సబ్జెక్టులకు అనుగుణంగా కాలాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలి.
1. స్వల్పకాలికం 2. మధ్యకాలికం 3. దీర్ఘకాలికం.
ఆమోదయోగ్యంగా, వాస్తవానికి దగ్గరగా సాధించగలిగే ఒకటే లక్ష్యాన్ని నిర్ణయించుకొని, అది ఏ కాలంలో సాధించాలో అనుకోవాలి. చదువుమీద లక్ష్యం, శ్రద్ధ పెట్టాలి. మీతో మీరు చేసుకుంటున్న ఒప్పందం అని మర్చిపోకండి. అవి సాధించానికి తగిన స్టెప్స్ ఈక్షణం నుండే మొదలుపెట్టండి. బాధలను కూడా బాధ్యతలుగా మలచుకోగలిగితే అంతా ఆనందమే. నలుగురితో మాట్లాడటానికి వెనుకంజ వేసేవారు ముందుగా చిన్న పిల్లలతో మాట్లాడటం ప్రారంభించాలి. తరువాత ఒక స్నేహితుడితో కబుర్లు చెప్పాలి. ఆపైన ఫ్రెండ్సుని కలిసినపుడు వారు ఏది మాట్లాడుతున్నారో వింటూ సందర్భోచితంగా ఒక రెండు మాటలు ఆలోచించి మాట్లాడాలి. అవి ఎవ్వరినీ నొప్పించని విధంగా ఉండాలి. కమ్యూనికేషన్స్ పెంచుకోండి. సాధించాలనుకున్న లక్ష్యానికి తగిన ప్లానింగ్ వేసుకోవాలి. అద్భుతాలు ఒకేసారి చేయడం అసాధ్యం కనుక మన లక్ష్యాన్ని మూడు భాగాలుగా చేయాలి. ప్రస్తుతం చేతిలో వున్న పని చేయాలి. విజయం సాధించడానికి అపజయాలు ఎదుర్కోక తప్పదు. ముళ్ళబాటను దాటుకుంటూ ఆటంకాలను ఎదుర్కొంటూ, సమస్యలను పరిష్కరించుకుంటూ, వాటినుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. అదొక నిరంతర ప్రయాణమే తప్ప గమ్యం కాదని అనుభవజ్ఞులకు తెలుసు. చరిత్రలో అపజయాలను అవకాశాలుగా మార్చుకున్న వారెందరో ఉన్నారు. అభద్రతాభావాన్ని వెంటనే మానేయాలి. దేవుడికేం కోపం రాదు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉందనుకోవడం హాస్యాస్పదం. దేవుడికి రోజూ ప్రొద్దునే్న ఒక నమస్కారం చేసుకోండి చాలు. మీ చదువునే దైవంగా, బాధ్యతను భక్తిగా మార్చుకోండి. సమస్యలలో చిక్కుకున్న యువతరం వాటిని తెలివిగా పరిష్కరించుకుని, అద్భుతాలు సాధించాలి. ఒక అపజయం కలిగినపుడు ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. కమ్యూనికేషన్, ఆరోగ్యం ఇతర వ్యక్తిగత వికాస లక్షణాలను పెంచుకోవాలి. అపజయాలను విజయాలుగా మార్చుకోవడం అసాధ్యం కాదనే సత్యాన్ని గుర్తించండి. విజయం మీదే. ప్రశాంతంగా ఆలోచించండి. తెలివి ఒకరి సొత్తు కాదు. అందుకోగలిగే జిజ్ఞాస వున్నవారికి ఆకాశమంత వుంది. ప్రయత్నంలో ఒకింత పట్టుదలతో కూడిన ప్రయత్నం చేయాలి. అపుడు అనుకున్నదంతా సాధించగలరు. చదువును ప్రారంభించినపుడు రోజురోజుకూ అందులోని లోతుపాతలను తెలుసుకుంటూ ప్రజ్ఞను పెంచుకుంటూ ఉండాలి. ఉన్నత విద్యార్థిగా ఎదగటానికి కృషి, తగిన సాధన ఉంటే చాలు. బలమైన కోరిక కలవారెవ్వరైనా అభ్యాసనతో అనుకున్నది సాధించవచ్చు. ప్రావీణ్యతను పెంచుకోవచ్చు. కమ్యూనికేషన్స్ స్కిల్స్‌ని పెంపొందించుకున్న వ్యక్తి సమాజంలో తాను అనుకున్న స్థితిని అందుకోగలడు. చదివేటపుడు నాన్‌స్టాప్‌గా చదవడంకన్నా, గంటకోసారి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకుని చదివితే మరీ మంచిది. బద్ధకానికి గుడ్‌బై చెప్పండి. ఉదయం లేవగానే ఈ రోజు మంచిరోజు, అన్నీ బాగా జరుగుతాయి అని అనుకుంటూ పని ప్రారంభించండి. దానివలన కొంతవరకైనా నెగెటివ్ ఆలోచనలు అరికట్టవచ్చు. అన్నిటికీ భయపడటం మానేయండి. ఏ తప్పు చేయనపుడు భయమెందుకు. ఇక భవిష్యత్తు గురించి ఈ రోజు వర్రీ అవ్వడం వేస్ట్.
సూచనలు
* రెండు రోజుల ముందే హాల్ టికెట్టును కళాశాల నుండి తీసుకోవాలి.
* పరీక్షరోజునే సిలబస్ అంతా వేగంగా చదవడం మంచిది కాదు. దీనికి బదులు దీనికంటే చిన్న టిప్స్ రూపంలో రాసుకుని చదువుకోవడం ఉత్తమం.
* ఇంటి నుండి పరీక్షా కేంద్రానికి చేరే సమయాన్ని లెక్కించి మొదటిరోజు అరగంట మునుపే చేరాలి. తరువాత రోజుల్లో ఆలస్యంగా వెళ్లమని కాదు.. ప్రతిరోజూ సమయంలోగా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి.
* ప్రశ్నాపత్రం ఇచ్చిన తరువాత ప్రశాంతమైన మనస్సుతో దాన్ని ఆసాంతం ఒకసారి చదవాలి. తెలియని ప్రశ్నలు ఉంటే భయపడకూడదు. ప్రశ్నపత్రాన్ని మరలా రెండోసారి కూడా చదవాలి. అప్పుడే కొద్దిగా కంగారు తగ్గుతుంది.
* జవాబులు రాసేముందు జవాబుపత్రంపై హాల్ టికెట్ నంబరు వేయాలి. దిద్దుళ్లు, కొట్టివేతలు లేకుండా జాగ్రత్తపడాలి.
* హాలులోకి వెళ్లేముందు జేబుల్లో, బాక్సుల్లో ఏమైనా అభ్యంతరకర కాగితాలు ఉన్నాయేమో అని చూసుకోవాలి.
* ప్రశ్న సరైనదా, కాదా అనే విషయమై మీ స్నేహితులతో ఎలాంటి చర్చలకూ తావివ్వద్దు. ఎక్కువమంది రాసింది సరైన జవాబు అనుకుని, మీరు రాసింది తప్పని డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. మీ తరగతి ఉపాధ్యాయుణ్ణి మాత్రమే కలుసుకుని దీనిపై మాట్లాడాలి. ఏది ఏమైనా గుడ్‌లక్. మీరందరూ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ..

- సి.నాగేశ్వరరావు 9642300824