సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనక చక్రవర్తి యటువంటివాడు. ఆతడు రాజర్షి. కాని ఆకస్మికముగా జనకుని వంటివారగుట పొసగదు. జనక మహారాజు లోక వ్యవహార కల్లోలమునకు దూరముగా, ఏకాంతవాసము చేయుచు, భక్తిసాధనలను ఎన్నో సంవత్సరములు సాగించియుండెను. కావున గృహస్థులు అప్పుడప్పుడు ఏకాంతవాసము చేయుచు, ఒక్కొక్కసారి మూడేసి దినములైనను అటులుండుచు, భగవత్సాక్షాత్కారమును పొందునిమిత్తము సాధనలుచేయుట మిగుల శ్రేయస్కరము.
273. ఒకనాడు కొందఱు బ్రాహ్మసమాజపు బాలురు తాము జనకుని ఆదర్శముననుసరించుచు సంగము లేకుండ సంసారమున మెలగుచుంటిమని నాతో జెప్పిరి. నేనిట్లంటిని: ‘‘జనకుడనైయున్నానని చెప్పుట సులభమే, కాని జనకునివలె వర్తించుట వేఱు విషయము.
ఏ విధమైన సంగమును, మాలిన్యమును బొందకుండ, ఐహిక విషయముల నడుమ మెలగుట అతి దుర్ఘటము. ప్రారంభ దశలో జనకుడు ఎట్టి కఠిన నియమముల నవలంబించెనో, తపమొనరించెనో తెలియునా? కాని మీరందఱును అట్టి కఠిన నియమముల నవలంబింపుడని చెప్పను. ప్రశాంతమైన తావున ఒంటరిగా కొంత కాలము నివసింపుడని మిమ్ము కోరుచున్నాను. జ్ఞానమును భక్తిని సంపాదించుకొని మీరపుడు సంసారమున బ్రవేశింపవచ్చును. పాలు కదలకుండ ఒకచోట బెట్టినప్పుడే గట్టి పెరుగుగా తోడుకొనును. కదల్చినను, ఒక కుండలోనుండి మఱియొక కుండలోనికి మార్చినను పెరుగు చెడును.
జనకుడు నిస్సంగుడు. అందువలన నాతనికి ‘‘విదేహుడు’’అను పేరు వచ్చినది. అతడు జీవన్ముక్తుడై మెలగెను. దేహబుద్ధిని నిర్మూలించుకొనుట మహాకష్టసాధ్యము. జనకుడు నిజముగా మహావీరుడు! ఒక చేత జ్ఞానము, రెండవ చేత కర్మమునను ఖడ్గములను అవలీలగా ధరించిన ధీరుడు!’’
274. సంసారముననుండియు బ్రహ్మజ్ఞానమును బొందవచ్చునని జనకునెల్లప్పుడు ఉదాహరణముగా జెప్పుచుందురు. కాని, మానవ చరిత్రయందంతటను ఆతడొక్కడే యిందులకు ఉదాహరణము. సర్వసాధారణముగా నిట్లెన్నడును జరుగదు. జనకుని సంగతి వేఱు.
కామినీ కాంచన త్యాగము చేయనిదే ఎవ్వడును బ్రహ్మజ్ఞానము పొందజాలడు; ఇదియే సర్వసాధారణ నియమము. నీవును ‘జనకుడ’నని తలపకుము, ఎన్నియో శతాబ్దములు గడచినవి కాని ప్రపంచములో ఇంతవఱకు మఱియొక జనకుడు పుట్టలేదు.
275. నిస్సంగుడవై సంసారమున వర్తింపగోరుదువేని ఒక సంవత్సరమో, ఆరునెలలో, ఒక్క నెలయో, తుదకు పట్టుమని పండ్రెండు దినములో- కొంత కాలము ఏకాంత స్థలమున మొదట భక్తిసాధన చేయవలయును. ఇట్టి యేకాంత వాస సమయమున భగవంతుని గూర్చి నిరంతర ధ్యానము చేయుచు, భక్తిని ప్రసాదింపుమని వేడుకొనవలయును. ఈ ప్రపంచములో నీవు నీదనుకొనదగినది ఇసుమంతయు లేదను భావము మననము చేయదగును. నీవు ‘నావారు’అనుకొనునట్టివారు ఎప్పుడో యొకప్పుడు నిన్ను విడిచిపోవువారేయని మఱల మఱల స్ఫురణకు దెచ్చుకొనుచుండుము. భగవంతుడొక్కడే నీవాడు. ఆతడే నీ సర్వస్వము, నీ పెన్నిధి. ఈ మహాలాభమును బొందుట ఎట్టులను చింత యొక్కటియే నీకు ఉండదగినది. (చూ.633.)
276. ధ్యానాది సాధనలు చేయు సమయమున వానిని జూచి హేళన చేయునట్టి వారినుండియు, సాధువులను సాధుత్వమును నిరసించి వెక్కిరించు వారినుండియు దూరముగా తొలగి వర్తింపుము.
277. చేతులకు ముందుగా నూనె రాచుకొని పనసపండు ఒలిచిన యెడల జిగురు అంటుకొని నిన్ను బాధింపకుండును. ముందుగా పరమాత్మ జ్ఞానమను రక్షనుబూని పిమ్మట సిరిసంపదల మధ్యమున- సంసార వ్యామోహముల నడుమ- నీవు నివసించినను అవి నినె్నంత మాత్రమును బాధింపజాలవు.
278. దిక్సూచీయంత్రమందలి (అయస్కాంతపు) ముల్లు ఎప్పుడును ఉత్తర దిశను జూపుచుండును. అందువలన ఓడ దారి తప్పకుండా పోగల్గుచున్నది. అట్లే మానవుని హృదయము భగవంతునివైపు త్రిప్పబడియున్నంతవఱకు ఆతడు సంసార సాగరమున దారి తప్పకుండ వర్తింపగలడు.
ఇంకావుంది..
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి