సబ్ ఫీచర్

హామీలు అమలు పరచాల్సిన తరుణమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షీలా దీక్షిత్ న్యూఢిల్లీ ముఖ్యమంత్రిణిగా ఉన్నప్పుడు నాల్గువందల కోట్ల వాటర్ ట్యాంక్ కుంభకోణం జరిగింది. కొత్త ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ గత సంవత్సరానికి పైగా ఈ అవినీతిని వెలుగులోకి రానీయకుండా కాపాడాడు. దీనిపై ముందు పోలీసులు ఎఫ్ ఐఆర్ దాఖలు చేశారు. ఇక రాబర్ట్ వాద్రా భూముల కుంభకోణానికి సంబంధించి ఏక సభ్య కమిషన్ నియమింపబడింది. దానికి హైకోర్టు జడ్జి డింగ్రా నాయకుడు. ఆయన మచ్చలేని మనిషిగా పేరుపొందాడు. ఇపుడు తన విచారణ కాల పరిమితిని రెండు నెలలు పెంచవలసిందిగా కోరాడు. దీనిని కాంగ్రెసు నాయకులు కెఫ్టెన్ అజయ్ సింగ్ యాదవ్ వంటి వారు తప్పు పట్టారు. ఈ డింగ్రా బిజెపి వారి నుండి లంచాలు తీసుకొన్నాడంటూ ఒక ఇంగ్లీషు చానల్‌లో బహిరంగంగా ఆరోపించారు. ఇది దుర్మార్గం. కమిషన్ ఆఫ్ ఎన్‌క్వైయిరీ ఆఫ్ యాక్ట్ 10-5ఎ ఇది అజయ్ సింగ్ యాదవ్ పై వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవలసి వుంది. పఠాన్ కోట వాటి తర్వాత కుప్వారాదాడి, శ్రీనగర్‌లో దాడి, వరుసగా జరిగి పోతూనే ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో మొన్న కొందరు ఉగ్రవాదులు పట్టుబట్టారు. వీరు ఐసిస్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారు. వీరికి డబ్బు, ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయి? భాగ్యలక్ష్మి దేవాలయం, గణేశ దేవాలయం, జామా మసీదు బోనాలు ఉత్సవాలను వీరు టార్గెట్ చేసుకున్నట్లు నిఘా విభాగం అధికారి సంజయ్ కుమార్ వెల్లడించారు. దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడవలసిందే.
2014 లో జరిగిన సాధారణ ఎన్నికలలో దేశ ప్రజలు నరేంద్రమోదీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. మోదీ పరిపాలన మొదలైన తర్వాత రెండేళ్లపాటు మేక్ ఇన్ ఇండియా, కల్యాణ లక్ష్మి, స్వచ్ఛ భారత్ వంటి నినాదాలతో కాలక్షేపం చేశారు. అంటే రెండేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. ఇంక మిగిలింది రెండు సంవత్సరాలు. 2018లో మళ్లీ సాధారణ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. అంటే మోదీ చేయగలిగింది చేయాలనుకొంది ఉంటే ఈ రెండేళ్లలో చేసి చూపించాలి.
నరేంద్రమోదీ అధికారంలోకి రావడం చైనాకు పాకిస్తాన్‌కు ఇష్టంలేదు. అందుకే ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామంలో పశువుల కాపరిని గ్రామస్థులు కొడితే దానిని అంతర్జాతీయ సమస్యగా ప్రచారం చేశారు. కర్ణాటక ఒక హేతువాది శివలింగాల మీద మూత్రం పోయండి, అని అంటే స్థానికులు ఆయనను ప్రతిఘటిస్తే భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని ప్రచారం చేశారు. బొంబాయిలో ఒక పాట కచ్చేరి రద్దు అయింది. ఒక గ్రంథావిష్కరణ సభ ఆగిపోయింది. వీటిని ప్రాంతీయ సమస్యలుగా ప్రతి పక్షనాయకులు సిద్ధాంతీకరించారు. ఇంత అల్లరి జరిగినా బిజెపిలో ఎందుకు చలనం లేదు?
ప్రతి మనిషికి కూడు, గుడ్డ చదువు ఉద్యోగం కనీస రక్షణ కావాలి. ఏ పభుత్వమైతే ఏమిటి వీటిని అందించడం అనే కనీస బాధ్యత ఉంది. ఆ దిశగా పనిచేసి తీరాలి. ఐతే గత ఎన్నికలు ఉన్నత స్థానాల్లో అవినీతి అనే అంశం మీద జరిగాయి. ప్రతి ఎన్నికలకూ ఒక ఎజెండా ఉంటుంది. 1977 ఎన్నికలలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పా రు. అప్పుడు అవిభక్త ఉత్తర ప్రదేశ్‌లో 85 పార్లమెంటు సీట్లు ఉండేవి. మొత్తం సీట్లను కాంగ్రెసు పార్టీకోల్పోయింది. రాయ్‌బరేలీలో ఇందిరాగాంధినీ రాజ్‌నారాయణ్ అనే ఒక అతిసామాన్యరాజకీయ వాది భారీ మెజారిటీతో ఓడించడం నాకు బాగా గుర్తుంది. అలాగే 1984 ఇందిరా గాంధి హత్య తర్వాత అలాంటి భారీ మెజారిటీలోనే రాజీవ్ గాంధీ ప్రధాని కావడం ప్రజల కూడా గుర్తుంది. ఆ విధంగా ప్రతి ఎన్నికకు స్పష్టమైన రాజకీయ నిర్ధిష్ట అంశం ప్రజల మనస్సులలో ఉంటుంది. 2014 లో ఎన్నికల్లో అవినీతి- లంచగొండితనం అనే అంశం మీద ఎన్నికలు జరిగాయి. అంటే నరేంద్రమోదీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆయన దృష్టి సారించవలసిన ప్రధానాంశం ఇదే. కాని ఆ విషయంలో తగినంత ప్రగతి కనబడటం లేదు.
సమాచార వ్యవస్థలో మెరుగైన సేవలకు అందించే నిమి త్తం 2జి వాయుతరంగాల కొనుగొళ్లు జరిగాయి. ఇందులో చిదంబరం రాజా కరుణానిధి కాంగ్రెసు డిఎంకె ప్రముఖులు ఇరుక్కున్నారు. ఈ దుర్మార్గం ఏమిటి అని వాటిని గాని మన్మోహన్ సింగ్‌ను ప్రశ్నిస్తే సంకీర్ణ ధర్మం పాటించక తప్ప దు అన్నారు. అంటే డిఎంకె మద్దతు ఉపసంహరించుకుంటే మన్మోహన్ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి అవినీతి కొన సాగాల్సిందే అని చెప్పకనే చెప్పినట్లయంది.
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో రూ. 65 లక్షల కోట్ల నల్లధనం దాచి ఉంది. దాన్ని వెనక్కి తెస్తామని నరేంద్ర మోదీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మొత్తం 600 రహస్యఖాతాలు అందులో ఉన్నాయ. ఆ డబ్బు ఏమైంది? మొత్తం ఉంది. కాకపోతే ఖాతాదారులు అక్కడి డబ్బును విత్ డ్రా చేసుకొని వేరే బ్యాంకులకు తరలించుకున్నారు. అగస్టా హెలీకాప్టరు కుంభకోణంలో వెలుగులోకి వచ్చింది. మిలన్ కోర్టు ముడుపులు ఇచ్చిన ఇటలీ దోషులను శిక్షించంది. మరి తీసుకొన్న భారతీయుల మాటేమిటి? ఇందులో మళ్లీ సోనియాగాంధీ పేరు మొదట్లో ఉంది.
పాక్ జైళ్లల్లో మగ్గుతున్న భారతీయ జాలర్లు శ్రీలంక జైళ్లల్లోని భారతీయ జాలర్ల మాటేమిటి? ఆక్రమిత కశ్మీర్ సమస్య ఏమైంది? బెలూచిస్తాన్, సింధ్ రాష్ట్రాల్లో జరు గుతున్న పోరాటాలకు నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం మనదేశానికి లేదా? 2005లో కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అపుడు త్యాగి వంటి వైమానిక అధికారులతో ప్రభుత్వంసమావేశం జరిపి స్పెసిఫికేషన్‌లో మార్పు లు చేయించి అగస్టా హెలీకాప్టర్ కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేశారు. ఇందుకు సంబంధించి భారీగా ముడుపులు ముట్టాయి. ఇలా మధ్యవర్తిత్వ వ్యవహారంలో 20 మంది జర్నలిస్టుల పాత్ర కూడా ఉంది. ఈ కుంభకో ణానికి సంబంధించిన విచిత్ర సమాచారం ఇటీవల బయటకు పొక్కింది. 2004లో ఎస్ పి. త్యాగి పదవి నలకరించిన నెలలోనే అగస్టా కంపెనీలో ఒప్పందం జరిగింది. టెండర్లల్లో హెలీకాప్టర్ 6000 అడుగులు ఎగరాలను ఉంది. అలాంటి ఛాపర్లతో ఒక అమెరికా కంపెనీ ముందుకు వచ్చింది. ఈ లోపల ఏం జరిగిందో ఏమో హెలీకాప్టర్ 4500 అడుగులు ఎగిరితే చాలు అని టెండర్లు మార్చటం జరిగింది. ఎందుకంటే అగస్టా ఛాపర్ 4500 అడుగులు మాత్రమే ఎగురుతాయి. ఈ పని నేను చేయలేదు అంటున్నారు. ఎస్.పి. త్యాగి. ఐతే ఎవరు చేశారో ఇప్పుడు తేల్చండి.
ఇక కమ్యూనిస్టు రచయితలు ఇందిర సోనియాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పాఠ్యగ్రంథాల రచనలు తమ చేతులలోకి తీసుకొన్నారు. భారత దేశంలో ధర్మశాల అనే ప్రాంతంలో దలైలామా ప్రవాస ప్రభుత్వం నడుపుకుంటున్నాడు. ఈయనకు 60 సంవత్సరాలుగా ఆశ్రయం ఇచ్చింది భారదేశం. కాని ఇటీవల 17వ కర్మపా ఆధ్యాత్మిక గురువు పట్ట్భాషేక సమయంలో చైనాతో సన్నిహితంగా మెలగటం దేనిని తెలియచేస్తుందంటే విదేశాంగ నీతిలో భారత్‌పై చైనా విజయం సాధించిందని అర్థం. కాందిశీకుడైన దలైలామాకు భారత్‌తో స్నేహం కన్నా చైనా స్నేహం అవసరమా?
ఆదివారం ఆంధ్రభూమి లో భగత్‌సింగ్ ధారావాహిక చదువుతున్నారా? ఎందుకంటే న్యూఢిల్లీలో ఈ అంశం సంచలనాలను సృష్టిస్తున్నది. బిపిన్ చంద్ర అనే కమ్యూనిస్టు చరిత్ర కారుడు రచించిన పుస్తకాలను విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథాలుగా పెట్టారు. అంటే భగత్ ఉగ్రవాది అని పేర్కొనటం జరిగింది. దీనిని రద్దు చేయవలసిందిగా ఆందోళన మొదలయింది. భగత్‌సింగ్ నాస్తికుడు అని ప్రచారం చేశారు. ఈయనకు గాంధీ నెహ్రూ భారతదేశంలో ఎటువంటి స్థానాన్ని ఇవ్వలేదు సరికదా. పర్వర్టెడ్ పేట్రిమాట్ అన్నారు.
స్విట్జర్లాండ్, మారిషస్, జెనీవా, పనామా బ్యాంకుల్లో దాచిన నల్లధనంలో ఒక్క పైసా కూడా భారత్‌కు రాలేదు. అయోధ్యలో రామాలయం, కాశిలో శివాలయం, మధురలో శ్రీకృష్ణాలయం నిర్మిస్తామన్నారు. ఈ వాగ్దానమేమైంది? వామపక్ష భావజాల సిలబస్‌ను తొలగించి జాతీయ భావా లను పెంపొందించే సిలబస్ ప్రవేశపెడతామన్నారు. అదేమైంది? కాంగ్రెస్ హయాంలో మాదిరిగానే పురస్కారా లను అమ్ముకున్నారు. డబ్బున్నవారు కొనుక్కున్నారు. ఈ దుర్మార్గం ఇంకెన్నాళ్లు?

- ముదిగొండ శివప్రసాద్