సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రివలన గలుగునది మొదటి జన్మము. ఉపనయనముచే నేర్పడునది ద్వితీయ జన్మము. సన్న్యాసమో మూడవ జన్మము.
295. కామినీ కాంచనములలో మునిగితేలుచుండువాని మనశ్శక్తి విశేషము వ్యర్థమైపోవును. ఏమి ధరింతునో యను చింత లేశమును లేక ప్రాపంచిక విషయములను పూర్తిగా విడిచిపెట్టునో అట్టివాడే నిజముగా సన్న్యాసమును స్వీకరింప నర్హుడు. ఎతె్తైన చెట్టు చివర కెక్కి తన ప్రాణములకు గాని అవయములకుగాని ఏమి యపాయము సంభవించునో యనుచింత యిసుమంతయులేక, ఆవశ్యకమగుచో, అచటినుండి నిర్భయముగా క్రిందకి దుముకువాని మనోభావమును బోలి యుండవలయును, నిజమైన సన్న్యాసియొక్క మనోభావము.
297. యోగులును సన్న్యాసులును పాములవంటివారు. పాము తనకై కలుగు నిర్మించుకొనదు, ఎలుక చేసికొనిన కలుగులో దూరి నివసించును. ఒక కలుగు వాసయోగ్యము కానిచో, మరియొకదానిలో బ్రవేశించును. అటులనే యోగులును సన్న్యాసులును తమకై యిల్లుకట్టుకొనరు, ఇతరుల యిండ్లలో కాలక్షేపము చేయుదురు- నేడు ఒకరి యిల్లు, రేపు మరియొకరి యిల్లు
298. వనమునకును అన్నపానీయములకును సౌకర్యము లేని తావున సాధువులు నిలువనొల్లరు. వనమనగా కాలకృత్యములను దీర్చుకొనుటకు తగిన నిర్జన ప్రదేశము. అన్న పానీయములనగా భిక్ష. సాధువులు భిక్షాన్నము తిని జీవింపవలసినవారు కావున అనాయాసముగా భిక్షదొరకు తావులనే ఎన్నుకొందురు. భిక్ష దొరకుట కష్టమైనను, దీర్ఘయాత్రచే అలసినను, ఎచ్చటనో ఒక చోట ఒకటి రెండు దిములు ఆగినను ఆగవచ్చును. కాని నీటికిబ్బంది గల తావునగాని, దేహబాధలను దీర్చుకొనుటకై నిర్జన ప్రదేశములు లేని తావునగానివారు ఎన్నడును ఆగరు. పరులు తమ్ముచూచుట కవకాశము గల తావులందు వారు దేహబాధలను దీర్చుకొన నొల్లరు. దీనిని మానవ నివాసములకు దూరముగా, ఏకాంతస్థలమున దీర్చుకొందురు.
299. తెల్లని బట్టపై నల్లని మచ్చ నలుసంత పడినను ఎంతో అసహ్యముగా గాన్పించును. అట్లే సాధువు యొక్క నడివడియందు ఏ మాత్రపు లోపమున్నను, దోషమున్నను ముఖ్యముగా గనబడి బాధాకరమగును.
300. సన్న్యాసియగువాడు తానెంత విరక్తుడై ఇంద్రియ నిగ్రహము గలిగియున్నను లోకమునకు మార్గదర్శకుడై యుండుటకై కామినీ కాంచనములను పూర్తిగా విసర్జింపవలయును. ఏలన సన్న్యాసియొక్క అఖండ వైరాగ్యమును గాంచినప్పుడే లోకులకు తామును అసక్తత నలవరచుకొనగలమను ధైర్యముగలుగును. లేనియెడల వారు కామకాంచనములను విడుచుటకు ప్రయత్నింపనే ప్రయత్నింపరు. సన్న్యాసి కానిచో లోకులకు మఱెవ్వరు త్యాగ వైరాగ్యతత్త్వమును దెలుపుటకు సమర్థులు?
301. నిజమైన సన్న్యాసియొక్క గాని, త్యాగియొక్క గాని లక్షణమేమి? కామినీ కాంచనములతో లేశమును సంబంధము లేకుండుటయే, త్యాగి కానిమ్ము, సన్న్యాసికానిమ్ము, కాంచన వ్యామోహము అణుమాత్రమున్నను, కలనైనను స్థలనపీడితుడైనను, వాని పారమార్థిక సాధనలన్నియు గంగపాలగును.
302. సన్న్యాస చిహ్నమగు కాషాయ వస్తమ్రును ధరించినవాడు నిజమగు సన్న్యాసివలెనే మెలగవలయును. నాటకములో రాజు వేషము వేసినవాడు సరిగా రాజువలెను, మంత్రి వేషము వేసినవాడు సరిగా మంత్రివలెను నటించుట మీరు చూడలేదా? ఒకప్పుడొక పగటివేషకాడు సన్న్యాసివేషము వేసికొని ఊరిలో జమీందారు నింటికివచ్చెను. జమీందారు వానికి గొంత ధనమును బహుమానమీయబోయినాడు. కాని యతడు దానిని స్వీకరించుటకు నిరాకరించి వెడలిపోయినాడు.
కొంత సేపటికి ఆతడు తన వేషమును తీసివేసి, బూడిదెను కడుగుకొని మఱల వచ్చి జమీందారును ఆతడీయదలచిన డబ్బు ఇమ్మని వేడుకొనెను. ఆతడు సన్న్యాసి వేషముతోనుండగా ధనమును తాకుట కూడ వానికి తగని పనియనితోచినది. కాని తరువాత పావులా డబ్బులిచ్చినను సంతోష్టుడై స్వీకరించుటకు సిద్ధపడినాడు.
303. ఒక మనుష్యుడు జబ్బుగానున్న తన బిడ్డను ఎత్తుకొని, ఔషధము నిమిత్తము ఒక సాధువును దర్శించెను. మఱునాడు రమ్మని సాధువు వానితో జెప్పెను. మఱునాడతడు రాగా సాధువు ఇట్లు పలికెను: ‘‘బిడ్డకు మిఠాయి పెట్టకు, త్వరలోనే నిమ్మళించును.’’

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
ఇంకావుంది...