సబ్ ఫీచర్

అసలైన యోగులు అరుదు( ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహా అయితే, ఆ గడ్డి మొక్కలకు అంటుకుని ఉన్న మురికిని తుఫాను చక్కగా కడుగుతుంది. తుఫాను ముగిసిన వెంటనే ఆ గడ్డి మొక్కలు మళ్ళీ తలలు పైకెత్తి గాలిలో నాట్యంచేస్తాయి.
గడ్డి మొక్కలు చాలా బలహీనమైనవి. ఎందుకంటే, వాటికి బలమైన వేళ్ళు ఉండవు. అందుకే వాటిని చిన్న పిల్లలు కూడా పీకి పారెయ్యగలరు. కానీ, పెనుతుఫాను వాటిని ఏమీచెయ్యలేదు. ఎందుకంటే, గడ్డి మొక్కలు లావోట్జూ ధైర్యమార్గాన్ని అనుసరిస్తాయి. కానీ, డార్విన్ సిద్ధాంతాన్ని అనుసరించే మహావృక్షాలు తమ శక్తిని నిరూపించుకునేందుకు పెను తుఫానుతో ఎంతగా పోరాడినా అవి కూలిపోతాయి
కాబట్టి, మీరు మీ శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తే మీరు ఓడిపోతారు. మహావృక్షాల వంటి హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్ లాంటి వారందరూ ఓడిపోయినవారే. కానీ, తలవంచేందుకు సిద్ధపడే లావోట్జూలందరూ చిన్న చిన్న గడ్డిమొక్కల్లాంటివారే. అలాంటి వారిని ఎవరూ ఏమీ చెయ్యలేరు.
‘‘నేను ఓడిపోయాను, విజయం మీదే’’అనే వారిని ఎవరుమాత్రం ఏమి చెయ్యగలరు? లావోట్జూ ముందు అలెగ్జాండర్ కూడా ఏమీచెయ్యలేని బలహీనుడే. అలాంటి సంఘటన ఒకటి జరిగింది.
‘‘మార్మిక యోగులైన మహానుభావులు భారతదేశంలో మాత్రమే ఉంటారు. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలని మాకు చాలా కోరికగా ఉంది. కాబట్టి, మీరు భారతదేశంనుంచి తిరిగి వచ్చేటప్పుడు అలాంటి ఒక యోగిని మీతోపాటు తప్పకుండా తీసుకురండి’’అని అలెగ్జాండర్‌కు చెప్పారు అతని స్నేహితులు. ఆ రోజుల్లో భారతదేశంలో ‘‘డేండమిస్’’అనే మార్మిక యోగి ఉండేవాడు. కానీ, యుద్ధతంత్రాలలో నిమగ్నమైన అలెగ్జాండర్ ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయాడు. యుద్ధం ముగిసింది. తిరుగు ప్రయాణంలో భారతదేశపు సరిహద్దులో ఉన్న ఒక గ్రామాన్ని చేరుకుంటుండగా తన స్నేహితులు అడిగిన కోరిక అలెగ్జాండర్‌కు గుర్తుకొచ్చింది. వెంటనే ‘‘ఈ గ్రామంలో ఎవరైనా యోగి ఉన్నారేమో చూసి రండి’’అని సైన్యానికి ఆజ్ఞాపించిన అలెగ్జాండర్ ‘‘ఈ గ్రామంలో ఎవరైనా మహాయోగి ఉన్నారా’’అని ఆ గ్రామస్థులను అడిగాడు. ‘‘మీరు సరియైన సమయానికే ఇక్కడకు వచ్చారు. ఒక మహానుభావుడు ఈ గ్రామంలో ఉన్న నదీ తీరానికి విచ్చేసి ఉన్నాడు. యోగులు అనేక మంది ఉంటారు. కానీ, అసలైన యోగులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన యోగి ఆయన. మీరు తప్పకుండా ఆయన దర్శనం చేసుకోవాలి’’ అన్నారు గ్రామస్థులు.
వెంటనే అలెగ్జాండర్ నవ్వుతూ ‘‘నేను ఆయనను దర్శించుకోవడంకోసం రాలేదు.
మాతోపాటు ఆయనను మా దేశానికి తీసుకెళ్ళాలని వచ్చాను. ఆయనను తీసుకురమ్మని మా సైనికులను కూడా పంపించాను. ఈపాటికి వారు ఆయనను తీసుకొస్తూ ఉంటారు’’అన్నాడు ఆ గ్రామస్థులతో.
‘‘అది అంత సులభంకాదు’’ అన్నారు ఆ గ్రామస్థులు. ‘‘ఎంతోమంది రాజులను, రాజ్యాలను జయించిన ఈ మహాచక్రవర్తికి భిక్షుకుడైన ఒక చిన్న సన్యాసిని నా రాజ్యానికి తీసుకెళ్ళడం అసాధ్యమా?’’ అని మనసులో అనుకున్నాడు అలెగ్జాండర్.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.