సబ్ ఫీచర్

వాస్తవికతను గుర్తించాలి! ( ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్భయత్వం ఉన్న మనిషి తనను చూసి ఇతరులు భయపడేలా ప్రవర్తించడు. ఎందుకంటే, అతని దగ్గర భయం అనేది ఏమాత్రం ఉండదు.
హృదయ మార్గం:
‘‘కరేజ్’’చాలా ఆసక్తి కలిగించే పదం. అది లాటిన్ మూల పదమైన ‘‘కర్’’అనే పదంనుంచి వచ్చింది. ‘‘కర్’’అంటే ‘‘గుండె’’అని అర్థం. కాబట్టి, ధైర్యవంతుడు అంటే ‘‘గుండె ధైర్యంకలవాడు’’అని అర్థం. కేవలం బలహీనులు, భయపడేవారు మాత్రమే బుర్రతో జీవిస్తారు. వారు ఎప్పుడూ అన్ని తలుపులు, కిటికీలు మూ సేసి- వేదాంత పదాలతో కూడిన సిద్ధాంత భావాలతో తమ చుట్టూ తర్కబద్ధమైన రక్షణ కల్పించుకుని- వాటి మరుగున దాగి జీవిస్తూ ఉంటారు. హృదయ మార్గమే ధైర్యమార్గం, గతానికి వీడ్కోలు చెప్పి భవిష్యత్తుకు బాటవేసే మార్గమది. అది అభద్రతలో- ప్రేమలో, నమ్మకాలలో- జీవించడం లాంటిది. అంటే ఏమాత్రం తెలియని దారిలోకి అడుగు పెట్టడమన్నమాట.
ప్రమాదకరమైన మార్గాలలోకి అడుగుపెట్టడమే ధైర్యమంటే. జీవితం చాలా ప్రమాదకరమైనది. అందుకే పిరికిపందలు అలాంటి ప్రమాదకరమైన వాటి నుంచి తప్పించుకు తిరుగుతారు. ఎందుకంటే, వారు మృతజీవులు. నిజంగా పూర్తి జీవంతో నిండిన వ్యక్తులు ఎప్పుడూ తమకు తెలియని వాటిని- అవి ఎంత ప్రమాదకరమైనవి అయినా- తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
హృదయానిది జూదగాడి మనస్తత్వం. అందుకే అది ఎప్పుడూ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. బుర్రది ఎప్పుడూ వ్యాపారి మనస్తత్వం. అది మహా మోసకారి. అందుకే అది ఎప్పుడూ ఏవో లెక్కలు వేస్తూ ఉంటుంది. కానీ, హృదయం ఎప్పుడూ ఎలాంటి లెక్కలువెయ్యదు. ఎందుకంటే, దానికి లెక్కలు తెలియవు.
‘‘కరేజ్’’అనే ఆంగ్ల పదం చాలా ఆసక్తి కలిగించే అందమైన పదం. హృదయ మార్గంలో జీవించాలనుకునేవారు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కవి ఎప్పుడూ హృదయ మార్గంలో జీవిస్తూ ఉంటాడు. అందుకే అతడు అనేక తెలియని శబ్దాలను వింటూ ఉంటాడు. బుర్రకు వినికిడి జ్ఞానం లేదు. కాబట్టి, అది ఎప్పుడూ తెలియని వాటికి చాలా దూరంలో ఉంటుంది. బుర్ర ఎప్పుడూ తెలిసిన విషయాలతోనే నిండి ఉంటుంది.
‘‘మనసు’’అంటే ఏమిటి? మీకు తెలిసిన విషయాలే మీ మనసు. అంటే గతించిన గతానికి చెందిన సమీకృత జ్ఞాపకాలే మీ మనసు. హృదయం ఎప్పుడూ భవిష్యత్తుకు సంబంధించిన ఆశలతో కలలు కంటూ ఉంటుంది. కానీ, బుర్ర ఎప్పుడూ గతం గురించి ఆలోచిస్తుంది.
రావలసిన భవిష్యత్తు చాలా ఉంది. అది తప్పక వస్తుంది. ఎందుకంటే, అది రావడం ఎప్పుడో ప్రారంభించింది. ప్రతి క్షణం భవిష్యత్తు వర్తమానంగా మారుతోంది. అలాగే ప్రతి క్షణం వర్తమానం గతంగా మారుతోంది. గతించిన దానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే, అది గతించింది. మీరు ఎప్పుడో గతాన్ని దాటి ముందుకు వెళ్ళారు. కాబట్టి, గతం పూర్తిగా గతించిన విషయం. సమాధి లాంటి గతం ఎప్పుడో మరణించింది.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.
ఇంకావుంది...