సబ్ ఫీచర్

పక్కా ప్రణాళికతోనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూంటుంది. దీనితో పిల్లలలో మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అధిగమిస్తే పరీక్షలలో విజయం సాధించడం చాలా తేలిక అని గుర్తించాలి.
పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ అంశాలు నేర్చుకోవాలి, వాటినన్నింటిని గుర్తుపెట్టుకుని పరీక్షలలో రాసి మంచి మార్కులు సంపాదించుకోవాలి. పరీక్షల సమయంలో పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. తల్లిదండ్రులు వారి పిల్లల బంగారు భవిష్యత్తు గురించి తీవ్రంగా చాలా ఆలోచిస్తూ మనసులో కలిగే ఆందోళనలతో, పిల్లలు జీవితంలో మంచి స్థితిలోకి రావాలనే కాంక్షతో, పిల్లలే సర్వస్వం అని భావించే తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులలో కలిగే ఈ ఒత్తిడి ప్రభావం పిల్లలపై తీవ్రంగా చూపిస్తుందని గుర్తించాలి. పిల్లల్లో కలిగే పరీక్షల ఒత్తిడిని తగ్గించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.
ఒత్తిడి తగ్గాలంటే..
ప్రణాళిక (ప్లానింగ్): పిల్లలతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి. పరీక్షల సమయానికంటే ముందుగానే ఏ విధంగా పరీక్షలను ఎదుర్కోవాలో పిల్లలతో చర్చిస్తూ సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రణాళికను రూపొందించేటపుడు చదివే సమయంలో విరామ సమయం తప్పకుండా కేటాయించుకోవాలి. కష్టమైన సబ్జెక్టులను గుర్తించి వాటికి ఎక్కువ సమయం కేటాయించేలా, వాటిపై పిల్లలు మరింత దృష్టిని కేంద్రీకరించే విధంగా ప్రణాళిక ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
సౌకర్యవంతమైన వాతావరణం
పిల్లలు చదువుకోవడానికి సౌకర్యవంతమైన తగు వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి. టీవీ, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ మొదలైన అంతరాయాలకు దూరంగా ఉండేవిధంగా చూసుకోవాలి. పిల్లలు సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాటు సరిగా లేకపోతే, పిల్లలకు మెడనొప్పి, తలనొప్పి లేదా వెనె్నముకనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కూర్చుని చదువుకొనే స్టడీ ఛైర్ సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటుచేయాలి. సోఫా లేదా మంచాలపై చదవడానికి ప్రోత్సహించవద్దు. ఇలా చేస్తే కండరాలపై ఒత్తిడి కలిగి తొందరగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది.
పోషకాహారం
పరీక్షల సమయంలో పిల్లలు తిండి తినడంలో సరైన ఆసక్తి చూపించకపోవచ్చు. పిల్లలు నిర్ణీత సమయంలో ఆహారాన్ని తీసుకోవడంలో తల్లిదండ్రులు సరైన బాధ్యతను పోషించాలి. ఆకలిగా వున్నప్పుడు చదువుపై ఏకాగ్రత కుదరడం చాలా కష్టం. మెదడు చురుగ్గా పనిచేయాలంటే పిల్లలు సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.
మంచి నిద్ర
పిల్లలు నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తిచేయడానికి నిద్రను దరిచేరకుండా చేస్తూ తీవ్రంగా కష్టపడుతూ చదువుతూ ఉంటారు. మంచి నిద్ర వలన జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి. పరీక్షకు ముందురోజు అర్థరాత్రి వరకు కష్టపడుతూ చదవడం మంచిది కాదు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 6 నుండి 7 గంటలపాటు నిద్రపోయే విధంగా తగు సూచనలు ఇస్తూ గమనిస్తూ ఉండాలి. నిద్రపోకుండా తీవ్రంగా కష్టపడటం కంటే మంచి నిద్ర తీసుకోవడంవలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
సహాయకారిగా..
పిల్లలకు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలి. పిల్లలు ఎక్కువ సమయం చదవడానికి కేటాయిస్తున్నప్పుడు, ఇతర పనులలో వారికి సహాయకారిగా ఉండాలి. పిల్లలు చదువుకునే గదిని శుభ్రంగా ఉంచడం చేయాలి. ఇతర పనుల పట్ల వాళ్ల ఆలోచనలు మరలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏకాగ్రతతో చదివే అవకాశం ఉంటుంది.
పిల్లలతో మాట్లాడండి
పరీక్షల సమయంలో పిల్లలతో గడపడానికి, వారితో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించాలి. పిల్లల మానసిక స్థితి, ఆందోళనలను, భయాన్ని గమనిస్తూ తగిన విధంగా గైడ్ చేస్తూ ఉండాలి. పరీక్షల సమయంలో భయం కలగడం సర్వసాధారణం అని వివరిస్తూ పరీక్షలకు బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతున్నావనే ప్రోత్సాహాన్ని అందించాలి. ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇస్తూ ఉండాలి.
శారీరక ఆటలను ప్రోత్సహించాలి
పరీక్షల సమయంలో పూర్తిగా ఆటలు ఆడరాదని నిబంధన విధించడం సరికాదు. శారీరక ఆటలు ఆడడంవలన మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది మరియు శక్తి సామర్థ్యాల స్థాయిలు పెరుగుతాయి. పరీక్షల సమయంలో కూడా నిర్ణీత సమయంపాటు శారీరక ఆటలకు అనుమతించాలి.
ఒత్తిడిని పెంచవద్దు
గతంలో పిల్లల ఫెయిల్యూర్స్‌ను పదే పదే గుర్తుచేస్తూ పిల్లలలో ఒత్తిడి పెంచకూడదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం కూడదు. పిల్లలు పరీక్షలకు హాజరుకావటానికిముందు వారికి సానుకూల ఆలోచనలను (పాజిటివ్ థింకింగ్స్) కల్పించాలి. పిల్లలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, పిల్లల సామర్థ్యానికి తగ్గట్లుగా వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించాలి.
పిల్లలకు శిక్షణ
పిల్లలో వైఫల్యాలను ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్పిస్తూ ఉండాలి. ఓటమి అనేది విజయానికి ఒక మెట్టులాగా, విజయాన్ని సాధించడానికి కావాల్సిన సంకల్పబలం అందిస్తూ ప్రోత్సహించాలి.
ప్రోత్సహం
పరీక్షలు ముగిసన సమయం కూడా మరో పరీక్షకు ప్రారంభ సమయమని గుర్తించాలి. పరీక్షల సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి ఉంటారు. పరీక్షలు ముగిసిన వెంటనే విహారయాత్రకుగాని, లేదా పిల్లల కృషికి అభినందనీయంగా బహుమతులు అందించాలి. పరీక్షలలో పొందే మార్కులతో కాకుండా పిల్లలను పిల్లలుగానే గుర్తించాలి. పిల్లలపట్ల స్నేహపూర్వకంగా మెదులుతూ ఉండాలి.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321