సబ్ ఫీచర్

అంతరాత్మ బోధనే వినాలి! ( ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్తు బీజం లాంటిది. అందుకే అది ఎప్పుడూ వర్తమానాన్ని కలుసుకునేందుకు ముందుకు వస్తూనే ఉంటుంది. కాబట్టి, మీరు ఎప్పుడూ కదలుతూనే ఉంటారు. భవిష్యత్తులోకి అడుగుపెట్టడమే వర్తమానమంటే. మీరు ఎప్పుడో వర్తమానంలోకి అడుగుపెట్టారు. అది ఎప్పుడూ భవిష్యత్తులోకి వెళ్తూనే ఉంటుంది. ప్రపంచంలో అందరూ నిజాయితీగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే, అది చక్కని ఆనందాన్ని, పరమానందాన్ని ఇస్తుంది. కాబట్టి, ఎవరైనా అసత్యంలో జీవిస్తూ తప్పుగా ఎందుకు జీవించాలి? కాస్త లోతైన అంతర్దృష్టి కావాలంటే మీకు ధైర్యముండాలి. ఏం చేస్తుందని ఈ ప్రపంచానికి మీరు భయపడుతున్నారు? మహాఅయితే మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతారు. అది వారికే మేలు చేస్తుంది. ఎందుకంటే, నవ్వు ఎప్పుడూ ఆరోగ్యాన్నిచ్చే ఔషధం లాంటిది. అలాగే ప్రజలు మిమ్మల్ని పిచ్చివాడనుకుంటారు. అంతమాత్రాన మీరు పిచ్చివారు అయిపోరు కదా! నిజానికి మీ ఆనందం, పరమానందం, నాట్యం, కన్నీళ్ళు వాస్తవమైనవే అయితే త్వరలో అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుని మీ శిబిరంలోకి రావడం ప్రారంభిస్తారు. నేను అదే మార్గాన్ని అనుసరించడం ప్రారంభించాను. అందుకే అందరూ నా శిబిరంలోకి రావడం ప్రారంభించారు. నిజానికి, నేను ఎవరినీ ఆహ్వానించలేదు. అయినా నా శిబిరం ప్రపంచవ్యాప్తమయింది. అందుకు నేను చేసినది కేవలం నా హృదయ మార్గాన్ని నేను అనుసరించడమే.
నా బాధ్యత కేవలం నా హృదయం పట్ల మాత్రమే కానీ, ఈ ప్రపంచంలో ఎవరిపట్ల కాదు. అలాగే మీ బాధ్యత కూడా కేవలం మీ పట్ల మాత్రమే ఉంలి. అంతేకానీ, దానికి వ్యతిరేకంగా వెళ్లకండి. అలా చేస్తే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నట్లే. ఇంకా చెప్పాలంటే మీరు ఆత్మహత్య చేసుకున్నట్లే. దానివల్ల లాభమేమిటి?ప్రజలు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా భావించి గౌరవించినంత మాత్రాన మీకు పెద్దగా ఒరిగేదేమీ లేకపోగా, వారు మీ జీవితానికి కావలసిన ఎంతో చక్కని అద్భుతమైన అంతర్‌దృష్టిని మీకు ఏ మాత్రం కలిగించరు.
ఈ భూమిపై మీకంటే ముందు ఎన్నికోట్లమంది జీవించారో తెలుసా? కనీసం వారి పేర్లు కూడా మీకు తెలియవు. వారు నిజంగా జీవించారా లేదా అనేది ముఖ్యం కాదు. పుణ్యాత్ములు, పాపాత్ములు, అత్యంత గౌరవనీయులు వంటి అన్ని రకాలవారు గతంలో అనేకమంది ఉన్నారు. వారందరూ గతించారు. కనీసం వారి ఆనవాళ్ళలో ఒక్కటి కూడా ఈ భూమిపై ఎక్కడా లేదు.
కాబట్టి, మీరెప్పుడూ మృత్యువు మీ శరీరాన్ని, మనసును కబళించి నాశనం చేసినపుడు మీతో వచ్చే మీ గుణాల గురించే ఆలోచిస్తూ, వాటిని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే, మీతో ఎప్పుడూ తోడుగా ఉండేవి అవే. అవే అసలైన విలువలు. వాటిని సాధించిన వారే జీవిస్తున్నట్లు లెక్క. తక్కిన వ్యక్తులు కేవలం జీవిస్తున్నట్లు నటిస్తున్నవారే. అర్థరాత్రి తలుపు తట్టిన పోలీసు అధికారి ముందు చిరిగిన చొక్క వేసుకున్న ముల్ల నసిరుద్దీన్ నిలబడ్డాడు.
‘‘ఈజ్ ఎనీబడీ బై నేమ్ ముల్లా నసీరుద్దిన్ ఈజ్ లివింగ్ హియర్?’’ అని గద్దిస్తూ అడిగాడు పోలీసు అధికారి.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.
ఇంకావుంది...