సబ్ ఫీచర్

మీరు మీరు గానే మసలండి (ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నో సర్’’ అన్నాడు ముల్లా నసీరుద్దీన్. ‘‘దెన్ వాట్ ఈజ్ యువర్ నేమ్?’’ అని మళ్లీ గద్దిస్తూ అడిగాడు ఆ పోలీసు అధికారి.
‘‘ముల్లా నసిరుద్దీన్’’ అన్నాడు ముల్లా.
‘‘జస్ట్ నౌ యు సెడ్ నో. వాట్ డు యు మీన్?’’ అని అరిచాడు కోపంతో రగిలిపోయిన ఆ పోలీసు అధికారి ముల్లా నసీరుద్దీన్ చిరిగిన చొక్కాను పట్టుకుని గుంజుతూ. వెంటనే ఆ పోలీసు అదికారి గుప్పిట్లో చిక్కుకున్న తన చిరిగిన చొక్కాను చూపిస్తూ ‘ఈజ్ దిస్ లివింగ్?’ అన్నాడుముల్లా నసిరుద్దీన్.
కాబట్టి, కేవలం ఊపిరి పీలుస్తూ బతకడమనేది జీవిస్తున్నట్లు కాదు. ఒక్కసారి మీరు మీ జీవితాన్ని గమనించండి. అది నిజంగా ఈ అస్తిత్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు ప్రసాదించిన చక్కని బహుమతి అని మీరు అనగలరా? అలాంటి జీవితమే మీకు మళ్లీ మళ్లీ రావాలని మీరు కోరుకోగలరా?
పవిత్ర గ్రంథాలను మీరు ఏ మాత్రం పట్టించుకోకండి. పరిపూర్ణమైన ఎరుకతో, పూర్తి చైతన్యంతో మీరు మీ హృదయం చెప్పే దానిని మాత్రమే చాలా శ్రద్ధగా వినండి. అలా చెయ్యడం ద్వారా మీరు ఎప్పుడూ ఎలాంటి విభజనకు లోనుకాకుండా, మంచి చెడుల బేరీజులు ఏ మాత్రం అవసరం లేని సరియైన మార్గంలో పయనించడం ప్రారంభిస్తారు. అందువల్ల మీరెప్పుడూ తప్పు చెయ్యరు. కాబట్టి, నేను మీకు, నవీన మానవాళికి సూచించగల జీవించే కళతో కూడుకున్న పవిత్ర గ్రంథం అదే. దానిని అనుసరిస్తూ, అది ఏది చెప్తే అది చెయ్యండి, అది చూపించిన దారిలో వెళ్లండి.
పరిపూర్ణమైన ఎరుకతో, పూర్తి చైతన్యంతో, చాలా శ్రద్ధగా హృదయం చెప్పే దానిని వింటూ, అది చెప్పిన పని పూర్తిచేస్తూ, అది చూపించిన దారిలో వెళ్లడంలోనే నూతన మానవాళి జీవించే కళ అంతా దాగి వుంది. అవును, ఒక్కొక్కప్పుడు అది మిమ్మల్ని పక్కదారి పట్టించి ప్రమాదాలలో పడేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు ఎదిగేగందుకు, పరిణతి చెందేందుకు అలాంటి ప్రమాదాలు చాలా అవసరం. వాటివల్ల మీరు కిందపడుతూ, పైకి లేస్తూ ఉంటారు. అలా అన్ని విషయాలు మీరే స్వయంగా తెలుసుకుంటారు.
కాబట్టి, బయటనుంచి విధించబడిన ఎలాంటి నియమాలను ఎప్పుడూ పాటించకండి. అవి ఎప్పుడూసరిగా ఉండవు. ఎందుకంటే, అవి మీపై పెత్తనం చెలాయించేందుకు ఇతరులు సృష్టించినవి. బుద్ధుడు, జీసెస్, మహమ్మద్, కృష్ణుడు,మహావీరుడు వంటి జ్ఞానోదయం పొందినమహానుభావులు ఈ ప్రపంచానికి తమ ప్రేమను పంచారే తప్ప, ఎలాంటి నియమాలను చెప్పలేదు. కానీ, వారు మరణించిన తరువాత వారి శిష్య బృందాలు ప్రవర్తనా నియమావళులను తయారుచేయడం ప్రారంభించాయి. ఎందుకంటే, వెలుగు ఇచ్చే గురువు పోయిన తరువాత వారు అంధకారంలో పడిపోయారు. అంతవరకు వారి ముందున్న వెలుగు పోవడంతో వారు అనుసరించేందుకు ఏవో నియమాలను వెతకడం ప్రారంభించారు. ఇపుడు వారు వాటిపైఆధారపడక తప్పదు.
తన హృదయం చెప్పిన పనినే జీసస్ చేసాడు. కానీ క్రైస్తవులు అలా చెయ్యట్లేదు. వారు కేవలం అనుకరిస్తున్నారు. అలా చెయ్యడం కేవలం మీరు మీలోని మానవత్వాన్ని, దివ్యత్వాన్ని అవమానించడమే అవుతుంది. కాబట్టి, ఎప్పుడూ అనుకరించేవారుగా ఉండకండి. అది కేవలం నకలు వ్యవహారం. కానీ, ప్రపంచ వ్యాప్తంగా అదే జరుగుతోంది. కాబట్టి, మీరు ఎప్పుడూ వాస్తవంగా, మీరు, మీరుగానే ఉండండి.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

ఇంకావుంది...