సబ్ ఫీచర్

వాస్తవాన్ని గుర్తించండి! ( ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు మీ జీవితం నిజంగా నాట్యభరితమవుతుంది. అసలు మీరు అలా ఉండేందుకే పుట్టారు.
కృష్ణునికి, బుద్ధునికి మధ్య వున్న తేడాను గమనించండి. ఒకవేళ కృష్ణుడు బుద్ధుడిని అనుసరించి ఉన్నట్లైతే మనం ఒక అద్భుత వ్యక్తిత్వమున్న వ్యక్తిని కోల్పోయేవాళ్లం. అలాగే బుద్ధుడు కృష్ణుడిని అనుసరించి ఉన్నట్లైతే అతడు ఒక మామూలు మనిషిగా మిగిలిపోయేవాడు. బుద్ధుడువేణువు వాయిస్తున్నట్లుగా ఊహిస్తే ఎంత కంపరంగా ఉంటుందో తెలుసా? అపశృతులతో అతడు అందరికి నిద్రాభంగం చేసేవాడు. ఎందుకంటే అతడు వేణువు వాయించేవాడుకాదు.
అలాగే బుద్ధుడు నాట్యం చేస్తున్నట్లుగా ఊహించి చూడండి. అది ఎంత కంపరంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. కృష్ణుడు విషయంలో కూడా అంతే. చేతిలో వేణువు, కిరీటంలో నెమలి పింఛం, పట్టు పీతాంబరాలు, చందనాది అలంకారాలు, చుట్టూ మైమరిచిపోయే గోపికలు వుండే కృష్ణుడిలో ఎలాంటి ఆటపాటలు లేకుండా కేవలం ఒక చెట్టు క్రింద కళ్ళు మూసుకుని కూర్చున్న పరమ దరిద్ర వాలకాన్ని మీరు చూడగలరా? ఏ మాత్రం చూడలేరు. ఎందుకంటే, కృష్ణుడు కృష్ణుడే, బుద్ధుడుబుద్ధుడే-అలాగే మీరు మీరే.
ఎలా చూసినా మీరు ఎవరికన్నా తక్కువ కాదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అలాగే మీ అంతర్గతవాణిని కూడా మీరు గౌరవిసల్తూ దానినిఅనుసరించండి. కానీ అది కచ్చితంగా మీకు సరియైన మార్గాన్ని చూపుతుందని నేను మీకు ఎలాంటి హామీ ఇవ్వలేను. చాలాసార్లు అది మిమ్మల్ని తప్పుదోవ కూడా పట్టించవచ్చు.
అసలైన ఇంటి తలుపు తట్టాలంటే మీరు అనేక ఇళ్ళ తలుపులు తట్టవలసి వస్తుంది. అదంతే. ఒకవేళ హఠాత్తుగా మీరు అసలైన ఇంటి ముందే ఉన్నప్పటికీ అదే మీరు వెతుకుతున్న అసలైన ఇల్లు అని మీరు గుర్తించలేరు. కాబట్టి, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పుడూవృధా కావని, అవన్నీ మీ ఎదుగుదలకు అంతిమ ఫలితాన్ని ఇచ్చేవే అని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి.
తప్పు చేసేందుకు ఏ మాత్రం సంకోచించకండి. అలాగే తప్పు చేస్తున్నామని మరీ ఎక్కువగా బాధపడకండి. ‘‘ఎప్పుడూ తప్పు చెయ్యకండి’’ అని మీకు బోధించడం జరిగింది. ఇదే అసలైన సమస్య. అందువల్ల తప్పు చేసేందుకు అందరూ సంకోచిస్తారు. భయపడతారు. అలా అందరూ ఒకచోట ఇరుక్కుపోతారే కానీ ముందుకు వెళ్లలేరు. అయినా ఏదో తప్పు జరిగిపోతుంది.
అందువల్లవారు ఎటూ పోలేక మరింత బిగుసుకుపోతారు. కాబట్టి మీరు చెయ్యగలిగినన్ని తప్పులు చెయ్యండి. కానీ చేసిన తప్పును మళ్లీ చెయ్యకూడదు అనే విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలా చెయ్యడంవల్ల మీరు ఖచ్చితంగా ఎదుగుతారు. ఎందుకంటే చెడిపోవడం కూడా స్వేచ్ఛలో ఒక భాగమే.
అలాగే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళడం కూడా మీ ఔన్నత్యంలో ఒక భాగమే. ఒక్కొక్కప్పుడు అది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే, అలా మీరు వెనె్నముక గల వారుగా తయారవడం ప్రారంభిస్తారు. నిజానికి, మన సమాజంలో వెనె్నముక లేనివాళ్ళు అనేక లక్షల మంది ఉన్నారు. కాబట్టి, ‘‘అది తప్పు, ఇది ఒప్పు’’అని మీకు బోధించిన వాటన్నింటినీ పూర్తిగా మర్చిపొండి.
జీవితంలో ఏదీ స్థిరంగా ఉండదు. ఇవాళ ఒప్పుగా అనిపించినది రేపు తప్పుగా అనిపించవచ్చు. అలాగే ఈ క్షణంలో తప్పుగా అనిపించినది మరుక్షణంలో ఒప్పుగా అనిపించవచ్చు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.
ఇంకావుంది...