సబ్ ఫీచర్

కూర్చుని వేసే ఆసనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం సాధారణంగా చేసే భంగిమలే యోగాసనాలంటే అతిశయోక్తి కాదు. కాకపోతే అదే భంగిమను కొద్దిసేపు కొనసాగించి ముద్ర, ప్రాణాయామం జత చేస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుంది. మనిషి చేసే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. యోగాలోని కొన్ని విశిష్టతలే దీన్ని వ్యాయామాల్లో అత్యున్నతమైనదిగా నిలబెట్టాయి. అలాంటి అత్యున్నత ఆసనాల్లో కొన్ని ఇవి. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ప్రశాంతంగా కూర్చుని ఈ ఆసనాలను చేయవచ్చు. ఈ ఆసనాలు చాలా తేలికగా ఉన్నప్పటికీ చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. శరీరంలో ఉన్న ప్రతికూల అంశాలను తీసేసి అనుకూల అంశాలను పెంపొందిస్తాయి ఈ యోగాసనాలు.. మరి ఆ ఆసనాల్లేంటో చూసేద్దామా..
మేరుదండాసనం
కూర్చుని లేదా పడుకుని వేసే ఆసనాల్లో మేరు దండాసనం సులభమైనదే కాక ప్రధానమైనది కూడా. మేరుదండం అనగా వెనె్నముక. ఇది వెనె్నముకకు చురుకుదనాన్ని తెచ్చే ఆసనం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ప్రతి క్రియను కుడివైపుకు, ఎడమవైపుకు ఐదు నుంచి పది సార్ల వరకు నెమ్మదిగా చేయాలి. ప్రతిసారీ శ్వాస వదులుతూ పక్కకు తిరగాలి. శ్వాస పీలుస్తూ మధ్య స్థితికి రావాలి. ఇందులో వెన్నెముక, నడుముపై ధ్యానం కేంద్రీకరించాలి.
* ముందుగా రెండు కాళ్లను ముందుకు చాచి, రెండు అరచేతులను కుడి తొడకు పక్కన నేలకు ఆన్చాలి. కిందికి వంగుతూ నుదురు, ఛాతిలను కుడివైపు నేలకు తాకించేందుకు ప్రయత్నించాలి. ఈ క్రియను కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి.. ఇలా వరుసగా ఐదు నుండి పదిసార్ల చేయాలి.
* రెండు చేతులను వెనుకవైపున నేలకు ఆనించాలి. తరువాత రెండు కాళ్లను తిన్నగా చాచి, రెండు మడమలు తాకించాలి. తరువాత రెండు కాళ్ల బొటన వేళ్లను కలపాలి. ఇప్పుడు నడుమును కుడివైపునకు వంచాలి. ఎడమ వైపుకు చూడాలి. తరువాత మధ్యస్థితికి రావాలి. ఇదేవిధంగా రెండోవైపు కూడా చేయాలి.
* రెండు చేతులు వెనుకవైపు నేలకు ఆనించి కాళ్లను చాచాలి. ఇప్పుడు కుడికాలిని ఎడమ కాలిపై క్రాస్ చేసి ఉంచాలి. నడుమును కుడివైపుకు వంచుతూ ఎడమవైపుకు చూడాలి. మధ్యస్థితికి వచ్చి నడుమును ఎడమ వైపుకు వంచుతూ కుడివైపుకు చూడాలి. ఎడమ కాలును క్రాస్ చేసి కుడి కాలిపై ఉంచి ఇదేవిధంగా చేయాలి. ఇలా రెండు వైపులా ఐదు నుంచి పది సార్లు చేయాలి.
* కుడి మడమను, ఎడమ పాదం వేళ్లపై ఉంచి నడుమును కుడివైపుకు వంచుతూ ఎడమవైపుకు చూడాలి. మధ్యస్థితికి వచ్చిన తరువాత ఇదేవిధంగా ఎడమవైపు కూడా చేయాలి.
* కుడి అరికాలును ఎడమ మోకాలిపై ఉంచి కుడి మోకాలును రెండు దిక్కులా నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. ఇదేవిధంగా రెండో కాలును కూడా చేయాలి.
* రెండు చేతులను వెనుకవైపు నేలకు ఆనించి, రెండు మోకాళ్లను మడిచి రెండు మడమల్లి పిరుదుల దగ్గరకు తేవాలి. రెండు మెకాళ్లు కుడివైపుకు వంచి ఎడమ వైపుకు చూడాలి. ఇదేవిధంగా రెండో వైపు కూడా చేయాలి.
* పడుకుని కాళ్లు రెండూ తిన్నగా చాచి, కుడికాలును ఎత్తి సాధ్యమైనంతవరకు ఎడమవైపు ఉన్న భూమిని తాకాలి. ఇప్పుడు కుడివైపుకు చూడాలి. ఇలా ఎడమ వైపు కూడా చేయాలి.
* రెండు కాళ్లు తిన్నగా ముందుకు చాచి, రెండు కాళ్లూ కలిపి ఎత్తి కుడివైపు భూమిని తాకాలి. ముఖ భాగం ఎడమవైపుకు చూడాలి. ఇదేవిధంగా రెండోవైపు కూడా చేయాలి.
ఈ ఆసనాల వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనం కలుగుతుంది. మెడకు, వెనె్నముకకు చురుకుదనం లభిస్తుంది. లివరు, పాంక్రియాస్, మూత్రపిండాలు, స్పెయిన్, పేగుల్లో ఏవైనా రుగ్మతలుంటే తొలగిపోయి శక్తివంతం అవుతాయి. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. చేతుల, కాళ్ల ఎముకలు బలపడతాయి. వెనె్నముక చురుకుదనాన్ని పెంచేదే మేరు దండాసనం. ఈ ఆసనాన్ని పడుకుని కూడా చేయవచ్చు.
భద్రాసనం
యోగాసనాలలో సింహం, పద్మం, వజం, భద్రం అనే నాలుగు ఆసనాలు ప్రధానమైనవి. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే ఆసనం కాబట్టి దీన్ని భద్రాసనం అంటారు. ఈ ఆసనంలో ముందుగా రెండు కాళ్లు చాచి కూర్చోవాలి. రెండు మోకాళ్లను మడిచి, రెండు అరికాళ్లను కలపాలి. కలిపిన రెండు అరికాళ్లు మెల్లమెల్లగా గజ్జల దగ్గరకు తెచ్చి ఆనించాలి. రెండు చేతులతో రెండు మోకాళ్లను నేల వైపు అణచాలి. తరువాత రెండు చేతుల వేళ్లు కలిపి రెండు పాదాల వేళ్లను పట్టుకోవాలి. ఈ సమయంలో శ్వాస సామాన్యంగా ఉండాలి. కళ్లు మూసుకోవాలి. మలద్వారం, జననేంద్రియం మధ్య భాగం అనగా మూలాధార చక్రంపై మనస్సును కేంద్రీకరించాలి. కొద్దిసేపు తరువాత కాళ్లు చాచి చేతులతో మోకాళ్లపై పాదాలపై టపటపా కొట్టి విశ్రాంతి ఇవ్వాలి.
ఇలా చేయడం వల్ల తొడలు, మోకాళ్లు, పిక్కలు చురుకుగా ఉంటాయి. జననేంద్రియాల జబ్బులు తగ్గుతాయి. మనసుకు భద్రత లభిస్తుంది.
పక్షి క్రియ
పక్షి రెక్కల్లా మోకాళ్లు కదులుతూ ఉండటం వల్ల ఈ క్రియను పజీ క్రియ అంటారు. ముందు కింద కూర్చుని కాళ్లు తిన్నగా ముందుకు చాచాలి. తరువాత రెండు మోకాళ్లు మడిచి, రెండు అరికాళ్లు, రెండు మడమలు కలిపి పాదాల్ని నమస్కార రూపంలో ఉంచాలి. పాదాలు జననేంద్రియానికి కొద్దిగా అంటి ఉండాలి. రెండు చేతుల వేళ్లు కలిపి, రెండు పాదాల వేళ్లను భద్రాసనంలో వలె పట్టుకోవాలి. ఇప్పుడు మోకాళ్లను కిందికి, పైకి పక్షి రెక్కల వలె కొద్దిసేపు ఎత్తుతూ, దింపుతూ ఉండాలి. తరువాత కాళ్లను చాచాలి. ఈ సమయంలో శ్వాస సామాన్య పద్ధతిలో ఉండాలి. ఈ క్రియను రెండు నుంచి ఎనిమిది సార్లు చేయాలి.
మోకాళ్ల నొప్పి, తొడల నొప్పి, తొడ జాయింట్ల నొప్పి తగ్గుతుంది. దీనిని ఎవ్వరైనా చేయవచ్చు.
గోరక్షాసనం
గురు గోరఖనాథుడు ఈ ఆసనం వేస్తూ ఉండేవాడు కనుక దీనికి గోరజాసనం అనే పేరు కూడా ఉంది. భద్రాసనంలో వలె రెండు అరికాళ్లు కలిపి గజ్జలకు ఆనించాలి. రెండు చేతులూ నేలపై ఉంచి నొక్కుతూ, పిరుదుల్ని ఎత్తి మడమలపై ఉంచాలి. బాలెన్స్ సరిపోగానే రెండు చేతులు, రెండు మోకాళ్లపై నొక్కి ఉంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచి తరువాత రెండు చేతులను ఛాతి దగ్గరకు కానీ లేదా పైకెత్తిగానీ కలిపి నమస్కారించాలి. ఈ సమయంలో శ్వాస సామాన్యంగా ఉండాలి.
గోరక్షాసనం వల్ల మూత్రదోషాలు తొలగిపోతాయి. రుతు సమస్యలు తగ్గుతాయి. లుకోరియా, నడుమునొప్పి తగ్గుముఖం పడుతుంది.