సబ్ ఫీచర్

మార్పును ఆహ్వానించాలి!( ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి, మందుల దుకాణంలోని మందు సీసాలకు ముందు వివరాలు తెలిపే చీటీలు అంటించినట్లుగా ‘‘అది తప్పు, ఇది ఒప్పు’’అనే చీటీలు తగిలించి జీవితాన్ని వర్గీకరించడం అంత సులభం ఏమాత్రం కాదు. ఎందుకంటే, జీవితం మందుల దుకాణం లాంటిది కాదు. అది చాలా మార్మికమైనది. దానిని మీరు నియంత్రించలేరు. ఒక్క క్షణం అంతా సవ్యంగానే ఉంటుంది. మరుక్షణం అంతా అపసవ్యంగా మారి గంగలో కలిసిపోతుంది. అలా ఉంటుంది జీవితం.
‘‘తప్పు, ఒప్పు’’లకు నా నిర్వచనం ఏమిటో తెలుసా? అస్తిత్వంతో విభేదించేది ‘‘తప్పు’’, అస్తిత్వంతో సామరస్యంగా ఉండేది ‘‘ఒప్పు’’, కాబట్టి మీరు ప్రతి క్షణం చాలా ఎరుకతో ఉండాలి. ఎందుకంటే, ఏదైనా ప్రతి క్షణం అప్పటికప్పుడు తాజాగా నిర్ణయించబడుతుంది.
కాబట్టి, ‘‘తప్పు, ఒప్పు’’లను నిర్ణయించే విషయంలో సిద్ధంగా ఉన్న సమాధానాలపై మీరు ఏమాత్రం ఆధారపడలేదు. కేవలం మూర్ఖులు మాత్రమే సిద్ధంగాఉన్న సమాధానాలపై ఆధారపడతారు.
ఎందుకంటే, అప్పుడు వారికి తెలివితో ఎలాంటి అవసరము ఉండదు. పైగా, అవి మీకు కచ్చితంగా గుర్తుంటాయి. ఎందుకంటే వాటి జాబితా చాలా చిన్నది. కేవలం పది ఈశ్వరాజ్ఞలు మాత్రమే.
కాబట్టి, ఏది తప్పో, ఏది ఒప్పో మీకు తెలుసు. కానీ, జీవితం నిరంతరం మారిపోతూనే ఉంటుంది.
ఒకవేళ ‘మోజెస్’ మళ్ళీవచ్చినా ఆ పది ఈశ్వరాజ్ఞలనే మీకు ఇస్తాడని నేననుకోను. ఎందుకంటే, అతడు ఆ పని చెయ్యలేదు. మూడువేల సంవత్సరాల తరువాత కూడా అతడు ఆ పది ఈశ్వరాజ్ఞలనే మీకు ఎలా ఇవ్వగలడు? వాటికి ఎప్పుడో కాలం చెల్లింది. కాబట్టి, అతడు కొత్తవి కనుక్కోక తప్పదు. నా అవగాహన మేరకు ఆ పది ఈశ్వరాజ్ఞలను ప్రజలకు ఇచ్చిన ప్రతిసారి అవి వారికి అనేక సమస్యలనే సృష్టించాయి. ఎందుకంటే, వాటికి ఎప్పుడో కాలం చెల్లింది.
జీవితం గంగానదిలా ఎప్పుడూ చాలా వేగంగా ముందుకు పోతూనే ఉంటుంది తప్ప, నీటి గుంటలా ఒకేచోట ఎప్పుడూ స్థిరంగా ఉండదు.
ఇంకా చెప్పాలంటే, కనీసం రెండు క్షణాలు కూడా అది ఒకేలా ఉండదు. కాబట్టి, ఈ క్షణం ఒప్పుగా ఉన్నది మరుక్షణం అలా ఉండకపోవచ్చు. అప్పుడేం చెయ్యాలి? నిరంతరం మారుతున్న జీవితం పట్ల పూర్తి ఎరుకతో స్పందిస్తూ స్వయంగా నిర్ణయం తీసుకునేలా మనుషులను తయారుచెయ్యాలి. అదొక్కటే మార్గం.
ఒక జెన్ కథ:
పరస్పర శత్రుత్వమున్న రెండు దేవాలయాల పూజారులు తమ శిష్యులతో ‘‘ఆ గుడి పూజారి శిష్యుడితో ఎప్పుడూ మాట్లాడకు. వాళ్ళు చాలా దుర్మార్గులు’’అని బోధించేవారు. ఎంతైనా, పిల్లలు పిల్లలే కదా! ఒకరోజు ఆ పూజారుల శిష్యులిద్దరూ దారిలో కలుసుకున్నారు. వారిలో ఒకడు ‘‘ఎక్కడికి వెళ్తున్నావు?’’అని అడిగాడు తనకు ఎదురైన శిష్యుడిని.
జెన్ తత్వం, తావో బోధనలు రోజూ వింటున్న ఆ శిష్యుడు ‘‘ఈ గాలి నన్ను ఎటు తీసుకువెళ్తే అటు’’అన్నాడు. అతని సమాధానానికి ఏంచెప్పాలో తెలియక, అవమానభారంతో రగిలిపోతూ తన గురువు దగ్గరకు వెళ్ళి ‘‘నన్ను మన్నించాలి. మీరు వద్దన్నా ఆ పూజారి శిష్యుడితో మాట్లాడాను.
ఊరికే ‘‘ఎక్కడికి వెళ్తున్నావు?’’ అని అడిగినందుకు వాడు చాలా పొగరుగా ‘‘ఈ గాలి నన్ను ఎటు తీసుకువెళ్తే అటు’’అన్నాడు. నేను వెళ్తున్నట్లుగానే వాడుకూడా బజారుకు వెళ్తున్నాడని నాకు తెలుసు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.
ఇంకావుంది...