సబ్ ఫీచర్

సమాజానికి ఆత్మవిశ్వాసం పాఠశాలలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వానికి ముందు అసమానమైన సమాజం ఉంది. అసమానమైన సమాజంలో అసమానమైన స్కూళ్ళు ఉన్నాయి. ఈ రెండింటిలో ప్రాధాన్యత సమాజానికి ఇవ్వాలి కాబట్టి సమాజంలో సమానత్వం వస్తే దాని ప్రభావం స్కూళ్లపై పడుతుందనే నమ్మకంతో సమాజంపై కేంద్రీకరించటం సహజం. అందుకే అభివృద్ధిపైన ఎక్కువ కేంద్రీకరణ జరుగుతుంది. దాని ప్రభావం క్రమంగా పాఠశాలలపై ....కావచ్చును. దానికన్నా ముందు ప్రభుత్వం తెలంగాణలో ప్రతి మండలానికొక గురుకుల పాఠశాలను తెరిచి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ముస్లింలకు ప్రవేశం కల్పిస్తే, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదని బాధపడుతున్న సమాజానికి ఆ కొరత పూర్తి చేయవచ్చును. దీని వలన ఉపాధ్యాయులపైన బాధ్యత కూడా పెరుగుతుంది. కానీ, ఉపాధ్యాయులు తమ అమోఘమైన కృషితో ఎపి రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ తద్వారా కొత్త చరిత్రను సృష్టించారు. అది పేద విద్యార్థులకే పరిమితమైంది కానీ, వెనుకబడిన వర్గాలకు ఎంత విస్తరించాలో అంత విస్తరించలేకపోయింది. ప్రభుత్వ స్కూళ్లు కొంతవరకు మార్పు తీసుకురాగలుగుతాయి కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణ, పేద కుటుంబాల దారిద్య్రానికి పరిష్కారం చెప్పలేవు. తెలంగాణలో 80 శాతం మంది వెనుకబడిన వర్గాలున్నాయి. వారిలో కూడా ఎన్నో గ్రేడ్‌లున్నాయి. అది గ్రేడెడ్ పాపర్టీ. ఎంత కిందకు పోతే అంత దరిద్రం కనిపిస్తుంది. ఈ అసమానతను చెరిపివేయగలిగిన శక్తి చదువులకే వుంది. ప్రతి మండలంలో ఒకటో రెండో గురుకుల పాఠశాలలను తెరిస్తే విద్యారంగం ఇప్పటికన్నా మెరుగయ్యే అవకాశం వుంటుంది. ఈ యుగాలలో విద్యకు దారిద్య్ర నిర్మూలనకు దగ్గరి సంబంధం ఉంది. ఉపాధి ఎక్కువగా ప్రైవేట్ రంగంలో వస్తుంది. విద్యాప్రమాణమే ప్రధానం. దయా దాక్షిణ్యాలతో వచ్చిన ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలకన్నా ఎక్కువగా ఉండవు. దాని వలన దారిద్య్ర నిర్మూలనకన్నా అసంతృప్తి ఎక్కువగా పెరుగుతుంది. దానికి ఏకైక పరిష్కారం ప్రమాణం గల చదువువల్లనే దారిద్య్ర నిర్మూలన జరుగుతుంది. ప్రమాణం గల చదువే వెనుకబడిన వర్గాలలో ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ రంగంపై ఖర్చుపెట్టే ఖర్చును భవిష్యత్‌కు పెట్టుబడిగా చూడాలి. అసమానమైన సమాజానికి ఆత్మవిశ్వాసాన్నిచ్చేది పాఠశాలలే.
* * *
సమాజాన్ని అనుక్షణం మార్చటమే విద్య లక్ష్యం. 19వ శతాబ్దంలో ఫ్యూడల్ వ్యవస్థలో ఆనాడు చదువు లక్ష్యం ఆనాటి సమాజాన్ని సుస్థిరపరచటమే, కానీ 20వ శతాబ్దంలో యూరప్‌లో వచ్చిన పరిణామాలు, రెండవ ప్రపంచ యుద్ధం, మన దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం చదువుకు కొత్త లక్ష్యాన్ని ఇచ్చాయి. అదే సమానత్వమనే కాంక్షను తీసుకువచ్చాయి. అందుకే స్వాతంత్య్ర ఉద్యమంలో వచ్చిన తీర్మానాలన్నీ కూడా విద్య అందరికీ అందుబాటులో ఉంచాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో పలు విద్య అందరికీ అన్నాం కానీ అది కొందరికే ఫలితాన్నిచ్చింది. చదువును దారిద్య్రమే నిర్దేశించదు. సాంఘిక న్యాయం కూడా విద్యావ్యవస్థకు దోహదపడ్డాయి. ఆనాడు ఉపాధ్యాయులుగా వచ్చిన వారైనా పాలనాయంత్రంలోకి కీలక స్థానాల్లోకి వచ్చినవారైనా ఆనాడు సాంఘిక న్యాయమే నిర్దేశించింది. 20వ శతాబ్దం చివరలో చదువు అందరికీ ఎంత ప్రధానమో సాంఘిక అంతస్థులను కూడా తొలగించటం కూడా ముఖ్యమైనది. 1980నుంచి వెనుకబడిన వర్గాలలో చదువుమీద ఆసక్తి పెరిగింది. అది సమాజ వికాసానికి ఇంధనంగా ఉపయోగపడుతుందని అన్ని దేశాలు గుర్తించాయి. దారిద్య్ర నిర్మూలనతో సహజ సామాజిక న్యాయంకూడా చదువు లక్ష్యంగా మారిపోయింది. అందుకే పాఠశాల స్వరూపం మారవలసిన పరిస్థితి వచ్చింది. కేవలం లక్ష్యంతో మార్పు వచ్చింది కానీ బోధనాపద్ధతుల్లో మార్పురాలేదు. కాబట్టి సామాజిక న్యాయం అట్టడుగువర్గాలకు అందలేదు. ఈనాడు చదువులక్ష్యం సామాజిక న్యాయాన్ని సాధించాలంటే విద్యయొక్క వివిధ అంగాలలో విప్లవాత్మకమైన మార్పురావాలి. అనగా బోధనా పద్ధతులలో విద్య నిర్వహణలో, యాజమాన్యంలో ఆ దశలో మార్పువస్తేనే విద్యయొక్క టెక్నాలజీ ఫలితాలు అందరికీ అందుతాయి. బడులు తెరిచినంతమాత్రాన విద్యావ్యాప్తికాదు, విద్యావ్యవస్థలో ఉన్న సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో మార్పురావాలి. నేటి కర్తవ్యం విద్యారంగం సామాజిక రంగాన్ని మార్చాలి. అప్పుడే విద్యా ఫలితాలు అట్టడుగువర్గాలకు అందుతాయి.
* * *
తరగతి గదిలో విద్యార్థి అవగాహనే ప్రధానం. ఈ అవగాహనలో క్యూరియాసిటీ (ఆసక్తి), ఉపాధ్యాయుడు చెప్పే పద్ధతి. విద్యార్థి నేర్చుకునే పద్ధతి, మేధస్సు ఎలా పనిచేస్తుందో వీటిపైన ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతులను కొలమానం చేయలేం. కొలమానం చేయలేని దానిని వృద్ధిచేయటం చాలా క్లిష్టమైన పని. చాలామంది పుస్తకంలో ఉన్న విషయానే్న పదేపదే వల్లిస్తారు. అవి అర్థంకాక పిల్లలు కళ్లప్పగించి తెల్లమొఖం వేస్తారు. పుస్తకంలో ఉండే విషయాన్ని ఉపాధ్యాయుడు అర్థంచేసుకుని కనపడని అంశాలను స్పృశిస్తేనే విద్యార్థికి అవగాహన పెరుగుతుంది. విద్యాసముపార్జన బోధనతో రాదు, మేధస్సులో జరిగే ప్రక్రియే అవగాహనను పెంచుతుంది. అర్థంకాని చదువు వ్యర్థం అంటారు. అర్థమైతేనే దానిలోనుంచి కొత్త భావన ఉత్పత్తిఅవుతుంది. చాలామంది పిల్లల మార్కులనుబట్టి అంచనావేస్తారు. మార్కులవేటలో విద్యార్థికూడా గ్రంథంలోఉన్న దాన్ని కంఠస్తం చేస్తాడు. కంఠస్తం చేయటం అవగాహన ఫలితంకాదు, అవగాహన అయితే మేధస్సులో కొత్తవాదన ఉత్పత్తిఅవుతుంది. భావన ఉత్పత్తి అవగాహన ఫలితం. కంఠస్తం ఫలితం మార్కులు. మార్కులకున్న అవగాహనకున్ను ఉన్న తేడాను గుర్తించినప్పుడే విద్యాప్రమాణాలు పెరుగుతాయి. అవగాహన పెరిగినప్పుడే కొత్త్భావాలు పుట్టుకొస్తాయి. దానే్న క్రియేటివ్ థింకింగ్ (కాల్పనిక శక్తి) అంటారు. ఈరోజుల్లోపల ప్రతి విద్యార్థి ఒక క్రియేటివ్ థింక్ (్భవాల ఉత్పత్తి)కి కేంద్రం కావాలి. అప్పుడే అవి విద్యాప్రమాణాలు పెరగటానికి దోహదపడతాయి. ఇంత సంక్లిష్టమైన పనిని నిర్వహిస్తున్నారు కాబట్టే సమాజం ఉపాధ్యాయుల్ని గౌరవిస్తుంది. గురువును ఆరాధిస్తుంది. గురువులను మార్పులకు సంకేతంగా చూస్తారు. మార్కులకోసమే గురువులంటే వారు యాంత్రిక గురువులవుతారు.

-చుక్కా రామయ్య