సబ్ ఫీచర్

మానవ తప్పిదాలతోనే ప్రకృతి వైపరీత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ పౌరులందరూ గమనించి, భావితరాలకు బాసటగా నిలవాల్సిన ఒక మహోద్యమం. విస్మరిస్తే వినాశకాలానికి నాంది పలకడమే అవుతుంది. ఒకప్పుడు ముందు రానున్న ఉత్పాతాన్ని దార్శికులు మునుముందుగానే కనిపెట్టి దేశాధిరాజులకు తెలియజెప్పేవారట. అయితే నేడు శాస్ర్తియ విజ్ఞానంతో విశ్వవ్యాప్తమైన వాతావరణ కాలుష్యాన్ని, ప్రకృతిపరమైన వైపరీత్యాలను వాతావరణ శాస్తవ్రేత్తలు ముందే పసిగట్టి ప్రపంచ దేశాధినేతల ముందుంచుతున్నారు. మానవుడు శాస్ర్తియపరమైన అద్భుత విజ్ఞానాన్ని సంపాదించి రోదసియానం చేయవచ్చుకానీ, భూతలం మీద ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకొనే విజ్ఞానాన్ని ఇంతవరకు సాధించలేదు. ప్రమాదకర ఉత్పాతాలను ముందే పసిగట్టే విజ్ఞానం సంపాదించినా ప్రమాదాలను నిక్కచ్చిగా నివారించే విజ్ఞానాన్ని మానవుడు ఒడిసిపట్టలేక పోతున్నాడు.
విశ్వవ్యాప్తంగా మానవ తప్పిదాలతోనే ప్రకృతిపరమైన ఉత్పాతాలను మానవాళి కొని తెచ్చుకోవడం జరుగుతోంది. వాతావరణం లో తలెత్తుతున్న అనూహ్యమైన మార్పులు, ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. వీటన్నింటికీ కారణాలు మానవుడి పర్యావరణ విధ్వంసకర కార్యకలాపాలేనని అంతర్జాతీయ వేదికల్లో జరిగిన మేధోమధనం స్పష్టంచేసింది. వాతావరణ కాలుష్య పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే 2100నాటికి విశ్వవ్యాప్తంగా ప్రస్తుతానికంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణకు యుద్ధప్రాతిపదికన తక్షణమే పూనుకోకుంటే పెను ఉత్పాతాలను ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందని పదే పదే హెచ్చరిస్తున్నారు.
వాతావరణ పరిశీలకులు గత 1300 సంవత్సరాల కాలం నుంచి పరిశీలిస్తే, 2000-2009 మధ్యకాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. జాతీయ వాతావరణ అధ్యయనం ప్రకారం భూగోళం అనూహ్యంగా వేడెక్కడానికి మానవ తప్పిదమేనన్నది నగ్నసత్యం. బొగ్గు, పెట్రోలు వంటి శిలాజ ఇంధనాల ఉద్గారాలు పెద్దఎత్తున పరచుకొని సౌరశక్తిని గ్రహించి భూగోళాన్ని మరింత వేడెక్కించడంవల్లే ఎండలు మితిమీరి భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న భూతాపం భూగోళంపైన మాత్రమేకాకుండా వాతావరణ వ్యవస్థ, సముద్రాలు, హిమపాతం, ఉష్ణోగ్రతలపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతోంది.
పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థికవ్యవస్థ గమనాన్ని విశేషంగా ప్రభావితం చేసి, ప్రగతిరథాన్ని పరుగెత్తించింది. అయితే పారిశ్రామిక అవసరాలకు ప్రతి నిత్యం బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, తదితర శిలాజ ఇంధనాలను విశృంఖలంగా మండిస్తుండడంవల్ల వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్, నీటి ఆవిరి, సల్ఫర్‌డైఆక్సైడ్ వాయువుల పరిణామం నానాటికీ పెరగడం భూగోళం మండిపోవడానికి కారణం అవుతోంది. నగరీకరణ, పంట పొలాలు, జన నివాసాలుగా మారడం, విచ్చలవిడిగా పంట పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం, విచ్చలవిడిగా అడవుల్ని నరికివేయడం, చమురు సహజ వాయువులను అతిగా మండించడంవల్ల విడుదలయ్యే మిథేన్ వాయువు వాతావరణంలో స్వల్ప మోతాదులో ఉన్నప్పటికీ, భూగోళాన్ని వేడెక్కించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తోంది.
దీనికితోడు నగరాల్లో, పట్టణాల్లో నానాటికీ పెరుగుతున్న వాహన కాలుష్యం వాతావరణాన్ని మరింత దిగజారుస్తోంది. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే విజ్ఞానశాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి, పారిశ్రామికీకరణల మూలంగా గడించిన అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చినప్పటికీ, పర్యావరణ విధ్వంసం మాత్రం మానవులు చేజేతులా చేసుకున్న తప్పిదమే.
వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా ఈ శతాబ్దానికి భూగోళంపైన ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల సెల్సియస్ దాటితే పరిస్థితులు మరింత భయంకరంగా ఉంటాయని వారు తేల్చిచెప్పారు. భూగోళం అగ్నిగుండంగా మారడానికి ప్రధాన కారణం మనం సృష్టిస్తున్న కర్బనవాయు ఉద్గారాలే. అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, అమెరికా, భారత్‌లు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు స్పందించిన చైనా, అమెరికా, భారత్ మరో 145 దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేందుకు కృషిచేస్తామని హామీఇచ్చినా కార్యాచరణలో చిత్తశుద్ధి లోపించడంవల్ల ఈ దిశగా ముందడుగు వేయకపోవడం గమనార్హం. 2100నాటికి సముద్రమట్టాలు 28సెం.మీ నుంచి 82సెం.మీ పెరుగుతాయని శాస్తవ్రేత్తల అంచనా. ఇదే తీరున సముద్ర మట్టాలు పెరిగితే అనేక దీవులు, బంగ్లాదేశ్, నెదర్లాండ్, ఫ్రాన్స్ తదితర దేశాల్లోని తీర ప్రాంతాలు, డెల్టాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను అంతోఇంతో అడ్డుకోగల పరిస్థితి ప్రపంచ దేశాల వాతావరణ కాలుష్య నివారణలో ఉంది. అడ్డుకోకపోతే ప్రకృతి విలయానికి ప్రపంచ దేశాలు ఏవైనా అనుభవించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పర్యావరణ శాస్తవ్రేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు.

- దాసరి కృష్ణారెడ్డి