సబ్ ఫీచర్

ఆర్థిక ప్రణాళిక ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్తు అవసరాల కోసం ఏర్పాటు చేసుకునేదే ఆర్థిక ప్రణాళిక. పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లానింగ్, పన్నులు, పర్యటనలు, ఆరోగ్య సంబంధ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. అంటే భవిష్యత్తుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. అందుకే సంపాదన మొదలుపెట్టగానే ప్రతి ఒక్కరికీ నిర్దిష్టమైన ప్రణాళిక ఉండడం చాలా అవసరం. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత లక్ష్యం, ఆర్థిక లక్ష్యం అనే రెండు లక్ష్యాలు ఉండాలి. వ్యక్తిగత లక్ష్యాన్ని పక్కనబెడితే.. ఆర్థిక లక్ష్యం రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి స్వల్పమైనది, దీర్ఘకాలికమైనది. పిల్లల చదువు, అభిరుచులు, విహార యాత్రలు, ఉద్యోగ మార్పులు, కుటుంబానికి ఏర్పాటు చేసుకోవడం, కారు, ఇల్లు.. ఇలా ఇవన్నీ ఆర్థిక లక్ష్యాల కిందకే వస్తాయి. అయితే వీటిని స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలుగా విభజించుకుని అవన్నీ సాధించేందుకు ఎంత పొదుపు చేయాలనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే.. వచ్చిన జీతం వచ్చినట్లుగా ఖర్చు పెట్టకుండా ఎంతో కొంత పొదుపు చేయాలనుకునే స్పష్టత ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒకవేళ ఉంటే దాన్ని స్టాక్ మార్కెట్, ఈక్విటీఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే దిశగా ఆలోచించాలి. ఒకవేళ ఇందులో నష్ట్భయం ఉంటుంది అనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్, డెబిట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే దిశగా ఆలోచనలు చేయవచ్చు. దీనికి తగినట్లుగా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఆ తరువాత పొదుపును మొదలుపెట్టవచ్చు.
* మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారో ఆ సంపాదనతో పాటు నెలకు అయ్యే ఖర్చులు, పొదుపు.. ఇలా అన్నింటినీ ఓ కాగితంపై రాసుకోవాలి. * వీటితో పాటు మీరు నిర్వహించే బ్యాంకు ఖాతాలు, స్టాక్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఆస్తుల వివరాలు రాసి ఉంచుకోవాలి. జీతం కాకుండా వచ్చే ఇతరత్రా ఆదాయాలు, గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు వివరాలన్నింటినీ రాసుకుని ఆ తరువాతే ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నిర్ణయం తీసుకోవాలి. * ఒకవేళ మీ భర్త కూడా మీకు సహకరిస్తే.. ఇద్దరూ కలిపి వచ్చే సంపాదనలో ఖర్చు, పొదుపు లెక్కలు వేసుకుని దేనిలో పెట్టుబడి పెట్టాలో కలిసి నిర్ణయం తీసుకోండి.
వచ్చే ఆదాయంలో యాభై శాతాన్ని రోజువారీ ఖర్చులకు ఉపయోగించుకోవాలి. అంటే ఆహారం, పిల్లల చదువులు, మెయింటెనెన్స్, రవాణాఖర్చులు వంటివన్నమాట..
* భార్యాభర్తలిద్దరూ కలిసి ఉమ్మడి ఖాతాను తెరిచి అందులో ఇద్దరి సంపాదనను వేయాలి. అందులోంచే ఇద్దరూ ఖర్చు పెట్టాలి, పొదుపు చేయాలి. పొదుపుపై ఇద్దరికీ హక్కు ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు, ఎవరు దేనిమీద ఎంత ఖర్చు చేస్తున్నారో.. ఇద్దరికీ స్పష్టత ఉండాలి. అప్పులు, ఆస్తులను చూసుకుంటూ ఇద్దరూ కలిసి ఓ బడ్జెట్‌ను తయారుచేసుకోవాలి. అప్పుడే ఇద్దరికీ ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. కాబట్టి ఇద్దరూ మాట్లాడుకుని ఆ తరువాతే నిర్ణయం తీసుకోవాలి. *