సబ్ ఫీచర్

సత్యాన్ని మార్చలేము! ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరన్నట్లు ‘‘వాళ్ళు చాలా దుర్మార్గులు’’అన్నారు. వెంటనే ఆ పూజారి తన శిష్యునితో ‘‘నువ్వు నా మాట వినకుండా, నేను వద్దన్న పనిచేశావు. చూశావా ఏం జరిగిందో. రేపు నువ్వు మళ్ళీ అదే దారిలో నిలబడు. వాడు మళ్ళీ నీకు ఎదురవుతాడు. అప్పుడు నువ్వు వాడిని మళ్ళీ ‘‘ఎక్కడికి వెళ్తున్నావు?’’అని అడుగు. అప్పుడు వాడు మళ్ళీ ‘‘ఈ గాలి నన్ను ఎటు తీసుకువెళ్తే అటు’’అంటాడు. వెంటనే నువ్వుకూడా గొప్ప వేదాంతిలా ‘‘ఒకవేళ నీకు కాళ్ళులేకపోతే ఏం చేస్తావు? ఎందుకంటే, ఆత్మకు శరీరం ఉండదు కదా! అలాగే గాలి ఆత్మను ఎక్కడికీ తీసుకెళ్ళలేదు. ఏమంటావు? అని వానిని అడుగు’’అని సలహాఇచ్చాడు పూజారి. అది వాడికి బాగానచ్చింది. అలా వాడు నేర్చుకున్న వేదాంత జ్ఞానంతో మరునాడు వాడిని ప్రశ్నించేందుకు అదేదారిలో నిలబడ్డాడు. అనుకున్నట్లుగానే వాడు వచ్చాడు. వెంటనే ‘‘ఎక్కడికి వెళ్తున్నావు?’’ అని అడిగాడు సమాధానంతో సిద్ధంగాఉన్న ఆ శిష్యుడు. కానీ, వాడు ‘‘కూరలు కొనేందుకు బజారుకెళ్తున్నా’’అన్నాడు. దానికి మళ్ళీ ఎదురు సమాధానం చెప్పలేకపోయాడు ఆ శిష్యుడు. మరి పూజారినుంచి నేర్చుకున్న వేదాంతం ఏమైనట్లు? జీవితం అలాగే ఉంటుంది. అలాంటి దానికోసం మీరు ఏదీ సిద్ధం చేసుకోలేరు. సిద్ధంగా ఉండలేరు. అది ఎప్పుడూ మిమ్మల్ని మీకు తెలియని వాటిలోకి దించి మీరు ఆశ్చర్యపడేలా చేస్తుంది. అదే దాని అద్భుత సౌందర్యం. చూసే కనులకు మనసుంటే, ఆ మనసుకు కూడా కళ్ళుంటే ఎటుచూసినా ఆశ్చర్యాలే కనిపిస్తాయి ప్రతిక్షణం. సిద్ధంగా ఉన్న సమాధానాలు వాటికి ఎప్పుడూ వర్తించవు.
బుద్ధి మార్గం: ఎలాంటి అరమరికలు, పక్షపాతాలు లేకుండా సమయస్ఫూర్తితో కూడిన బుద్ధిజీవంతో నిండి తేజోమయంగా ఉంటుంది. ఎలాంటి ముగింపు తీర్మానాలు లేకుండా పనిచెయ్యడమే ధైర్యమంటే. అలా ఎందుకంటున్నానంటే, మీ ముగింపు తీర్మానాలే మీకు సురక్షితమైన భద్రతను కల్పిస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే, మీరు చేసే పనికి కావలసిన ప్రావీణ్యం మీదగ్గర ఉంది కాబట్టి. దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీకు చాలా స్పష్టంగా తెలిసే ఉంటుంది. అందుకే నేను అలా అన్నాను. నిజానికి, ఎలాంటి ముగింపు తీర్మానాలులేకుండా పనిచెయ్యడమంటే మీరు చాలా అమాయకంగా పని ప్రారంభించినట్లే. అలాంటి పనిలో మీకు ఎలాంటి రక్షణ లభించదు. అందువల్ల మీరు పొరబడి తప్పుదారి పట్టవచ్చు. సత్యానే్వషణకు సిద్ధపడేవారు అనేక తప్పులు, పొరపాట్లు చేసేందుకు, వాటివల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, ఆ అనే్వషణలో ఎవరైనా తప్పుదారి పట్టవచ్చు. కానీ, ఎవరైనా అలాగే తమ గమ్యాన్ని చేరుకుంటారు. అలా వారు అనేకసార్లు తప్పుదారి పడతారు. ఆ క్రమంలోవారు తమ తప్పును తెలుసుకోవడం, అలాంటి తప్పులు మళ్ళీ చెయ్యకపోవడం జరుగుతుంది. అలా తమ తప్పును తెలుసుకోవడం ద్వారా ఎవరైనా సత్యాన్ని సమీపిస్తూ ఉంటారు. అది స్వయంగా చేసే అనే్వషణ కాబట్టి, మీరు ఇతరుల ముగింపు తీర్మానాలపై ఆధారపడలేరు.
అవును, మీరు మనోరహితంగానే జన్మించారు. ఈ విషయాన్ని మీరు మీ హృదయం లోతుల్లోకి వీలైనంతగా వెళ్ళనివ్వండి. అలా చెయ్యడం ద్వారా మీలో ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఎందుకంటే, మనసు అనేది కేవలం సామాజిక కట్టుబాట్లు, అలవాట్లద్వారా తయారైనది మాత్రమే తప్ప సహజమైనది కాదు. అలాంటి దానిని మీ నెత్తిన రుద్దడం జరిగింది. అయినా అందులోంచి మీరు బయటపడగలరు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.