సబ్ ఫీచర్

అనుభవమే సత్యం ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే, లోలోపల మీరు ఇంకా స్వేచ్ఛగానే ఉన్నారు. నిజానికి, ఎవరూ తమ సహజత్వాన్ని ఎప్పటికీ కోల్పోలేరు. కానీ, తలచుకుంటే ఎవరైనా ఏ క్షణంలో అయినా తమ కృత్రిమత్వం నుంచి బయటపడగలరు.
అస్తిత్వం ఎప్పుడూ ముందుకు వెళ్ళేందుకే ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి, దానిది మానసిక స్థితికాదు, దానికి మించినది. వౌలికమైనది తెలుసుకోవాలంటే ఆలోచనారహిత స్థితిలో ఉండడమొక్కటే అసలైన మార్గం. విజ్ఞాన, వేదాంత, ధర్మశాస్త్రాలన్నీ ఆలోచనతో ముడిపడి ఉన్నవే. కానీ ధార్మికత అనేది ఆలోచనకు సంబంధించినది కాదు. అది మీకు అతి సన్నిహితమైనది. అందుకే అది మీకున్న అన్ని అడ్డంకులను తొలగించి, మిమ్మల్ని వాస్తవానికి మరింత చేరువ చేస్తుంది. అప్పుడు మీరు ఆ వాస్తవంతో ఏకమై మీ జీవితంలోకి ప్రవహించడం ప్రారంభిస్తారు. దానివల్ల మీరు జీవితానికి దూరంగా, దేనికోసమో చూస్తున్నారనే భావన మీలో ఎప్పుడూ కలగదు.
మరొక రకమైన తెలుసుకోవడం కూడా వుంది. దానిని ‘‘జ్ఞానము’’ అనలేము. ఎందుకంటే, చాలా ప్రేమ లాంటి అది ఎప్పుడూ జ్ఞానంకన్నా తక్కువే. అందుకే దానిని వ్యక్తీకరించేందుకు ‘‘జ్ఞానము’’అనే పదము ఏమాత్రం సరిపోదు. అయినా అది దానికి చాలాదగ్గరగా ఉంటుంది.
మానవ చైతన్య చరిత్రలో ముందుగా ఇంద్రజాలం (మాయ) ఉద్భవించింది. మతము, విజ్ఞాన శాస్త్రాల కలయికే ఇంద్రజాలం. అందులో కొంత మనసుకు సంబంధించినది, మరికొంత మనోరహితానికి సంబంధించినది ఉంటుంది. అందుకే అందులోంచి వేదాంతం, ఆ వేదాంతంనుంచి విజ్ఞానశాస్త్రం ఉద్భవించాయి.
మనసు, మనోరహిత స్థితిల కలయికే ఇంద్రజాలం. వేదాంతం కేవలం మనసుకు సంబంధించినది మాత్రమే. అందుకే మనసు, ప్రయోగాల కలయిక విజ్ఞానశాస్త్రంగా పరిణమించింది. కాబట్టి, మనోరహిత స్థితి మాత్రమే అసలైన ధార్మికత. అందువల్ల ధార్మికత, విజ్ఞాన శాస్త్రాల ద్వారా మాత్రమే మీరు వాస్తవాన్ని చేరుకోగలరు. ధార్మికత తక్షణమే నేరుగా వాస్తవ హృదయంలోకి చొచ్చుకుపోతుంది, విజ్ఞానశాస్త్రం పరోక్షంగా మరొక దారిలో చుట్టుతిరిగి వాస్తవాన్ని చేరుకుంటుంది.
మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
తెలిసిన విషయాల గురించి మాత్రమే మనం చాలా లోతుగా ఆలోచించగలం. అంటే, నమిలినదానినే మళ్లీ మళ్లీ నమలడమన్నమాట. కాబట్టి, ఆలోచించడమనేది ఎప్పటికీ వౌలికమైనదిగా ఉండదు. తెలియని విషయాలగురించి మీరు ఎలా ఆలోచించగలరు? మీరు ఆలోచించగలిగినవన్నీ మీకు తెలిసిన విషయాలకు సంబంధించినవే. అవి మీకు తెలుసు కాబట్టే, వాటి గురించి మీరు ఆలోచించగలరు.
మహా అయితే, మీ ఆలోచన ‘‘గాలిలో ఎగిరే బంగారు గుర్రం’’ లాంటి నూతన కలయికలను సృష్టించగలదు. కానీ, అందులో నూతనత్వం ఏమీ లేదు. ఎందుకంటే, గుర్రాలు, బంగారం, ఆకాశంలో ఎగిరే పక్షులు మీకు తెలిసిన విషయాలే. వాటిని మీరు కలిపారు. మహా అయితే మీ ఆలోచన నూతన కలయికలను సృష్టించగలదేమో కానీ, తెలియని విషయాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే, తెలియని విషయం మీ ఆలోచనకు అందనంత దూరంలో వుంటుంది.
కాబట్టి, మీ ఆలోచన తెలిసిన విషయానే్న మళ్లీ మళ్లీ తెలుసుకునే వృత్తంలో తిరుగుతూంటుంది. అంటే, నమిలిన దానినే మళ్లీ మళ్లీ నమలడమన్నమాట.
- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.