సబ్ ఫీచర్

ప్రగతి లేని పప్పుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతూ వున్నా పెరుగుదల ఆశించిన స్థాయలో లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1970-71లో 10.8 కోట్ల టన్నులుంటే, 2000-01లో 19.7 కోట్ల టన్నులుగా, 2012-13లో 25.7 కోట్ల టన్నులుగా వుంది. అయితే, హరిత విప్లవం వల్ల గోధుమలు, వరి బాగా లాభం పొందాయి. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ప్రగతిని సాధించలేకపోయాయి. ప్రపంచంలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణంలో మన దేశం వాటా 33శాతం, ఉత్పత్తిలో ఈ శాతం 24. అయినా ఇప్పటికీ మనం దిగుమతులపైనే ఆధారపడి వున్నాం. ప్రస్తుతం పప్పు్ధన్యాల కొరత 20 లక్షల టన్నులు.
పప్పు్ధన్యాల ఉత్పత్తి 1970-71లో 1.2 కోట్ల టన్నులు, 2012-13లో 1.8 కోట్ల టన్నులు. 2015-16 (జూలై-జూన్)లో 1.7 కోట్ల టన్నులు వుండవచ్చు. గత సంవత్సరం (2014-15)లో ఇది అదే స్థాయిలో వుంది. పప్పు్ధన్యాల ఉత్పత్తి గత 40 ఏళ్లలో 40 శాతం కంటే తక్కువ పెరుగుదలనే సాధించింది.
2015-16 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 50,80,000 టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంది. పప్పు్ధన్యాల దిగుమతిపై సంవత్సరానికి ప్రస్తుతం రూ.17,500 కోట్లు ఖర్చుచేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి ఇలానే వుంది. పప్పు్ధన్యాల తలసరి లభ్యత రోజుకి 1971లో 51.2 గ్రాములుంటే, 2012నాటికి 41.7 గ్రాములకు పడిపోయింది. ఒక విషయం గుర్తించుకోవాలి శాఖాహారుల్లో అధిక ప్రొటీన్ ఉన్న ఆహారం పప్పు్ధన్యాలు మాత్రమే.
మన దేశంలో పప్పు ధాన్యాల సాగు వర్షాలపైనే ఆధారపడి వుంది. మొత్తం సాగుభూమిలో 15 శాతానికే నీటిపారుదల సౌకర్యం వుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ పప్పు దినుసులు పండించే ప్రధాన రాష్ట్రాలు. మొత్తం ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణంలో పప్పు్ధన్యాల వాటా 20 శాతం, ఉత్పత్తిలో మాత్రం వీటి శాతం 10.
గత రెండు సంవత్సరాలలో కరవు పరిస్థితులవల్ల పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఈ వేసవిలో ఇది 8,20,000 హెక్టార్లు వుంది. గత సంవత్సరం ఇది 10 లక్షల హెక్టార్లు. అంటే 18శాతం తగ్గుదల. ఉత్పత్తిలో తగ్గుదల ఐదు లక్షల టన్నులు. చాలా ప్రాంతాలలో నీటి కొరతే దీనికి ప్రధాన కారణం. పప్పు్ధన్యాల దిగుబడి 1970-71లో హెక్టారుకు 524 కేజీలు. ఇది 2012-13నాటికి 789 కేజీలకు చేరుకున్నది. ఈ పరిస్థితులలో పప్పు ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి.
కేవలం మద్దతు ధర పెంచడం ద్వారా పప్పు్ధన్యాల ఉత్పత్తి పెంచలేము. మేలురకం విత్తనాలు వున్నా రైతులందరూ వీటిని వాడటం లేదు. ప్రభుత్వమే ఈ పరిస్థితిని మార్చాలి. దిగుబడిని గణనీయంగా పెంచాలి. హైబ్రీడ్ వంగడాల్ని చీడపీడల్ని తట్టుకునే రకాల్ని వాడకంలోకి తేవాలి. ఇవి రైతులందరికీ అందుబాటులో వుండాలి. పప్పు్ధన్యాల ఉత్పత్తి లాభదాయకమని రైతులు నమ్మాలి. ఈ దిశగా ప్రభుత్వం కృషిచేయాలి.
పప్పు ధాన్యాల ధరలు పెరగడంవల్ల బాగా నష్టపోయేది పేద ప్రజలే. పప్పు ధాన్యాల సేద్యంలో విప్లవం రావలసిన అవసరం వుంది. పప్పు ధాన్యాల పంపిణీ విషయంలోనూ మనం శ్రద్ధచూపాలి. 2015లో కొద్దిరోజులు నిర్వహించిన దాడులలో 50,000 టన్నుల పప్పు్ధన్యాల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. గిరాకీ-సరఫరా మధ్య అంతరం ఉన్నప్పుడు దళారుల ఆటలను అరికట్టాలి. ప్రభుత్వం ప్రస్తుతం 50,000 టన్నుల పప్పు్ధన్యాల నిల్వలను సమకూర్చుకుంది. పరిస్థితి విషమిస్తే వీటిని విడుదల చేస్తుంది.

- డా.ఇమ్మానేని సత్యసుందరం