సబ్ ఫీచర్

ధ్యానంతో కొత్త అనుభవం (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి, ఆలోచించడమనేది ఎప్పటికీ వౌలికమైనదిగా ఉండదు.
వౌలికంగా వాస్తవానికి చేరడం, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా చాలా తీవ్రంగా వాస్తవానికి చేరడం, ఈ ఉనికిలోని మొట్టమొదటి వ్యక్తి మీరే అన్నట్లుగా వాస్తవానికి చేరడం- అదే ముక్తి పొందడమంటే. దాని నూతనత్వమే ముక్తిని కలిగిస్తుంది.
సత్యాన్ని స్వయంగా ఎదుర్కోవాలే తప్ప అధ్యయనం ద్వారా దానిని తెలుసుకోలేరు. సత్యం ఒక అనుభవమే కానీ, నమ్మకం ఏ మాత్రం కాదు. ప్రేమను అధ్యయనం చేసే వ్యక్తి కేవలం పటంలోని పర్వతాలను చూస్తూ హిమాలయాల గురించి అధ్యయనం చేసే వ్యక్తి లాంటివాడే. పటం ఎప్పటికీ పర్వతం కాదు. పటంలోని పర్వతాలను మీరు గుడ్డిగా నమ్మే పక్షంలో అవి మీ ముందు ఉన్నట్లుగానే ఉంటుంది.
కానీ, మీ కళ్ళల్లో అవి వున్న పటాలు మాత్రమే ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు ఏదో ఒకవైపు నుంచి ఎక్కి రకరకాల పటాలను తయారుచేశారు. ఖురాన్, బైబిల్, భగవద్గీత- అవన్నీ ఒకే సత్యానికి సంబంధించిన రకరకాల పటాలు మాత్రమే. వాటితో నిండిపోయిన మీరు ఆ భారాన్ని ఏ మాత్రం మోయలేక ఒక్క అంగుళం కూడా కదలలేకపోతున్నారు. సూర్యకాంతిలో మంచు అంచుతో మెరిసిపోతూ మీ ముందు నిలబడ్డ పర్వతాన్ని చూడగల శక్తి మీ కళ్ళకు లేదు. ఎందుకంటే, పూర్వ నిశ్చితాభిప్రాయాలతో నిండిన కంటికి ఏదీ కనిపించదు. అలాగే ముగింపు అభిప్రాయాలతో నిండిన హృదయానికి ఏ మాత్రం జీవముండదు. అనేక పూర్వ నిశ్చితాభిప్రాయాలవల్ల మీ తెలివితేటల సౌందర్యం, సాంద్రత, పదును తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. ఫలితంగా అవి చాలా నిస్తేజంగా తయారవుతాయి. వాటినే మీరు తెలివితేటలనుకుంటున్నారు.
మీరనుకుంటున్న తెలివైన వారందరూ నిజంగా ఏ మాత్రం తెలివైనవారు కారు. వారికి కేవలం తెలివితేటలలుంటాయి. అంతే.
తెలివైనవాడు కేవలం శవం లాంటివాడు. మీరు శవాన్ని వజ్రాలు, వైఢూర్యాలు, మేలి ముత్యాలతో ఎంత అలంకరించినా అది శవమే. జీవంతో ఉండడమనేది పూర్తిగా వేరే విషయం.
విజ్ఞానశాస్తమ్రంటే వాస్తవాలపట్ల పూర్తి కచ్చితత్వంతో ఉండేది అని అర్థం. ఒకవేళ మీరు వాస్తవాలపట్ల చాలా కచ్చితంగా ఉండే పక్షంలో, మీరు మార్మికులుగా ఏ మాత్రం అనుభూతి చెందలేరు. ఎందుకంటే, మీరు ఎంత కచ్చితత్వంతో ఉంటే అంతగా మార్మికత్వం ఆవిరైపోతుంది. ఎందుకంటే, మార్మికతకు ఒకరకమైన అస్పష్టతతో కూడిన అనిర్వచనీయమైన హద్దులు లేనిదేదో ఎంతో కొంత కచ్చితంగా అవసరం. విజ్ఞానం వాస్తవమైనది. మార్మికత వాస్తవమైనది కాదు. అది అస్తిత్వానికి సంబంధించినది. వాస్తవం ఈ అస్తిత్వంలో అతి చిన్న భాగం మాత్రమే. కానీ, విజ్ఞానశాస్త్రం అలాంటి చిన్న చిన్న భాగాలతో లావాదేవీలు చేస్తుంది. ఎందుకంటే, చిన్నచిన్న భాగాలతో లావాదేవీలు చేయడం చాలా సులభం. అప్పుడే వాటిని మీరు చాలా చక్కగా విశే్లషించగలరు. పైగా, అవి మిమ్మల్ని చుట్టుముట్టలేవు. అందువల్ల మీరు వాటిని స్వాధీనం చేసుకుని, ఇంకా చిన్న చిన్న భాగాలుగా వాటిని విడగొట్టి, వాటి గుణగణాలను చాలా స్పష్టంగా తెలుసుకుని ఆ వివరాలను తెలిపే చీటీలను వాటికి అంటించగలరు. ఈ క్రమంలో మార్మికత చంపబడుతుంది.
మార్మికతను హత్య చేసేదే విజ్ఞాన శాస్త్రం. ఒకవేళ మీరు మార్మికతను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకోండి. దానికోసం మరో మార్గం అనే్వషించండి.

- ఇంకాఉంది
=============================================
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.