సబ్ ఫీచర్

మహిళలూ.. జయహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలం కదా మరి, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుందాం! సరే.. మరి ఉత్సవం, సంబరాలు జరుపుకునేంత ఆనందంగా ఉన్నామా!? అని ఒకవైపు, మరొకవైపు అసలు ‘మహిళ’లోనే ఉంది ‘మహి’ శబ్దం - మహి అంటే భూమి, ప్రపంచం. అంటే ఆమెలో ఇమిడివున్న యావత్ ప్రపంచం అని!
భా= ప్రకాశించేది, భ+ఆర్య, ఆర్యా=శ్రేష్ఠురాలు.
పేరులోనే పెన్నిధిలా ‘మహాపూజాయాం’ మహిళ అనీ, స్ర్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటే కుటుంబం సుఖ సంతోషాలతో వర్థిల్లుతుంది, వంశం వృద్ధి చెందుతుంది. అందుకే భార్య ఇంటికి యజమానురాలై శోభించాలనే అధికారాన్ని, వివాహ సమయంలోనే భర్త మంత్రపూర్వకంగా ఆమెకు దఖలుపరుస్తూ, అత్తమామల్ని, ఆడబిడ్డల్ని, మరుదుల్ని ప్రేమతో చూసుకునే బాధ్యతను కూడా అప్పగిస్తాడు.
‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు’ అనే సామెత తెలిసిందే.. అంతేకాకుండా భారతీయ మహిళకి పటిష్టమైన భద్రతావలయాన్ని కూడా ఏర్పాటుచేశారు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో బిడ్డలు ఆమెను రక్షిస్తారు అని, మరి నేటి సమాజంలో ఆ దక్షత ఏది? ఆ భద్రత ఏది? ఆడబిడ్డ పుట్టకూడదు, పుట్టినా వదిలించుకోవాలి, లేదా బాల్యాన్ని చిదిమేసే క్షుద్రశక్తులై, వావివరుసలు లేక, వయోభేదం లేకుండా బాలికలపై అఘాయిత్యాలు, అరాచకాలు.. ఈ సందర్భాలు అనేకం. ఎక్కడ చూసినా, మీడియా దృశ్యనీయంగా చూపుతుంటే మహిళలు ఈ ప్రపంచంలో వనితా దినోత్సవం జరుపుకోవడం ఎలా? చిన్నారి బాలికలు, ఇంట్లో, బయటా కూడా స్ర్తి కన్నీరు నింపుకునే పరిస్థితులే!
సుదతి లేనిదే సృష్టి లేదు, ముదిత లేనిదే ముదము లేదు. సతిని చులకన చేయువారికి ఇహం లేదు, పరం లేదు అన్నారు. ఎక్కడైతే స్ర్తిలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు ఆనందంగా తాండవిస్తారన్నది భారతీయ సంస్కృతి!
ఒకాయన ‘మీకు మహిళల దినం, పర్వదినం అంటూ ఒకటుంది. మా మగవారికసలు లేదు. మరి మీరు హక్కులు అవీ ఇవీ అంటూంటారేమిటి? అని అంటే- ‘‘సంవత్సరంలో ఒక్కరోజు మాకంటూ కేటాయించారు. పురుషాధిక్యత సంతరించుకున్న ఈ గడ్డమీద మిగతా 364 రోజులు మీ మగాళ్లవేగా మరి’’ అని ప్రతి సమాధానమిచ్చిందో స్ర్తి.
‘న స్ర్తి స్వాతంత్య్రమర్హతి’- చూడండి, న్యాయం, స్వతంత్య్రం జీవనం అందరికీ అవసరమే. అయితే దాని అర్థం ఏమిటి? ఎంతవరకు స్వతంత్రం? అసలు స్వతంత్రం, స్వేచ్ఛ అంటే ఏమిటి చెప్పండి?
‘‘ఒక మృగానికి స్వేచ్ఛ ఇస్తే అది తిరగబడుతుంది. దాన్ని అదుపులోపెట్టాలి. ఒక వృక్షాన్ని వదిలేస్తే అలా ఏపుగా పెరుగుతుంది. ఒక దశలో దాని కొమ్మలు నరకక తప్పదు. లతల్లాంటి మొక్కలు విచ్చలవిడిగా ఎదిగి అల్లుకుపోకుండా కత్తిరించాలి.’’ అతిని ఎవరూ భరించలేరు. అలాంటి స్వాతంత్య్రాన్ని మన భారత నారీమణులు ఆశించలేదే?! చదువుకుంటున్న పిల్లల్ని, ఎదుగుతున్న పిల్లల్ని పెద్దలు అదుపులో పెట్టాలి. అందులో అమ్మల పాత్ర ముఖ్యం. స్వేచ్ఛ పేరున మితిమీరి తిరిగే భర్తనుగానీ, భార్యనుగానీ అదుపులోకి తేవడం ధర్మం! లేనిపక్షంలో సంసార రథం గాడి తప్పి చక్రాలు బోల్తాపడి ముక్కలవుతుంది.
‘‘ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పింపగన్’’ అని ఒకవైపూ, స్ర్తిని దాసీ, మంత్రి, మాతా, రంభా, లక్ష్మీ, ధరిత్రి అంటూ మరోవైపు, బ్రహ్మ సృష్టించేటప్పుడు గొప్ప మెళకువలతో పూల అందాన్ని, ఇంద్రధనుస్సు రంగులను, పక్షుల పాటను, గొర్రెపిల్ల అమాయకత్వాన్ని, మలయమారుత ముగ్ధత్వాన్ని, మనోహరతనం, మేఘాల వేగాన్ని, హంస నడకను, లేడికన్నులను కలిపి స్ర్తిమూర్తిగా తీర్చి పురుషుడికి కానుకగా ప్రసాదించాడనీ, స్ర్తి మహాశక్తి స్వరూపిణి, పూజనీయురాలు, భూమాత అంటూ వేనోళ్ళ పొగిడారంటే, స్ర్తికి ఉత్కృష్ట స్థానాన్నిచ్చారని చెప్పక చెబుతోంది.
‘వనిత పురుషుని ఘనత, మరి ఆ మగవాడే లేకున్న మగువకు లేదు విలువ’- ఇవన్నీ వినడానికి సొంపుగా ఉండవచ్చు. మరి మారుతున్న దేశ కాల పరిస్థితుల్లో ప్రగతి, దేశాభ్యుదయం, మహిళా సాధికారత, ఇవన్నీ కేవలం ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అంతటి శక్తి స్వరూపిణి స్ర్తి, బాలికలు తమకు జరుగుతున్న అన్యాయం, అఘాయిత్యాలను వెల్లడి చేయలేక, పోరాడలేక తమకై నిలబడ్డ న్యాయస్థానం, రక్షకభట సమూహం, నాయకులు ముఖం చాటేసి శిక్షార్హుల్ని రక్షిస్తుంటే, ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా, కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లిన బాలికలు సురక్షితంగా వచ్చేదాకా క్షణం ఒక యుగంగా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూసే తల్లిదండ్రుల సంగతి అటుంచి, భార్య ఉద్యోగంలో, బజారులో ఏ రకమైన అబ్యూజ్‌కు గురవుతుందోనన్న భయం. ప్రతిరోజు ఎంతమంది శ్రీలక్ష్మిలు, ఆయేషాలు, నిర్భయలు మృగతుల్యులుగా మారుతున్నారో తలచుకుంటేనే భయం వేస్తోంది. వరకట్నం, పర స్ర్తి వ్యామోహం, మద మత్సరాలకు ఎప్పుడు కట్టడో ఆ దినమే నిజంగా మహిళా దినోత్సవం!
విధాత మగవాడే కదా.. మగవాని మెదడు పేటిక కన్నా మహిళ మెదడు పేటిక సగటు పరిమాణం తక్కువగా నిర్మాణం చేసి పుణ్యమో, పాపమో కట్టుకున్నారు. ఈ ప్రమాణ లెక్కలు చూసినది జీవశాస్తవ్రేత్తలు! కానీ 3సహనం, సహకారం, తల్లిదనం.. స్ర్తిజాతి జీవలక్షణం2 అన్న డార్విన్ మాటలతో ఎవ్వరూ బేధించరు. కానీ శరీర నిర్మాణంలో, ధారుడ్యంలో పురుషుడు బలిష్ఠుడై ఉండవచ్చుగాక, స్ర్తిలు బలహీనురుగా ఉన్నా.. మేధలో, విచక్షణా జ్ఞానం, ఓర్పు, నేర్పుల్లో స్ర్తిలకంటే పురుషులు మిన్నకాదన్నది నేడు నిరూపితమైన నిజం. అది, ఇది ఏమని అన్నిరంగముల మగధీరులను అధిగమించడం, వారితో ధీటుగా, మరింత అకుంఠిత దీక్ష, అంకిత భావాలతో సేవలందిస్తూ.. దేశప్రగతికి తోడ్పడుతూ మహిళలు ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నారు. అందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ అధిష్టించిన ఆర్మీస్థానం, నిన్నమొన్న ఉత్తర భారతదేశంలో తొలి మహిళా రైల్వేస్టేషన్ స్ర్తిలకు సాధికారికత కల్పించే ప్రధాన లక్ష్యంతో స్టేషన్ నిర్వహణ పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందికి అప్పగించిన జైపూర్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్‌కు జోహార్లు. పారిశ్రామిక రంగం, రహదారి, రక్షకభరంగం.. ఇలా అన్నిటా మగువల తెగువ ప్రశంసనీయం..
కానీ లోపం ఎవరిలో? యువతలో ముఖ్యంగా నిగ్రహశక్తి, వివేకం పెంచాలి. ఏ విరోధ భావాలకు చలించకుండా యోగా, ధ్యానంలో తీర్ఫుదు పొందాలి. తమతో సమానంగా సాంకేతికతను శ్వాసిస్తూ, భవితను శాసించాలని ముందుకు వస్తున్న స్ర్తిలను గౌరవించడం వారికి చేయూతనిద్దామన్న సమిష్టి భావం యువతలో రావాలంటే తల్లిదండ్రులు మాత్రుకలు కావాలి. సరియైన ఆలోచనలు, అన్నిటిని అవగాహన చేసుకునేలా, నైతిక విలువలను ఆడపిల్లలకు, మగ పిల్లలకు నేర్పండి. అందుకు జగద్గురులున్నారు. శ్రీరామచంద్ర మిషన్, శ్రీ కమలేష్, పటేల్ తమదైన సహజమార్గంలో ‘హృదయం మీద ధ్యానం’ ప్రక్రియలో ఎన్నో లక్షలమంది విద్యార్థులకు రిలాక్సేషన్, ధ్యానం నేర్పివారి వ్యక్తిత్వంలో నడవడికలో, సహనం, సాహసం, సమైక్యత, పరమాత్మ మీద ధ్యానం- చాలా చక్కని పరిణామాలకు కారణవౌతున్నారు.
ఎంత ఆడపిల్ల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా, ధైర్యం, స్థైర్యాలున్నా మానభంగాలకు, ఆసిడ్ దాడులకు, హత్యలు, విదేశాల్లో అమ్మకాలు- దినదిన గండంతో మనశ్శాంతి కరువౌవుతున్న రోజుల్లో ఇంకెక్కడి మహిళా దినోత్సవం? రేపటి అతివలు కావలసిన చిన్నారులకు ఏది రక్షణ ఛత్రం? అని డాక్టర్ గిరీష్‌కుమార్ సంఘీ ఈ వేధింపులు భరించలేక పది నుంచి పద్దెనిమిది ఏళ్ళలోపు బాలికలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. పోస్కో చట్టమా? ఇవన్నీ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం. అప్పుడప్పుడూ నినాదాలతో, తరువాత మగువల దినం అంటూ అందరూ నినదిస్తారు. స్ర్తీని పొగుడుతారు. మార్చి 8వ తేదీ ఇట్టే గడిచిపోతుంది. మర్నాడు పత్రికల్లో అవే వార్తలు దర్శనమిస్తాయి. గొడ్డుగోదులకన్నా కొద్దో గొప్పో నియమాలుంటాయేమో కానీ మగమహారాజుల్లో మార్పు వస్తుందా? అనేది ప్రశ్న. సమాధానం రాదు, దొరకదు..
నిజానికి..
ఉపాధఋ౎యయాన్ దశాచార్యః
ఆచార్యాణాం తత్త్వం సహస్రంతు
పిత్రూమాతా గౌరవేణాతి రచ్యతే॥ అన్నారు. ఒక స్ర్తిని విద్యావంతురాల్ని చేయడమంటే మొత్తం ఓ కుటుంబాన్ని విద్యావంతం చేసినట్లే అన్న మాక్లివర్‌గారి బంగారు పలుకులు భావి పౌరులుగా బిడ్డలను తీర్చిదిద్దడంలో ముదితల కర్తవ్యాన్ని తట్టి హెచ్చరిస్తోంది.
రాజకీయంగా విద్యాపరంగా మన దేశంలో స్ర్తిలకి సమాన ప్రతిపత్తి ఉంది. ఎన్నో బలీయమైన దేశాలకన్నా ముందుగా మన భారత స్ర్తి ఓటు హక్కును సంతరించుకుంది. అందు భారతావనిలో లలనలందరూ విద్యావంతులు కావాలి. మన విద్యా విధానం స్ర్తిలలో విజ్ఞానం, స్వశక్తి, వ్యక్తిత్వాలపై ఆత్మవిశ్వాసం పెంచేలా మార్పులు తేవాలి.
పీడిత స్ర్తిలలో ముఖ్యంగా దళితుల్లో, మధ్యతరగతి స్ర్తిలల్లో చైతన్యం తేవాలి. స్ర్తికి స్ర్తియే శత్రువు అన్నది కేవలం ఆరోగ్యవంతమైన పోటీకే కానీ తమలో న్యూనతాభావాన్ని పోగొట్టడానికి సహకరించాలి. పురుషుల్లో మహిళలపట్ల ఎన్నో రెట్లు గౌరవ భావాన్ని ఇనుమడించేలా మసలుకోవాలి.
అంతర్జాతీయ స్ర్తిల స్థితిగతులు అర్థం చేసుకుంటే మన ఆడవారు చాలా వెనుకే ఉన్నాం. బ్రహ్మకుమారీస్ వ్యవస్థల ద్వారా ఆధ్యాత్మిక చింతన కొంత అలవరచడం కర్తవ్యం!
నిజానికి నేటి సమాజ పరిస్థితుల్లో స్ర్తిల పాత్ర కత్తిమీద సాములాంటిది అంటే అతిశయోక్తి కాదు. ‘కదులుతున్న భూమి మీద నిలబడి కొండలు ఎక్కడం కష్టం’ అన్నారు సర్వేపల్లిగారు. అంటే స్థిరత్వాన్ని కుదర్చడానికి మహిళా శక్తి పురుషుడికి సాయంగా సరైన అవగాహన, జీవన శైలితో నిలబడ్డప్పుడే కుదురుతుంది.
మహిళలు విద్యావంతులు, ఉద్యోగస్తులు, సాధికారిత సంతరించుకోగానే సరికాదు మహిళలూ ఆత్మవిమర్శ, ఆత్మావలోకనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి.
మహిళలూ! మనకు మనం జోహార్లు చెప్పుకుందాం! కానీ ప్రసంగాల్లో మగువకు మగవారెంత విలువనిస్తున్నారు బేరీజు వేయండి! మనం మహిళలమే, ఉద్ధరించగలమని అపోహలు మానండి! స్ర్తి పురుషులిరువురూ కలిసి చుట్టూ ఆవరిచిన చీకటిని ఆడవారికి జరుగుతున్న అన్యాయాన్ని తిడుతూ వాపోతూ కూర్చోక మనం చిరుదివ్వెను వెలిగిద్దాం! అప్పుడే అపురూపమైన ఆడజన్మకు సార్థకత! జైహింద్!

- పరిమి శ్యామలా రాధాకృష్ణ 9440034545