సబ్ ఫీచర్

ఆస్వాదయోగ్యం .. ప్రకృతి ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్తి విభిన్న కోణంతో కూడిన మరొక ద్వారం గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది. విజ్ఞానశాస్త్ర కోణము మానసికమైనది. ధ్యానకోణం అద్భుతమైన మార్మిక కోణం. ధ్యానం అన్నింటినీ అనిర్వచనీయంగా మారుస్తుంది. అది మిమ్మల్ని మీకు ఏ మాత్రం తెలియని, పూర్తిగా అపరిచితమైన వాటిలో గమనించేవాడు, గమనించేది ఒకటిగా ఏకమయ్యే చోట చాలా నిదానంగా లీనమైపోయేలా చేస్తుంది.
ఇలా చెయ్యడం విజ్ఞానశాస్త్రంలో ఏ మాత్రం వీలుపడదు. ఎందుకంటే, విజ్ఞానశాస్త్రంలో గమనించేవాడు గమనించేవాడుగానే ఉండాలి. గమనించేదానిని నిరంతరం గమనిస్తూనే ఉండాలి. ఈ స్పష్టమైన వ్యత్యాసాన్ని మీరు నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి.
అలాగే మీరు అనే్వషించేదానిపై విపరీతమైన ఆసక్తితో, అపరిమితమైన ప్రేమతో మిమ్మల్ని మీరు మరిచిపోయి ఒక్క క్షణం కూడా మీరు దాని వలలో పడకుండా, దానికి ఏమాత్రం అంటుకోకుండా చాలా నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఉండాలి. ఆ ఉదాసీనతే మార్మికతను మట్టుపెడుతుంది.
నిజంగా మీరు మార్మికతను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటే, మీరు మీ ఉనికిలో ఒక నూతన ద్వారాన్ని తెరవక తప్పదు. మీరు ఒక శాస్తవ్రేత్తగా ఉండొద్దని నేను చెప్పట్లేదు. విజ్ఞానశాస్త్రం మీకు కేవలం ఒక ఉపరితల క్రియాశీలతగా మాత్రమే ఉండాలని నేను మీకు చెప్తున్నా. ప్రయోగశాలలో ఉన్నపుడు మీరు శాస్తవ్రేత్తగానే ఉండండి. కానీ, అందులోంచి బయటకు రాగానే విజ్ఞానశాస్త్రం గురించి మీరు పూర్తిగా మర్చిపోయి పక్షుల కిలకిల రాగాలను, పూల పరిమళాల గుసగుసలను చాలా చక్కగా, హాయిగా, ప్రశాంతంగా వినండి. కానీ, ఈ పనిని మీరు శాస్ర్తియ పద్ధతిలో ఏ మాత్రం చెయ్యకూడదు.
మీరు శాస్ర్తియ పద్ధతిలో ఒక గులాబీని గమనిస్తే అది మీకు మరొక మాదిరిగా కనిపిస్తుందే కానీ, ఒక కవి అనుభూతి చెందిన గులాబీలా మీకు ఎప్పుడూ కనిపించదు.
కాబట్టి, అనుభూతి చెందడమనేది వస్తువుపై ఆధారపడి ఉండదు. అది అనుభూతి చెందే వ్యక్తిగుణంపై ఆధారపడి ఉంటుంది.
పువ్వును చూస్తూ మీరుకూడా ఆ పువ్వులా మారి పాట పాడుతూ, దాని చుట్టూ నాట్యం చెయ్యండి. ఎందుకంటే, ఆ పువ్వు కూడా సుతారంగా సాగే చల్లని పిల్ల గాలిలో, వెచ్చని వెలుగుకిరణాల కౌగిలిలో పరవశించి పాట పాడుతూ, పరమానందంగా నాట్యం చేస్తోంది. మీరు కూడా మీ నిష్పాక్షికత, నిర్లిప్తత, ఉదాసీనతల వంటి శాస్ర్తియ వైఖరులన్నింటిని విడిచిపెట్టి ఆ పువ్వుతో కలిసి పరమానంద పరవశాలలో లీనమవండి. అలాగే ఆ పువ్వును మీరు మీ ఉనికిలోకి ఒక అతిథిగా ఆహ్వానించి మీ హృదయంతో గుసగుసలాడనివ్వండి.
అప్పుడే మీకు మార్మికత మాధుర్యం, దాని రహస్యాన్ని తెలుసుకునే కీలకం మీకు తెలుస్తుంది. అపుడు ఆ రహస్యాన్ని మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రయోగించండి. అంటే, నడిచేటప్పుడు యాంత్రికంగా నడవకండి. నాట్యం చేసేటప్పుడు సాంకేతికంగా నాట్యం చెయ్యకండి. అలా చేస్తే దానివల్ల లభించే ఆనందాన్ని మీరు కోల్పోతారు. నిజానికి, సాంకేతికత అవసరం ఏ మాత్రం లేదు. కాబట్టి, సాంకేతికతను ఏ మాత్రం పట్టించుకోకుండా నాట్యంలో లీనమై, మిమ్మల్ని మీరు మరిచిపోయి మీరే నాట్యంగా మారండి.
ఎప్పుడైతే ఇలాంటి లోతైన కలయికలు మీ జీవితంలోని అనేక దశలలో సంభవించడం ప్రారంభిస్తాయో.. అహం అదృశ్యమవడానికి ప్రయత్నించాలి.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.