సబ్ ఫీచర్

పౌరసత్వ సవరణ బిల్లుతో అశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశాన్య భారతంలో పౌరసత్వ చట్టసవరణ బిల్లు కారణంగా భారీఎత్తున హింస జరగడం బాధాకరం. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం అక్రమంగా ప్రవేశించిన విదేశీయులు పౌరసత్వం పొందే అవకాశం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులు అంటే హిందువులు, క్రైస్తవులు 2014 డిసెంబర్‌కు ముందు అక్రమంగా భారత్‌కు వచ్చివుంటే వారికి పౌరసత్వం కల్పించాలని ప్రభుత్వం పౌరసత్వ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో అక్రమంగా వచ్చిన ముస్లిమేతర వలసదారులకు మన దేశ పౌరసత్వం లభిస్తే, తాజాగా ఈ బిల్లుద్వారా ఆ పరిమితిని 6 సంవత్సరాలకు ప్రభుత్వం కుదించింది. అస్సోంలో బంగ్లా వలసదారులు పెరిగిపోవడంతో మత ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అస్సోంలో అక్రమ వలసదారులు 40 లక్షల మంది వున్నట్లు తాజా జాతీయ పౌర పట్టిక పేర్కొంటోంది. అక్రమ వలసదారులతో అస్సామీయుల సంస్కృతి, సంప్రదాయాలు, భాష ప్రమాదంలో పడుతోందని, ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ, తమ అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతోందని ప్రజలు, సామాజిక విశే్లషకులు, ప్రాంతీయ పార్టీలు మొత్తుకుంటున్నా ప్రభుత్వం బిల్లును ఆమోదించడం ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికే అని చెప్పకనే చెబుతోంది. 1971లో బంగ్లా విమోచన సందర్భంగా కోటి మంది భారత్‌లోకి వలసవచ్చారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వలసలకు నిరసనగా అస్సోం స్టూడెంట్స్ యూనియన్ పెద్దఎత్తున ఉద్యమం చేయగా 1985లో అస్సోం ఒప్పందం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం 1971 మార్చి 24 వరకు భారత్‌లో వున్నవారు మాత్రమే భారతీయ పౌరులుగా నిర్ణయించబడతారు. తక్కినవారు బంగ్లాదేశ్ తిరిగి వెళ్ళవలసి వుంటుంది. సవరణ బిల్లుతో అస్సోం ఒప్పందానికి తూట్లుపడడంతో ఈశాన్య రాష్ట్రాల్లో హింస చెలరేగుతోంది. ప్రభుత్వం మాత్రం జాతీయ విధానాలకు, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే బిల్లు రూపొందించామని, ఏ పౌరుడి హక్కులు భంగపడవని అంటోంది. అస్సామీ భాషను కచ్చితంగా అమలుచేస్తామని, వెనుకబడిన వర్గాలవారిని ఎస్‌టీలుగా మారుస్తున్నామని, హిందూ వలసదారులకు ప్రోత్సాహకాలను ఇచ్చి వేరే ప్రాంతాలకు పంపిస్తామని కంటితుడుపు హామీలను ప్రభుత్వం ఇస్తోందే తప్ప వారి డిమాండ్లను తీర్చడానికి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం. ప్రభుత్వం వలసదారులకు పౌరసత్వం ఇచ్చి వారి స్వప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తోందే గాని వారిని భరించే ఆర్థిక, సామాజిక పరిస్థితి వుందా? అన్న ఆలోచన, ముందుచూపు లేకపోవడం గర్హనీయం.

-సి.కనకదుర్గ, హైదరాబాద్