సబ్ ఫీచర్

అనే్వషణే జ్ఞానానికి మార్గం( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపుడైతే అహంకారం అదృశ్యమై శూన్యంలో లీనమైనప్పుడు లభించే అద్భుతమైన అనుభూతులు మీలో కలగడం ప్రారంభిస్తాయో.. అంటే పువ్వు ఉంటుంది, కానీ, దానిని చూస్తున్న మీరు అదృశ్యమవుతారు. అలాగే ఆకాశంలో ఇంద్రధనుస్సు, సుతారంగా సాగే మేఘాలు ఉంటాయి. కానీ, వాటిని చూస్తున్న మీరు అదృశ్యమవుతారు. అలా మీలోని తర్కానికి, ఆలోచనలకు, భావావేశపు అనుభూతుల స్పందనలకు ఏమాత్రం చెదరని అనిర్వచనీయమైన పరమ నిశ్శబ్దం మీలో అలుముకుంటుంది. అదే మనసు మాయమైన క్షణం. అదే అసలైన ధ్యాన స్థితి. అలా మనసు మాయమైనప్పుడే మార్మికత మీలోకి ప్రవేశిస్తుంది.
నమ్మక మార్గం:
నమ్మకం చాలా తెలివైనది. అయినా ప్రజలు తమ తెలివిని నమ్మరు. ఎందుకంటే, తమను ఎవరైనా మోసం చేస్తారేమోనని వారి భయం. అందుకే వారు ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. కేవలం భయంవలనే వారికి అనుమానం కలుగుతుంది. మీ తెలివితేటలపై ఉన్న ఒక రకమైన అభద్రతా భావంవల్లనే మీకు అనుమానం కలుగుతుంది. ‘‘మీరు నమ్మొచ్చు, నమ్మగలరు’’అనే దానిపై మీకు అంతగా నమ్మకం లేదు. దేన్నైనా నమ్మేందుకు చిత్తశుద్ధి, విశాల హృదయం, ధైర్యం, తెలివితేటలు చాలా అవసరం. అవి లేనప్పుడు కేవలం అనుమానించడం ద్వారా మిమ్మల్నిమీరు రక్షించుకుంటారు.
ఒకవేళ మీకు తెలివితేటలు ఉన్నట్లైతే, మీకు తెలియని వాటిలోకి ప్రవేశించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే, మీకు తెలిసిన ప్రపంచమంతా అదృశ్యమయినా మీకు తెలియని దానిలో మీరు ఉండగలరని మీకు తెలుసు. అందుకే అక్కడ మీరు ఇల్లుకట్టుకుని స్థిరపడగలరు. కాబట్టి, మీరు మీ తెలివితేటలను నమ్మండి.
సందేహం ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకే మీ తెలివితేటలు ఎప్పుడూ సందేహిస్తూ ఉంటారు. ఎందుకంటే, ఏది జరిగినా, దానిని ఒక సవాలుగా తీసుకోగల సామర్థ్యం, అందుకు తగినట్లు స్పందించగల నేర్పు మీకు ఉందని మీ తెలివితేటలకు తెలుసు. మధ్యస్తంగా ఉండే సగటు మనసుకు చివరికి తనపైకూడా అలాంటి నమ్మకముండదు.
ఏదీ తెలియని స్థితిలో ఉండడమే తెలివి. అది దేనినీ పోగుచేసుకోదు. అదే ఎరుక. ప్రతిక్షణం దాని జాడలు ఏమాత్రం మిగల్చకుండా అదృశ్యమవుతుంది. వెంటనే అదే క్షణంనుంచి మరొక క్షణం అమాయకమైన పసివాడిలా చాలా స్వచ్ఛంగా పడుతుంది. కాబట్టి, జీవితాన్ని అర్థం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. అందులో జీవించండి. అలాగే ప్రేమను అర్థంచేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించకుండా అందులోకి ప్రవేశించింది. అప్పుడు ప్రేమంటే ఏమిటో మీకు అనుభవ పూర్వకంగా తెలుస్తుంది. తెలుసుకోవడం ఎప్పుడూ అనుభవ పూర్వకంగా మాత్రమే జరుగుతుంది. అలా తెలుసుకున్నది ఎప్పుడూ దాని మర్మాన్ని నాశనంచెయ్యదు. కాబట్టి, మీరు తెలుసుకున్నదంతా మీకు తెలిసిన దానిలో చక్కగా నిక్షిప్తమవుతుంది.జీవితం ఒక సమస్య ఏమాత్రంకాదు. దానిని సమస్యగా పరిగణిస్తే మీరు తప్పటడుగు వేసినట్లే. జీవితాన్ని ప్రేమిస్తూ అనుభవించడమే జీవిత మర్మం. నిజానికి, భయపడే మనసు ఎప్పుడూ అన్ని వివరాలు కావాలంటుంది. అందుకే ఎక్కువగా భయపడే మనిషి అన్నీ వివరంగా చెప్పమంటాడు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.