సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ దేహము దేవాలయమై యుండుటచే సాధుజనులు దీనిని సంరక్షించుకొనకుండ నుండజాలరు. మన శరీరములు దేవుని ధనాగారములు.
కష్టములందుండవలయు మనోభావము
398. శరీర గృహమున నున్నందులకు (జీవుడు) చెల్లింపవలసిన అద్దెయే వ్యాధి.
399. ఇనుమును కొలిమిలో గాల్చి, ఎన్నియోసార్లు సమ్మెటతో బాగుగా గొట్టిననేగాని మంచి ఉక్కు కానేరదు. అప్పుడు దానిని పదునైన ఖడ్గముగాజేసి నీ యిచ్చవచ్చినట్లు వంచవచ్చును. అదే విధముగా ఆపదలను కొలిమిలో మానవుడు పెక్కుసార్లు తపించి, లోకులు పెట్టు బాధలనెడి సమ్మెటదెబ్బలు బాగుగా తినిననేగాని శుద్ధుడును వినమ్రుడునై దైవసాన్నిధ్యమును బొందనర్హుడు కానేరడు.
400. శ్రీగురుదేవుడొకప్పుడు కేశవచంద్ర సేనునితో నిట్లువచించెను: ‘‘నీవు బాధపడుచున్నావు. కాని నీ వ్యాధికి గంభీరార్థమున్నది. ఈ శరీరమున నీవనేక ఆధ్యాత్మిక దశలను పొందియున్నావు; తత్ఫలితముగా శరీరము ఇపుడు బాధపడుచున్నది. ఆధ్యాత్మిక తరంగములు లేచునపుడు శరీరస్మృతి అదృశ్యమగును, కాని తుది నవి దేహమును బాధించును. గంగానదిలో పెద్ద స్టీమరు పోవునపుడు దానివెనుక తరంగములు లేచి, కొంతసేపటివఱకు నొడ్డునకు గొట్టుకొనుచుండును. స్టీమరు ఎంత పెద్దదో తరంగములు అంత పెద్దవి లేచుచుండును. ఒక్కొక్కప్పుడు వాని తాకునకు ఒడ్డువిఱిగి పడుచుండును. ఏనుగు చిన్న గుడిసెలోనికి జొరబడిన యెడల గుడిసె అల్లల్లాడి కూలిపోవును. అట్లే బ్రహ్మానందానుభవము సాధకుని శరీరమును గదల్చివైచి యొక్కక్కప్పుడు విచ్ఛిన్నము చేసివేయును. దానివలన ఫలితమేమో తెలియునా? ఇల్లు అంటుకొనినయెడల అనేక వస్తువులు (దానితోబాటు) తగులబడిపోవును. అటులనే జ్ఞానాగ్ని కామక్రోధాదిరుపులనందఱను ధ్వంసముచేసి తుదకు ‘నేను, నాది’యను స్పృహను గూడ నాశనము చేయును. తీవ్రమైన ఆ దెబ్బతో శరీరము శిథిలమైపోవును. అంతయు పూర్తియైనదని నీ వనుకొనవచ్చును కాని అహంకార వాసన లేశమున్నను గూడ భగవంతుడు నిన్ను ముక్తునిజేయడు. నీవొక ఆసుపత్రిలో రోగిగా బ్రవేశించినయెడల పూర్తిగా నీ వ్యాధి నివారణకానిదే నిన్ను విడువరుగదా!’’
401. కేశవ చంద్రసేనునకు జబ్బుచేసినప్పుడు శ్రీగురుదేవుడాతనిగాంచి యిట్లు పలికెను: ‘‘తోటమాలి యొక్కక్కప్పుడు గులాబి మొక్కల వ్రేళ్లమీద మంచు పడులాగున వాని మీది మట్టి నించుక తీసివేయును. పువ్వులు పెద్దవగుటకై యొక్కొక్కప్పుడు వ్రేళ్లను గొన్నిటిని కత్తిరించుచుండును. నీ వింకను ఘనతర కార్యముల నొనర్చుటకై భగవానుడు నిన్నీవిధముగా ఆయత్తమొనర్చుచున్నాడు కాబోలును.’’
402. శ్రీగురుదేవుడు వ్యాధిని గూర్చి తన మనోభావము నిట్లు వెల్లడించెను: ‘‘వ్యాధి దాని పనిని అది సాగించుగాక. శరీరము బాధపడుగాక. మనసా! ‘నీవు మాత్రము ఆనందమున నెలకొనుము.’’
403. శరీరమునకెట్టి కష్టములు ప్రాప్తించినను, సుఖములు ప్రాప్తించినను నిజమైన భక్తుడెన్నడును జ్ఞానదీప్తిని, శక్తిని గోల్పోకుండును. ఆతని శ్రద్ధ్భాక్తులెన్నడును కుంటుపడవు, ఆతని జ్ఞాన తేజము క్షీణింపదు. పాండవులకెట్టి ఘోరాపదలు వాటిల్లెనో చూడుడు! కాని క్షణమైనను వారు జ్ఞాన తేజమును గోల్పోయిరా?
సహనము 404. (వంగ) గుణితమున ‘శ,ష,స’అను మూడు అక్షరముల కంటెను మఱేవియు ఒకే విధముగా ఉచ్చరింపబడవు. ఇట్లు ఈ మూడును ‘సహింపుము’, ‘సహింపుము’, ‘సహింపుము’అని మనకు బోధించుచున్నవి.
*
- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి