సబ్ ఫీచర్

నమ్మకమే అద్భుతాలను చేస్తుంది( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ఆ నమ్మకాలు మీ రక్తంలోకి, మీ ఎముకల మూలుగుల్లోకి చొచ్చుకుపోయాయి.
అయితే అవి అక్కడ కేవలం నమ్మకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. అందుకే వాటి గురించి మీరు వివరంగా ఎప్పుడూ తెలుసుకోలేదు. వాటి గురించి వివరంగా తెలుసుకోనంతవరకు మీకు స్వేచ్ఛ లభించదు. స్వయంగా తెలుసుకున్న జ్ఞానం ద్వారా మాత్రమే మీకు స్వేచ్ఛ లభిస్తుంది.
నమ్మకాలన్నీ అరువుతెచ్చుకున్నవే. అవి మీకు ఇతరుల ద్వారా సంక్రమించాయి. అంతేకానీ, అవి మీరు స్వయంగా సంపాదించుకున్న జ్ఞానం కాదు. ఇతరులనుంచి అరువుతెచ్చుకున్న విషయాలు అసలైన వాస్తవాన్ని తెలుసుకునేందుకు మీకు ఎలా దారి చూపగలవు? కాబట్టి, ఇతరులనుంచి అరువుతెచ్చుకున్న వాటిని వెంటనే విడిచిపెట్టండి.
కష్టార్జితంతో ధనవంతులు కాకుండా కేవలం దొంగతనాలు, వారసత్వ సంప్రదాయాల ద్వారా సంక్రమించిన ఆస్తులవల్ల ధనవంతులవడంకన్నా, బిచ్చగాడిగా ఉండడమే మిన్న. అలాంటి బీదరికంలో ఔన్నత్యముంటుంది. ఎందుకంటే, అది వాస్తవం కాబట్టి.
మీ విశ్వాస విధానాలు ఎంత ఉన్నతంగా కనిపించినా, అవి చాలా దయనీయంగా ఉంటాయి. ఎందుకంటే, అవి కేవలం పైపైన మాత్రమే ఉంటాయి కానీ, లోతుల్లోకి వెళ్ళలేవు. ఏ చిన్న గాటుపడినా అవిశ్వాసం తలెత్తుతుంది.
మీరు దేవుడిని నమ్ముతారు. అయినా మీ వ్యాపారంలో నష్టమొస్తుంది, మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తులు మరణిస్తారు. వెంటనే మీకు ఆ దేవుడిపై ఉన్న నమ్మకంపోతుంది. అలాంటి నమ్మకం ఏమాత్రం విలువైనదికాదు. ఎందుకంటే, అసలైన నమ్మకాన్ని ఎవరూ నాశనం చెయ్యలేరు. ఎప్పటికీ నాశనం కానిదే అసలైన నమ్మకం. కాబట్టి, నమ్మకానికి, విశ్వాసానికి మధ్య చాలాతేడా ఉంటుంది. దానిని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
నమ్మకం పూర్తిగా వ్యక్తిగతమైనది, విశ్వాసం సామాజికమైనది. నమ్మకాన్ని మీరు ఇతరులలో పెంచగలరు. కానీ, ఇతరులలో ఉండే విశ్వాసాన్ని మీరు ఏమీచెయ్యలేరు. అదెప్పుడూ అలాగే స్థిరంగా ఉంటుంది. అందువల్ల మీరు ఎలాంటి వారైనా విశ్వాసాలను మీపై రుద్దేస్తారు. కాబట్టి, వాటిని విడిచిపెట్టండి.
అలా చెయ్యాలంటే మీకు భయంగానే ఉంటుంది. ఎందుకంటే, విశ్వాసాలను వదిలిన వెంటనే సందేహాలు తలెత్తుతాయి. ప్రతి నమ్మకం సందేహాన్ని బలవంతంగా అణిచేస్తూ, అది మీలో ఎక్కడో దాగి ఉండేలా చేస్తుంది. దాని గురించి చింతించకుండా, అది బయటపడే మార్గం చూడండి.
ఉషోదయకాంతులు చూడాలనుకునే వారందరూ రాత్రి చీకటిని భరించక తప్పదు. అలాగే ప్రతి ఒక్కరికి సందేహాలు తప్పవు. రాత్రి చీకటిలో ఎంత ఎక్కువగా ప్రయాణిస్తే అంత తొందరగా వెలుగును చేరుకుంటారు. అప్పుడు చీకటిలో ప్రయాణించడం ఎంత విలువైనదో మీకు తెలుస్తుంది.
అలవాటు చేసుకోవడం ద్వారా నమ్మకాన్ని సాధించలేము. ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చెయ్యకండి. గతంలో అందరూ అదే చేశారు. అలవాటు చేసుకున్న నమ్మకం ఒక విశ్వాసంగా మారుతుంది. కాబట్టి, మీలోఉన్న నమ్మకాన్ని కనుక్కోండి. అంతేకానీ, నమ్మకాన్ని అలవాటుచేసుకోకండి. మీ ఉనికి అంతర్గత లోతుల్లో ఉన్న మూల కేంద్రానికి చేరుకుని అక్కడ ఉన్నదానిని కనుక్కోండి.
దేన్నైనా అనే్వషించాలంటే ముందు దానిపై నమ్మకముండాలి. ఎందుకంటే, మీకు తెలియని దానిలోకి మీరు వెళ్తున్నారు.

- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.