సబ్ ఫీచర్

హృదయానికి దృష్టికావాలి( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకు ఎంతో నమ్మకం, చాలా ధైర్యంకావాలి. ఎందుకంటే, మీరు ఆచారాలు, సంప్రదాయాల గుంపునుంచి బయటపడుతున్నారు. అలా మీరు నడి సముద్రంలో పడుతున్నారు. అవతల ఒడ్డు ఉందో, లేదో మీకు తెలియదు. కాబట్టి, మీకు పూర్తి నమ్మకాన్ని కలిగించకుండా అలాంటి అనే్వషణకు నేను మిమ్మల్ని పంపించలేను. అలా చెయ్యడం చాలా విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ, నేనేమి చెయ్యగలను? జీవితం తీరు అలాగే ఉంటుంది.
ఎక్కువ నమ్మకమున్న వ్యక్తి మాత్రమే ఎక్కువగా సందేహించగల, ఎక్కువగా అనే్వషించగల సమర్ధుడు. కొద్దిగా నమ్మకమున్న వ్యక్తి కొద్దిగా మాత్రమే సందేహించగలడు. అసలు నమ్మకమే లేని వ్యక్తి కేవలం సందేహిస్తున్నట్లుగా నటిస్తాడేకానీ, లోతుగా అనే్వషించలేడు. కేవలం నమ్మకం ద్వారా మాత్రమే స్పష్టత కలుగుతుంది. అయినా అది ప్రమాదంతో కూడుకున్నదే. ఎలాంటి వివరాలు తెలియని సముద్రంలో ప్రయాణించేందుకు నేను మిమ్మల్ని పంపాలంటే ముందు మీరు ఒంటరిగా వెళ్ళగలిగేలా నేను మిమ్మల్ని సిద్ధంచెయ్యాలి. మహా అయితే, నేను మిమ్మల్ని పడవ ఎక్కించగలను.
కానీ, ఆ ప్రయాణం చెయ్యాలంటే ముందుగా నమ్మకం ఎంత బాగుంటుందో, హృదయ మార్గంద్వారా లభించే పరవశం ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు పూర్తిగా తెలియాలి. అప్పుడే మీరు మీపై మీకున్న నమ్మకంతో చాలా ధైర్యంగా ఆ ప్రయాణానికి ముందడుగు వెయ్యగలరు. అలాగే ఆ ప్రయాణంలో ఏది జరిగినా దానిని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కోగలరు.
అసలు మిమ్మల్నే మీరు నమ్మకపోతే, మీరు ఎవరినైనా, దేనికైనా ఎలా నమ్మగలరు? అది అసంభవం. మిమ్మల్నే మీరు సందేహిస్తున్నప్పుడు దేనినైనా మీరు ఎలా నమ్మగలరు? మిమ్మల్ని నమ్మేది మీరేకదా! ఆ మీరే మిమ్మల్ని నమ్మనప్పుడు, మీ నమ్మకాన్ని మీరు ఎలా నమ్మగలరు? కాబట్టి, తెలివి బుద్ధిగా మారడానికి ముందే హృదయాన్ని తెరవడం చాలా అవసరం. ఇదే తెలివికి, బుద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసం. తెలివి మీ హృదయంతో ఏకమవడమే బుద్ధి. ఎందుకంటే, ఎలా నమ్మాలో హృదయానికి తెలుసు, ఎలా అడిగి అనే్వషించాలో బుద్ధికి తెలుసు.
ఒక చిన్న కథ:
‘‘ఈ వీధి నాది. ఇక్కడ నువ్వు అడుక్కోవడం కుదరదు. ఈ వీధిలో వెళ్ళేవాళ్ళందరూ నావాళ్ళు’’అంటూ బిచ్చగాళ్ళు సహజంగా ఘర్షణ పడుతూ ఉంటారు. ఆ ఘర్షణలో మీరు ఏదోఒక బిచ్చగాడి సొంతమవుతారు. కానీ, మీరు ఏ బిచ్చగాడి సొంతమో మీకు తెలియదు.
నేను చదువుకునే విశ్వవిద్యాలయం ముందున్న వీధిలో ఎప్పుడూ ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు ఆ వీధిలోకి మరొక బిచ్చగాడిని రానిచ్చేవాడు కాదు. ఆ వీధి వాడి సొంతం. సహజంగా వృద్ధులకన్నా యువకులకు కాస్త ఎక్కువ ఉదార స్వభావం ఉంటుంది. ఎందుకంటే, మృత్యువు సమీపిస్తున్న వృద్ధులకు డబ్బు చాలా ముఖ్యం కాబట్టి, వారు యువకుల్లా చాలా ఉదారంగా ఉండలేరు. పైగా, విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకున్న పిల్లలలో ఎక్కువమంది కాస్త ధనవంతుల బిడ్డలై ఉంటారు. అందువల్ల ఆ బిచ్చగాడు అక్కడ చాలా చక్కగా స్థిరపడ్డాడు. కానీ, ఒకరోజు వాడి స్థానంలో మరొక బిచ్చగాడు కూర్చున్నాడు. వెంటనే నేను ‘‘ఇక్కడ రోజూ కూర్చునే పెద్దాయన ఏమయ్యాడు?’’అని వాడిని అడిగాను. వెంటనే వాడు ‘‘ఆయన మా మామగారు. ఆయన కూతుర్ని నేను పెళ్ళిచేసుకున్నాను. అందుకు ఆయన ఈ వీధిని నాకు కట్నంగా ఇచ్చారు’’అన్నాడు.

- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.