సబ్ ఫీచర్

విశ్వమేధావి ఐన్‌స్టీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గెలీలియో, న్యూటన్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి మహనీయ మేధావుల ఒరవడిలో ప్రస్తుత 21వ శతాబ్దపు తృతీయ దశాబ్దంలోకి ప్రపంచ మానవాళి అడుగుపెడుతోంది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక ప్రజ్వలనంతో ముందుకు దూసుకువెళ్తున్న పరిశోధనా మేధస్సు అనూహ్య సృష్టి రహస్యాల వైపు దృష్టి సారిస్తోంది. అంతరిక్షంలో నిక్షిప్తమైన విశ్వ ఆవిర్భావం గుట్టువిప్పే ఖగోళ పరిశోధనా ఆవిష్కరణల దిశలో శాస్తజ్ఞ్రులు వైజ్ఞానిక దీప్తి ప్రసరింపచేస్తున్నారు. సరిగ్గా వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్ ప్రతిపాదించి ప్రపంచాన్ని విస్మయ పరిచిన సాపేక్ష సిద్ధాంతానికి అమెరికాలోని ‘లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ’ (లిగో) శాస్తజ్ఞ్రులు రుజువులు చూపించి సంచలనం సృష్టించిన సందర్భం ఇది.
1879 మార్చి 14న జన్మించి, 1955 ఏప్రిల్ 18న- తన 76వ ఏట భౌతికంగా నిష్క్రమించిన విశ్వమేథావి అల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ప్రపంచం నేటికీ ఆరాధ్యనీయునిగా భావించి నమస్కరిస్తోంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జ్యూయిష్ కుటుంబానికి చెందిన అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు బాల్యంలో తండ్రి ఉత్తరదిశ, దిక్సూచి ‘కంపాస్’ అయస్కాంత పేటిక బహూకరించటం భవిష్యత్‌లో నేడు సాపేక్ష క్వాంటమ్ సిద్ధాంత విశ్వరహస్య ఛేదనా విజయావిష్కరణల మేధాసంపన్నతకు తొలి అంకురం. 1900లో కాలేజీ విద్య అనంతరం స్విస్ పేటెంట్ కార్యాలయంలో చేరిన ఐన్‌స్టీన్ యువకునిగా జీవన సంక్షోభం ఎదుర్కొన్నా, శాస్ర్తియ జిజ్ఞాసతో నిరంతర పరిశోధనలలో నిమగ్నమయ్యేవారు. 1905 నాటికి సాపేక్ష సిద్ధాంతం వెలుగుచూసి 1915 నాటికి ప్రచురితమై ప్రపంచాన్ని విస్మయపరిచింది. ప్రథమ, ద్వితీయ ప్రపంచ సంగ్రామాల ప్రభావాలను తన జీవిత కాలంలో ఐన్‌స్టీన్ వీక్షించారు.
దార్శనిక ఆవిష్కరణలు...
ప్రపంచ సాంకేతిక చరిత్రలో 1905ను ఒక ‘అద్భుత సంవత్సరం’ అంటారు. మన కంటికి, ఆలోచనలకు అత్యంత మామూలుగానే వుండే విషయాలను అసమాన శాస్ర్తియ జీనియస్‌గా అతిస్వల్ప అంశాలను ఐన్‌స్టీన్ మేధస్సు ‘జనరల్ థియరీ ఆఫ్ రెలెటినిటీ’గా ప్రకటించి టైమ్, స్పేస్ లక్షణాలపై విప్లవాత్మకంగా విశ్వ ఆవిర్భావ అవగాహనకు శ్రీకారం చుట్టారు. ఫొటో ఎలక్ట్రిక్ ప్రభావాలపైన, బ్రౌనియల్ కదలికలపైన, స్పెషల్ థియరీ ఆఫ్ రిలెటెవిటీ, మేటర్ ఎనర్జీకి వున్న సంబంధాన్ని సూచించే ఈక్వేషన్ ఉ=ష2 అపూర్వ అనే్వషణలు అనితర సాధ్యమైన సాంకేతిక ప్రగతికి ప్రపంచానికి మార్గదర్శకమయ్యాయి. 1887లో అమెరికన్ శాస్తజ్ఞ్రులు అల్బర్ట్ మైక్‌ల్మన్, ఎడ్వర్డ్ మోర్లే 1893నాటికి జార్జ్ ఫిట్జ్ గెరాల్డ్, 1895 హెన్‌డ్రిక్ ఎ.లొరొంజ్ సిద్ధాంత పరిశోధనలు పునాదిగా, చిన్న చిన్న మేటర్ పార్టికిల్స్ అపారశక్తి పుట్టించగలవని ఈక్వేషన్‌లో సూచించారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతం ఆయన మాటలలో- ‘‘ఒక అందమైన అమ్మాయితో గంట కూర్చున్నా అది ఆ వ్యక్తికి కేవలం నిమిషంగా అనిపిస్తుంది. అత్యధిక వేడి సెగ ఒక సెకను తగిలినా అది గంటపైగా భరించినట్టు’’ అనిపిస్తుంది. అదీ సాపేక్షత- పరుపుమీద నిద్రించే మనిషి దానిమీద చేసే రకరకాల కదలికల వచ్చే మార్పుల్లా జరిగే వాటిని గ్రావిటీ వేవ్స్ అన్నారు. థియరీ ఆఫ్ రెలిటివిటీ, ఐన్‌స్టీన్ గ్రావిటేషనల్ వేవ్స్ (గురుత్వాకరణ శక్తి) ఖగోళ శాస్త్రంలో విప్లవం సృష్టిస్తోంది. విశ్వ నాద రహస్యం గుట్టు విప్పటానికి ఐన్‌స్టీన్ సిద్ధాంతం ఆశాకిరణమైంది.
26 ఏళ్ల ఒక యువ శాస్తవ్రేత్త అయినప్పటికీ 1921లో నోబెల్ బహుమతి- ‘్ఫటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌కి పరిశోధన’కు ఆయనను వరించింది. భౌతికశాస్త్ర అధ్యయన అనే్వషణలకు అరూప భావం, గణిత మనోనేత్ర సిద్ధాంత అన్వయంతో కంటికి కనపడని ఊహలకు అతీతమైన అణు, పరమాణువులు, ఎలక్ట్రాన్‌లు, ప్రొటాన్‌లు ప్రస్తుత తరం న్యూట్రాన్‌ల ప్రవర్తనే కాకుండా బలం, భారం, శక్తి, కాంతి కణాలు, తరంగాల భావనల అరూప మేధాసంపన్నతతోనే సాధ్యమని ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికి కొత్త వాకిళ్లలో వెలుగులు ప్రసరింపచేసిన మహోన్నత దార్శనిక మేధావిగా ఐన్‌స్టీన్‌ను భూచలనం వున్నంతకాలం ప్రపంచ మానవాళి ఆరాధిస్తూనే వుంటుంది.
శాంతియుత అణుశక్తి...
‘ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్‌కు 1939లో అణుబాంబు తయారీకి సంకేతం యివ్వటం నేను నా జీవితంలో చేసిన ఘోర అపరాధం’ అని 1955 ఏప్రిల్‌లో ఐన్‌స్టీన్ అన్నారు. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో తాను సృష్టించిన ‘క్వాంటమ్ థియరీ’ అణుబాంబు ఉత్పత్తికి కారణం కావటంతో 1945 ఆగస్టులో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల వద్ద మారణ విధ్వంసానికి అమెరికా పాల్పడటం ఐన్‌స్టీన్‌కు తీరని వేదన కలిగించింది. తదనంతర జీవిత కాలంలో విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్, సత్యాహింసల ప్రపంచ ప్రవక్త గాంధీజీ, శాంతిదూత జవహర్‌లాల్ నెహ్రూ, ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త రాధాకృష్ణన్ వంటి భారతీయ మేధావులకు అత్యంత సన్నిహితుడైన ఐన్‌స్టీన్ అణుశక్తి శాంతియుత ప్రయోజనాలకు, మానవాళి జీవన సంక్షేమానికి వినియోగపడాలని ప్రగాఢంగా ఆకాంక్షించారు. 1933లో నాజీ నియంత హిట్లర్ ఉన్మాద నియంతృత్వానికి నిరసనగా జర్మనీ వదిలిపెట్టి అమెరికాలోని న్యూజెర్సీ ప్రిన్స్‌టన్ అడ్వాన్స్‌డ్ సంస్థలో ప్రపంచ శాస్ర్తియ మేధావిగా జీవించారు. భారతీయ శాస్ర్తియ మేధావి సత్యేంద్రనాథ్ బోస్‌తో సన్నిహితత్వం ఐన్‌స్టీన్ ప్రతిభా సంపన్నతకు పదునుపెట్టింది. ‘క్వాంటమ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఫొటోన్స్’పై ‘బోస్- ఐన్‌స్టీన్’ కండెనే్సట్ పరిశోధనా పత్రం ప్రపంచానికి శాస్ర్తియ వెలుగులు ప్రసరింపచేసింది. ప్రప్రథమంగా ఐన్‌స్టీన్- మిన్‌కోస్కీ పరిశోధనా పత్రాలను ఆంగ్లంలోకి సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాథ్ సహా ఇద్దరూ పి.సి.మహలనొబిస్ ముందు మాటతో ఐన్‌స్టీన్ జీవితకాలంలోనే వెలుగులోకి తెచ్చారు.
జర్మనీలో జన్మించిన ఐన్‌స్టీన్ అమెరికా పౌరునిగా జీవించవలసి రావటం ద్వితీయ ప్రపంచ సంగ్రామం నాటి హిట్లర్ జాతి విద్వేష దురహంకార పాలనకు తార్కాణం. ప్రస్తుత ప్రపంచం అధునాతన శాస్ర్తియ వెనె్నల వెలుగులు కారణంగా ఒక గ్లోబల్ విలేజ్‌గా రూపాంతరం చెందుతోంది. మహామేధవి ఐన్‌స్టీన్ కేవలం ప్రపంచ పౌరుడుగా కాకుండా, సృష్టి రహస్యాలను ఛేదించే శాస్ర్తియ అనే్వషణలు రోదసీ యానంలో నిరంతరం పయనించే విశ్వపౌరునిగా తరతరాల భవిష్యత్తు గుర్తుంచుకోవలసినదే.
*
(నేడు ఐన్‌స్టీన్ జయంతి)

-జయసూర్య