సబ్ ఫీచర్

ప్రాచుర్యం పొందని చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనక దగా.. ముందు దగా.. కుడి, ఎడమల దగా...అనే దోపిడీ రాజ్యం అనాదిగా అమాయకుల మీద స్వారీచేస్తూనే వుంది. కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతూ వస్తున్నాయి. ప్రజలే పాలకులుగా మారుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో ప్రజలనందు వచ్చిన చైతన్యంలో భాగంగా వినియోగదారుల సంఘాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ సంఘాల ఒత్తిడి మేరకు మన భారతదేశంలో కూడా మొదటిసారి 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడింది. ఈ చట్టం ద్వారా వినియోగదారుడే రారాజుగా వ్యవహరించడానికి అవకాశం వుంది. అయితే.. దశాబ్దాలు గడుస్తున్నా.. ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడంలో సామాన్యులేకాక ఓ రకమైన సామాజిక పరిజ్ఞానమున్న వ్యక్తులు సైతం విఫలమవుతున్నారు. ఇందుకు తగినట్లు పాలక పక్షాలు, ప్రభుత్వాలు ఈ చట్టం గురించి చైతన్యవంతులను చేయడానికి ఈ వినియోగదారుల ఫోరాలను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి ఏ మాత్రం ఆసక్తిచూపడం లేదు. ఈమధ్యకాలంలో ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం మరింత మెరుగులు దిద్ది వినియోగదారునికి ఉపయోగపడే విధంగా కఠిన నిబంధనలను తీసుకొచ్చినప్పటికీ కనీస స్థాయిలో కూడా వాటి గురించి ప్రజలకు తెలియడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వినియోగదారులనందు వచ్చిన చైతన్యాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి నేటి మార్చి 15న ‘అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం’ కింద గుర్తించింది.
వారం రోజుల కిందట ఉస్మానియా ఆస్పత్రిలో ఒక వ్యాధికి సంబంధించిన గోలీలు మరో వ్యాధికి సంబంధించి మింగడంతో అభం, శుభం తెలియని చిన్నారులు సుమారు 30 మంది వరకు అస్వస్థతకు గురికావడమేకాక ఇద్దరుముగ్గురు మరణించారు. నాలుగురోజుల కిందట కోఠినందలి మరో ప్రభుత్వ ఆస్పత్రినందు ప్రసవంకోసం వచ్చిన ఒక అభాగ్య మహిళను వైద్యులు సకాలంలో పట్టించుకోకపోవడంతో బిడ్డతోసహా ఆమె మరణించింది. మూడు సంవత్సరాల కిందట గుంటూరునందలి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రినందు ఎలుకలు కొరకడంతో ఒక శిశువు మరణించింది. ఆ మధ్యనే తిరుపతి రూయా ఆస్పత్రి ప్రాంగణంలో ఒక రోగి కాలు (మొండెం) బహిరంగంగా కనిపించి భయానక వాతావరణం సృష్టింప చేసింది. విశాఖనందలి మరో ప్రముఖ ప్రభుత్వ హాస్పిటల్స్‌నందు సైతం లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుంటున్న డాక్టర్లుకూడా రోగులకు వైద్యసేవలు అందించడం లేదు. ఇలాగే కార్పొరేట్ షోరూంలనందు బట్టలు కొని ఇంటికివచ్చి నీళ్లలో తడిపిన వెంటనే చిరిగిపోతున్నాయి. నువ్వులు, ఆవాలు, చక్కెర, మిరియాలు, గోధుమ పిండి, కారంపొడులతోపాటు పాలల్లో సైతం కల్తీని ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలతో అనేక వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఆడుకుంటున్నాయి. చివరకు రైతులు పండిస్తున్న పంటలకు కొనే పత్తివిత్తనాలు, ఇతర పంటల విత్తనాలనందు కూడా కల్తీలు చోటుచేసుకొని ప్రతియేటా రైతులు లక్షలస్థాయిలో నష్టపోతున్నారు. ఇలాగే.. రైల్వేస్టేషన్లనందు, బస్టాండ్‌లనందు అడ్వాన్సుగా రిజర్వేషన్ సీట్లుకల్పించి చివరకు ప్రయాణికులు ఎక్కిన తరువాత వారికి కేటాయించిన సీట్లు ఇవ్వకుండా అధికారులు రుబాబుగా వ్యవహరిస్తున్నారు. ఈమధ్యకాలంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు మరీ భయంకరంగా దోపిడీ చేస్తున్నాయి. బోర్డింగ్ పాస్‌లు ఇచ్చిన తరువాత కూడా సకాలంలో విమానాలను ఎక్కించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈవిధంగా అన్నిరకాలుగా జరుగుతున్న కుడి ఎడమల దోపిడీని నివారించడానికి ప్రతి పౌరుడు వినియోగదారుడే అయినందున వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని పూర్తిగా తెలుసుకొని సమీపంలోవున్న వినియోగదారుల ఫోరాలకు వెళ్లి ఎప్పటికప్పుడు కేసులు వేసి పరిహారాలను పొందవలసి వుంది. ఇందుకు తగినట్లు ఫోరాలనందు ప్రభుత్వాలు తగిన సిబ్బందిని ఏర్పాటు చేయడమేగాక నిర్వహణ ఖర్చులకు సరైన విధంగా నిధులను విడుదల చేయవలసి వుంది. ఇలాగే చాలాచోట్ల ఉత్సవ విగ్రహాలుగావున్న ఫోరాలకు ఎప్పటికప్పుడు పాలకవర్గాలను ఏర్పాటుచేయవలసి వుంది. ఈ విధంగా ప్రజలే చైతన్యవంతులై ప్రభుత్వాల ద్వారా వినియోగదారుల ఫోరాలనందు సత్వరం న్యాయం పొందినప్పుడే ఈ చట్టానికి సార్థకత చేకూరుతుంది.
*
(నేడు అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం)
*

- తిప్పినేని రామదాసప్పనాయుడు