సబ్ ఫీచర్

ప్రజాస్వామ్యం - సమత్వం - అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామిక సిద్ధాంతం అనుకున్న ఫలితాలు రాకపోయినా దానివలన ప్రపంచంలో సమానత్వం అనే దృక్పథం మాత్రం ప్రచారంలోకి వచ్చింది. దాన్ని అమలుచేయటానికి మాత్రం కొన్ని దశాబ్దాల సమయం కావల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలికమైన పోరాటంగా మారింది. దీనివలన అందరికీ సమానమైన అవకాశం ఉంది అన్న న్యాయపరమైన అవకాశం వచ్చింది. అది కూడా ఒక పోరాటం తర్వాతే వచ్చింది. రాజకీయ, ఆర్థిక సమానత్వం మాత్రం ఆలస్యంగానే వస్తూ వున్నది. చాలాకాలం వరకు మహిళలకు ఓటు హక్కు రావటానికే కొంతకాలం పట్టింది. ఈనాడు ప్రపంచంలో రాజకీయ సమానత్వం మాత్రం వచ్చింది. కానీ ఆర్థికపరమైన సమానత్వం లేకుండా మిగతా సమానత్వాలు ప్రజలను విముక్తి పరచలేవు. అందరికీ నివాసమైన హక్కు, ఆహార భద్రత, మెడికల్ కేర్, ఇవన్నీ రావటానికై ఇంకా దీర్ఘకాలిక పోరాటం చేయవలసి ఉంటుంది. పోరాటాలు ఉధృతం చేయటానికై విద్యారంగమే ఆ చైతన్యానికి విశాల వేదిక కావాలి. విద్యారంగం మాత్రం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలన్న దృక్పథాన్ని చాటి చెప్పింది. సమాన అవకాశాలతోటి సమాన ఫలితాలు రావు. దానికై విద్యారంగంలోనే అందరకి సమానావకాశాలు లభించే విద్యను సమకూర్చవల్సిన బాధ్యత ఉంది. విద్యారంగమే అసమానతలతో నిండి ఉన్నది. అందరికీ సమాన జ్ఞానసముపార్జనా అవకాశాలే లేనప్పుడు విద్యారంగం ద్వారా మిగతా సమానత్వాలు వస్తుందని ఊహించటం అత్యాశే అవుతుంది. విద్యారంగంలో అందరికీ ఒకే రకమైన కరికులమ్ మాత్రం ఉంది. అది కూడా గత కాలంలో లేదు. విద్యారంగం మాత్రం అందరికీ ఒకే కరికులమ్ అనే మెట్టునెక్కించింది. అంతమాత్రం చేత ఒకే కరికులమ్ ఉన్నంత మాత్రాన అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలనుకోవటం అతిశయోక్తి అవుతుంది. ఇందులో స్కూళ్ల మేనేజ్‌మెంట్ పాత్ర కూడా ఉంటుంది. తల్లిదండ్రుల స్థితిగతుల పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండూ ఉన్నప్పటికీ ఒకే రకమైన బోధన ఉంటుందని ఆశించలేం. బోధనలో సమానత్వం తీసుకవచ్చినా లెర్నింగ్ (సాధన) లో సమానత్వం రాదు. సాధన ఎన్నో శక్తులపై ఆధారపడి ఉంటుంది. సమానత్వం అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. విద్యారంగం తన పాత్రలో సమానత్వం అభివృద్ధికి దోహదపడుతుంది. విద్యారంగం రోడ్డు రోలర్ కావాలంటే విద్యాసముపార్జనలో సమానత్వం తీసుకరావాలి. ఇది విప్లవాలతో వచ్చేది కాదు. ఇది క్రమంగా ప్రజల స్థాయిని బట్టి వచ్చేది.
సమానత్వం అనే కానె్సప్ట్ మాత్రం ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని సాధించటానికి ఇంకా సమయం తీసుకోవచ్చును. ఆ దశ వైపుకు విద్యారంగాన్ని మరల్చటమే పౌర సమాజలు, ప్రభుత్వానిదే బాధ్యత. అదే దేశ దేశాల ముందున్న సవాలు.

-చుక్కా రామయ్య