సబ్ ఫీచర్

ఆహ్లాదం, ఆరోగ్యం.. అక్వేరియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గాజుపెట్టెలోకి చూస్తే మైమరిచిపోక తప్పదు.. ఓ బుల్లి సముద్రం రంగురంగుల గులక రాళ్లతో ఒదిగి.. అబ్బురపరిచే పచ్చని ప్లాస్టిక్ వనంతో కాంతులీనుతుంది. అందులో సయ్యాటలాడే జల పుష్పాలు చూపరులకు మధురానుభూతులను పంచుతాయి. వాటిని చూస్తే ఎంతటి కష్టాన్నైనా మర్చిపోతాం.. మత్స్యలోకంలోకి అడుగుపెట్టాలన్న అనుభూతి మనలో అలలై ప్రవహిస్తుంది. బుల్లి సముద్రంతో కూడిన గాజుపెట్టెను మన పరిభాషలో ‘అక్వేరియం’ అని పిలుస్తారు. ఇటీవలి కాలంలో వాస్తు చేపల సెంటిమెంట్ విపరీతంగా వ్యాపించింది. దీంతో పలువురు వాస్తు ప్రేమికులు ఎంత ఖర్చు భరించైనా వాస్తు చేపలను కొనుగోలు చేసి ఆకర్షణీయంగా ఇంట్లో అలంకరణ చేసుకుంటున్నారు. ఇక చేపల ప్రేమికుల విషయం గురించి చెప్పనే అక్కర్లేదు. రంగురంగుల ‘చేప’ పిల్లలకు ముద్దు పేర్లు పెడుతూ, తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నారు.
గోల్డ్ ఫిష్, మోలిస్, సుప్పిస్, సోటాలే, ఎల్లో ఫిష్, టైగర్ బార్ వంటి చేపలను అక్వేరియంలో పెంచుకునేందుకు అధిక సంఖ్యలో ఇష్టపడుతున్నారు. సైజును బట్టి వీటి ధరలు 50 నుంచి 500 వరకూ పలుకుతున్నాయి. ‘్ఫ్లవర్ హార్న్’ చేపలు వాస్తు చేపలుగా పేరొందాయి. అయితే వీటి సైజులను అనుసరించి ధరలను నిర్ధారిస్తున్నారు. వీటిని ఇంటిలో పెంచితే అదృష్టం కలపోస్తుందని వాస్తు ప్రేమికుల ప్రగాఢ నమ్మకం. చైనా నుంచి సంక్రమించిన ఈ సాంప్రదాయం దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది.
నిర్వహణ
* ఎప్పటికప్పుడు అక్వేరియంలో నీటి స్థాయి తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా లీకేజీలు లేకండా జాగ్రత్తపడాలి.
* అక్వేరియంలో నింపేందుకు బోరు నీరు ఉత్తమం.
* ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అక్వేరియంలో సగం నీరు తొలగించి వాటి స్థానంలో కొత్త నీటిని చేర్చాలి.
* ప్రతి నెల రోజులకు నీటిని పూర్తిగా మార్చి అక్వేరియాన్ని శుభ్రం చేయాలి.
* చేపలకు గాలిని సక్రమంగా సమకూర్చేందుకు నాణ్యమైన ఆక్సిజన్ మోటార్లను వినియోగించాలి.
* చేపలను చేతితో తాకకండి. వాటిని పట్టుకునేందుకు మార్కెట్లో జల్లెడలు లభ్యమవుతున్నాయి.
* నిపుణుల సూచనల మేరకు చేపలకు ఆహారం సమపాళ్లలో మాత్రమే ఇవ్వాలి.
* అక్వేరియాన్ని కావలసిన రీతుల్లో కూడా తయారుచేసుకోవచ్చు. కాకపోతే ఖర్చును గురించి ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికి మార్కెట్లో విదేశాల నుంచి దిగుమతైన ఫైబర్ అక్వేరియాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అందం - ఆరోగ్యం
* ఇంట్లో ఈశాన్య మూలలో ఈ అక్వేరియాలను పెడుతున్నారు. కారణం ఆ మూలలో ఎప్పుడూ తడిగానో, నీటితోనో ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
* అక్వేరియాన్ని హాల్లో ఉంచడం వల్ల అందంగా ఉండటమే కాక, చూపరులనూ ఆకర్షిస్తుంది.
* హాలులోకి ఎవరు వచ్చినా చూపు అక్వేరియంపై పడి అందరూ ఇంటిని, ఇల్లాలిని మెచ్చుకుంటారు.
* ప్రతిరోజూ అక్వేరియాన్ని, అందులో తిరుగాడే చేప పిల్లలను కాసేపు చూడటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
* రక్తపోటు అదుపులో ఉంటుంది.
* మానసిక ఆనందం కలుగుతుంది.
* అక్వేరియాన్ని చూడటం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
సో.. ప్రతి ఒక్కరి ఇంట్లో అక్వేరియం ఉంటే అందానికి అందం, ఆనందానికి ఆనందం. ఇక ఆలస్యం దేనికి? మీ ఇంటికి అనువైన, ఎక్కువ పని కల్పించని చిన్న అక్వేరియం అయినా సరే.. ఇంట్లో పెట్టుకుని ఆనందించండి.. ఆరోగ్యాన్ని పొందండి. *