సబ్ ఫీచర్

అవగాహనతో అన్యోన్య దాంపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యాభర్తల మధ్య నమ్మకమే వైవాహిక జీవితం ఆనందమయం
ఆలుమగల మధ్య సర్దుబాటే ఆనందమయ దాంపత్య జీవిత రహస్యం
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు ఐతే వారికి క్షణం కూడా తీరిక దొరకదు. ఆ ఒత్తిడితో వైవాహిక బంధాన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిర్లక్ష్యంవల్ల తలెత్తే గొడవలు కాస్త చినికి చినికి విడాకుల వరకూ దారితీస్తున్నాయి. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేస్తే సంతోషం మీ స్వంతమవుతుంది. పెళ్లంటే నూరేళ్ల పంట. ఆలుమగలు అర్థం చేసుకుంటేనే ఆనందమయ జీవితం. మూడుముళ్ల బంధం ముచ్చటైన బంధం ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, అనుబంధంలతో పెనవేసుకున్న బంధం భార్యాభర్తల ప్రేమబంధం. దాంపత్య జీవన ప్రయాణానికి భర్త, భార్య ఇద్దరు సారధులే. ఇద్దరూ సమానులే.
సర్దుబాటే ఆనందమయ దాంపత్య జీవిత రహస్యం: సంసారంలో వచ్చే చిన్న తగాదాలను సర్దుబాటు చేసుకోవడంవల్ల ఆనందమయ దాంపత్య జీవితాన్ని గడపవచ్చు. దంపతులు శారీరకంగా దగ్గరవటానికి ముందు మానసికంగా చేరువవ్వాలి. ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరగాలి. ఒకరినొకరు సహకరించుకోవాలి. ఎదుటివ్యక్తి ఆనందానికి ప్రాధాన్యమివ్వాలి. కుటుంబ జీవనమే సాంఘిక జీవనానికి పునాది. ఆలుమగల మధ్య సర్దుబాటే ఆనందమయ దాంపత్య జీవిత రహస్యం. వివాహవ్యవస్థ పవిత్రతను, ఇందులో చోటుచేసుకుంటున్న అపశృతులను సరిచేసుకుని, కలకాలం కొనసాగేలా వివాహబంధంను పునరుద్ధరించుకోవాలి.
నిజాయితీతో కూడిన ప్రవర్తన: యువతీ, యువకులు పెళ్ళైన తరువాత చక్కని ప్రేమబంధాన్ని నిలబెట్టుకోవడానికి మంచి వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. ఇద్దరిమధ్య నిజాయితీతో కూడిన ప్రవర్తన ఉండాలి. పరస్పర విశ్వాసం అత్యంత అవసరం. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవాలి. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహన అత్యంత అవసరం.
ఒకరు మరొకరికోసం సమయం కేటాయించుకోవాలి: ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకోవాలి. ఎవరికివారే వాకింగ్ చేయడం, తనకుతానుగా పేపర్ చదువుకోవడం, ఇంటిపనులు చేసుకోవడం వంటి పనులలో కలిసి ప్రణాళిక వేసుకోవడం, ఒకరి పని మరొకరు పంచుకోవడం వంటివి చేయాలి. రోజు రాత్రి తెల్లవారి పనులకు సంబంధించి ప్రణాళిక తయారుచేసుకోవాలి. ఉదయపు నడకకోసం ఇద్దరు కలిసి వెళ్లాలి. ఒక్కరు పేపరు చదివితే ఆ వార్తలు భాగస్వామికి చెప్పాలి. ఇంటి పనులలో ఇద్దరి భాగస్వామ్యం ఉండునట్లు చూసుకోవాలి. కబుర్లు చెప్పుకుంటూ కాఫీ, టీ తాగడానికి ప్రయత్నించాలి.
ఒకరికొకరు సహకరించుకోవాలి: ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు భాగస్వామిదే తప్పు అన్న ధోరణిలో చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చేస్తారు రెండోవారు. అందుకే ఎదుటివారు ఏదయినా చెప్పినప్పుడు ఆసక్తిగా వినాలి. దాని గురించి మాట్లాడాలి. వీలైతే తమవంతుగా సహకరించాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పరచుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది.
ఎదుటివారి సానుకూలతలను గుర్తించాలి: ఆలుమగలమధ్య ఇద్దరిలో ఏవో లోపాలు ఉంటాయి. దంపతులలో ఒకరిలో లోపాల్ని మరొకరు ఎత్తి చూపుతుంటారు. ఎదుటివారి స్థానంలో ఉండి మనం ఆలోచించగలిగితే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. భాగస్వామిలోని సానుకూలతల్ని గుర్తిస్తే ఆలుమగలు సంతోషంగా జీవించవచ్చు.
మనసువిప్పి మాట్లాడుకోవాలి: భార్యాభర్తలకి ఎలాంటిదయిన సమస్య వచ్చిన, గొడవ పెట్టుకున్నప్పటికీ సమస్య ఎలాంటిదయినాసరే మనసువిప్పి మాట్లాడుకోవాలి. అప్పుడే సమస్యలు సద్దుమణుగుతాయి. మనసు విప్పి మాట్లాడుకోవడంవల్ల దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
నిజానికి సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. అసలు ఇదే సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంతటి పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది. సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమ ఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి