సబ్ ఫీచర్

ఇంధన సంక్షోభానికి మొక్కజొన్నతో విరుగుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజ ఇంధన వనరులు వేగంగా తరిగిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించడం అనివార్యమైంది. ప్రపంచంలో మొత్తం వాహనాలు వినియోగించే ఇంధనంలో 25శాతం వాటాను ఆక్రమించిన అమెరికాకు ఇది తప్పని సరైంది. పెట్రోల్, డీజిల్‌కు బదులుగా జీవ ఇంధనాన్ని వాడే పద్ధతికి శ్రీకారం చుట్టిన అమెరికా ఆ ప్రయత్నంలో విజయం సాధించేలా అడుగులు వేసింది. నేపాళం, కానుగ విత్తనాలతో తీసే బయోడీజిల్ ఇంధనానికి కాలవ్యవధి ఎక్కువ కావాలి. కేవలం 100 నుండి 120 రోజుల వ్యవధిలో పంట వచ్చే మొక్కజొన్న నుండి ఇథనాల్ అనే జీవ ఇంధనాన్ని తయారు చేయడంలో అమెరికా గణనీయమైన విజయాన్ని నమోదు చేసింది. ఇథనాల్ ప్రయోగం విజయవంతం కావడంతో సహజ చమురు దిగుమతుల భారం నుండి ఇప్పటికే 30శాతం ఊరట పొందింది. ఇథనాల్ ఉత్పత్తికోసం ఏకంగా తన దేశ పంటల స్వరూపానే్న మార్చివేసి విస్తీర్ణంలో సింహభాగాన్ని మొక్కజొన్న సాగు కోసం కేటాయించింది. ఇంతకాలం మానవుల ఆహార అవసరాలు తీర్చే మొక్కజొన్న జీవ ఇంధన తయారీకి ఉపయోగపడే శక్తిని కలిగి ఉండడంతో ఇప్పుడు ఆ పంటకు గిరాకీ పెరిగింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వరి, గోధుమల కంటే మొక్కజొనే్న ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. 2009లో అమెరికాలో గోధుమల ఉత్పత్తి ఆరున్నర కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, మొక్కజొన్నలో 33కోట్ల 30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించింది. అదే ఏడాది ప్రపంచంలో 80కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి ఉండగా అందులో అమెరికా, చైనా, బ్రెజిల్ దేశాలు 55కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధించాయి. ఇండియా దిగుబడి కేవలం రెండుకోట్ల మెట్రిక్ టన్నులు మాత్రమే.
ప్రపంచంలో రోజువారీ ఇంధన వినియోగం 8కోట్ల 70 లక్షల పీపాలు (బ్యారల్స్) కాగా, భారత్‌లో రోజుకు 24లక్షల పీపాలు, చైనాలో 65 లక్షల 30వేల పీపాలు, జపాన్‌లో 55 లక్షల 70వేల పీపాల ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి. 270 కోట్ల జనాభా ఉన్న మూడు దేశాల రోజువారి ఇంధన వినియోగం కోటి 45లక్షల 30వేల పీపాలుకాగా కేవలం 33 కోట్ల జనాభా గల అమెరికా 2 కోట్ల 73 లక్షల పీపాల ఇంధనాన్ని వినియోగిస్తోంది. ఈ కారణంగానే 2008 జులైలో పీపా క్రూడాయిల్ ధర 147 డాలర్లకు పెరిగినప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అప్పటినుండి ప్ర త్యామ్నాయ ఇంధన వనరుల ప్రయత్నాలను అగ్రరాజ్యం ముమ్మరం చేసింది. మొక్కల నుండి తయారుచేసిన జీవ ఇంధనాల్లో 5 శాతాన్ని సహజ ఇంధనాల్లో కలపటం మొదట ప్రారంభమైంది. అది మెల్లగా 10 శాతానికి ఆ తర్వాత 15 శాతానికి పెరిగింది. ఆ ప్ర యోగాలు సఫలం కావడంతో ఇథనాల్-85(ఇ-85) అనే ఇంధనాన్ని మొక్కజొన్న నుండి తయారుచేశారు. దీన్ని సహజ ఇంధనాల్లో 50 నుండి 85శాతం వరకు కలప వచ్చునని రుజువైంది. దాంతో అమెరికాకు పెద్దఎత్తున ఊరట లభించింది. ఆ దేశంలోని 40 రాష్ట్రాలకు చెందిన కోట్లాది చిన్న వాహనాలకు ఇప్పుడు మొక్కజొన్న నుండి తయారుచేసి ఇ-85 అనే ఇంధనాన్ని వాడుతున్నారు. మోటారు వాహనాలతోపాటు చిన్నస్థాయి నీటి యంత్రాలు, మర పడవలకు కూడా ఈ ఇంధనాన్ని వాడుతున్నారు. ఇథనాల్ పెట్రోలు అమ్మే వారి సంఖ్య 300 నుండి 2450కి పెరిగిపోయింది.
మొక్కజొన్న పంటతో ఇథనాల్ చమురు తయారీ ప్రయోజనం విజయవంతం కావడంతో అమెరికాలో మొ క్కజొన్న పండించే రైతుల దశకూడా మారిపోయింది. ఇది రైతువారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. వ్యవసా య క్షేత్రాల్లో పాడి పరిశ్రమ, పాప్‌కార్న్ పరిశ్రమలాగే ఇథనాల్ తయారీ యూనిట్ల స్థాపన మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో ఏటా 52.6 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, ఐవా, మినే్నసోటా, ఒహియా, ఇండియా నా, మిచిగాన్, మిస్సోరీ, విస్కాన్సన్ నార్త్ డకోటా రాష్ట్రాల్లో మొక్కజొన్న విప్ల వం కొనసాగుతోంది. అమెరికా తర్వాత అదే స్థాయిలో బ్రెజిల్‌లో ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. బ్రెజిల్‌లో మొక్కజొన్నకు బదులుగా చెరకు నుండి ఇంధనం తయారవుతోంది. అమెరికా తన వ్యవసాయ భూమి విస్తీర్ణం 319 మిలియన్ ఎకరాలలో 92 మిలియన్ ఎకరాల భూమిని ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్నకు కేటాయించడంతో విమర్శలు సైతం మొదలయ్యాయి. మొక్కజొన్న పంట సహజ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి అమెరికా ప్రభుత్వం దీటుగానే సమాధానమిచ్చింది. మొక్కజొన్నతో ‘ఇథనాల్ 85 ఇంధనం- 40 నిజాలు’ పేరుతో వాస్తవాల జాబితాను విడుదల చేసి విమర్శకులను అడ్డుకుంది. ఇ-85 ఇథనాల్ ఇంధనం వల్ల వాహనాలు త్వరగా వేడెక్కకపోవడం, కాలుష్యాన్ని వెదజల్లకపోవడం, వాహనాల జీవితకాల పరిమితి పెరగడం ఊతమిచ్చింది. దీనికితోడు దేశం మొత్తం మొక్కజొన్న ఉత్పత్తిలో 40శాతానికి మించి ఇంధనం తయారీకి వినియోగించడంలేదని ప్రకటించింది. ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమదారుల నుండి ఎదురైన విమర్శలనుకూడా దీటుగానే తిప్పికొట్టింది. మొక్కజొన్నలోని పిండి పదార్థాన్ని ఉపయోగించి మాత్రమే ఇథనాల్ తయారు చేస్తున్నామని మిగిలిన ప్రొటీన్లు, మినరల్స్, న్యూట్రిన్లు అలాగే ఉండడంతో కోళ్ళదాణా తయారీకి ఎలాంటి ఆటంకం లేదని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ఇ-85 ఇథనాల్ ప్రయోగం ఇతర దేశాలను ఆకర్షించింది. ‘ఒపెక్’ (చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య)కు చెందిన డజను దేశాలు, ‘ఒపెక్’కు చెందని 10 దేశాలు కలిసి ప్రపంచంలోని 220 దేశాలతో ఇంధన ధరలతో జూదం ఆడటం అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అగ్ర దేశాలకు మింగుడు పడటం లేదు. ఈ కారణంగానే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో మేలైన ఇ-85 ఇంధన ఉద్యమానికి మద్దతు లభించింది. భారత్ సహా 62 దేశాలు ‘గ్లోబల్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అలయన్స్’ (జి.ఆర్.ఎఫ్.ఎ)గా ఏకమయ్యాయి. ఇందులో ఆఫ్రికాకు చెందిన నైజీరియా, ఇథియోఫియా, సూడాన్, మోజాంబిక్ తదితర దేశాలున్నాయి. ఈ దేశాలు ప్రస్తుతం రోజుకు 20 లక్షల పీపాల సహజ చమురు పొదుపును ఇ-85 ఇంధనం వాడకం వల్ల సాధిస్తున్నాయి. భవిష్యత్‌లో ఇది చాలా వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-పుట్టా సోమన్నచౌదరి 94403 39682