సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జగత్తునంతయు సమ్మోహిత మొనర్చు నీమాయచే నానా కృష్ణుడను గాకుండునట్లు కటాక్షింపుము.’’ రామచంద్రుడు, ‘‘తథాస్తు!’’ అని మఱలనిట్లు ప్రశ్నించెను. ‘‘నారదా! ఇంకేమియు వలదా?’’ ‘‘ప్రభూ! అదియే నా ప్రార్థన, ఇంకేమియువలదు’’ అని నారదుడు బదులుచెప్పెను.
454. భగవానుడు సాకారుడో, నిరాకారుడో నీవు నిర్ణయించుకొనజాలవేని యిట్లు ప్రార్థింపుము: ‘‘ఓ సర్వేశ్వరా! నీవు సాకారుడవో, నిరాకారుడవో నేను గ్రహింపజాలను. ఎటులైనను నన్ను కృపజూడుము. నాకు ప్రసన్నుడవుగమ్ము!’’
455. సామాన్యముగా జనులు విశ్వసించు భగవద్రూపములను అవతారములను కేవల మనఃకల్పితములని కొందఱు నిరసింతురుగాక, వానిని నమ్మక పోవుదురుగాక. కాని జగత్తును సృష్టించునట్టియు, నియమించునట్టియు ఒకానొక దివ్యశక్తికలదని నమ్మి, హృదయ పూర్వకముగా, ‘‘ఓ సర్వేశ్వరా! నీ యథార్థ స్వరూపమును నేనెఱుగను. నన్ననుగ్రహించి నీ సత్యస్వరూపమును నాకు జూపుము, నాకు సాక్షాత్కరింపుము’’ అని పరితాపముతో ప్రార్థించువానిపై భగవానుడు తన కరుణాకటాక్షమును బఱవును.
456. నాయనలారా! భగవానుడు చీమ చిటుకుమన్న గ్రహించును. మీరు వానిని ప్రార్థించినపుడెల్ల మీ ప్రార్థన నతడాలకించియేయున్నాడు. ఎన్నటికైనను, తుదకు అవసాన కాలమునైనను మీకాతడు తప్పక సాక్షాత్కరించును.
సాధకులు: మత భేదములు:
సర్వమత సామరస్యము
457. నీరు ఒక్కటే, ఐనను దానిని జనులు వేర్వేఱు పేళ్లతో బిలుచుచుందురు. కొందఱు ‘వాటర్’ అందురు; కొందఱు ‘వారి’యందురు; కొందఱు ‘అక్వా’ యందురు; మఱికొందఱు ‘పానీ’యందురు. ఇట్లే సచ్చిదానందస్వరూపమగు బ్రహ్మ మొక్కటే యయ్యును కొందఱు హరి యనియు మఱికొందఱు బ్రహ్మమనియు సంబోధింతురు.
458. కుమ్మరిదుకాణములో కుండలు, కూజాలు, దాకలు, మూకుళ్లు మొదలగునవి వేర్వేఱు ఆకృతులతో వేర్వేఱు పరిమాణములు గలవియై యుండును. కాని యివి యన్నియు ఒకే మట్టితో జేయబడుచున్నవి. అటులనే భగవంతుడొక్కడే యయ్యును వివిధ దేశకాలములందు వివిధనామ రూపములతో పూజింపబడుచున్నాడు.
459. ఒకే పంచదారను చిలుకలు, ఏనుగులు మొదలగు వేర్వేఱు రూపములుగా పోతపోయవచ్చును. అటులనే మాదుర్య స్వరూపిణి యగు జగజ్జనని వివిధ దేశకాలములలో వివిధ నామరూపములతో పూజింపబడుచున్నది.
460. ఒకే బంగారముతో వేర్వేఱు నామరూపములుగల నగలు చేయబడుచందమున ఒకే భగవానుడు వివిధ దేశ కాలములలో వివిధ నామరూపములతో ఆరాధింపబడుచున్నాడు. వేర్వేఱు భావముల, వేర్వేఱు విధానముల నాతడారాధింపబడుచున్నను,- అనగా భగవంతుని గొందఱు తండ్రియనియు, గొందఱు తల్లియనియు, గొందఱు సఖుడనియు, గొందఱు నాథుడనియు, గొందఱు తమ పనె్నధానమనియు, మఱికొందఱు తమ చిన్ని ముద్దుబిడ్డడనియు భావనచేసి యారాధించుచున్నను- ఈ వివిధ భావ సంబంధములన్నిటి మూలమునను ఆరాధింపబడువాడు ఒకే భగవానుడు. (చూ.477.)
461. శివుడా, విష్ణువా ఎవరధికులని యొకసారి బర్డ్వాన్ మహారాజు నాస్థానమున పండితులనడుమ చర్చ బయలుదేఱినది.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి