సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ మతములు భగవత్ప్రాప్తి కనువగు వివిధ మార్గములు
462. పెద్ద చెరువునకు అనేకమైన రేవులుండును. స్నానము చేయుటకుగాను, పాత్రతో నీరు తీసికొనిపోవుటకుగాని రుూ రేవులలో దేనిలో దిగినను నీటిని జేరవచ్చును. ఒక రేపు మరియొక రేవుకంటె శ్రేష్ఠమైనదని వాదులాడుట వ్యర్థము. అటులనే బ్రహ్మానంద సరోవరమునకు అనేకమైన రేవులున్నవి. ప్రపంచమందలి ప్రతి మతమును అట్టియొకానొక రేవు. వినిర్మల హృదయుడవై నీవీ రేవులలో దేనియందు బ్రవేశించినను తన్మూలమున బ్రహ్మానందమను జలమును జేరగలవు. కావున ‘‘నా మతము మరియొకని మతముకంటె శ్రేష్ఠ’’మని వాదులాడబోకుము.
463. భగవంతుని నామరూపము లనంతములు. వీనిలో దేనిమూలముననైనను భగవంతుని ప్రాపింపవచ్చును. ఏ నామమున, ఏ రూపమున నీవు వాని నారాధించినను సరియే, తన్మూలముననే నీకు వాని సాక్షాత్కారము లభింపగలదు.
464. వేర్వేరు మత సంప్రదాయములు ఒకే భగవంతుని ప్రాపించుట కనువగు వేర్వేరు మార్గములు. కాళీ ఘట్టమందలి కాళీమాత యాలయమును జేరుటకు అనేక మార్గములున్నవి. ప్రతి మతమును ఇట్టి మార్గములలో కేవలము ఒకానొక మార్గము. 465. కొన్ని సంవత్సరములకు పూర్వము హిందువులును బ్రహ్మసమాజమును వారును తమ తమ మత ధర్మములను గూర్చి విశేష దీక్షతో - ఉత్సాహముతో-జనులకు బోధలు సాగించుచుండ, ఆ మతములను రెండింటిని గూర్చియు, ‘‘మీ యభిప్రాయమే’’మని యొకరు శ్రీ గురుదేవునడిగిరి. గురుదేవుడిట్లు సమాధానమొసగెను. ‘‘రుూ యుభయపక్షముల వారి మూలమునను నా జగజ్జనని తన కార్యమును సాగించుకొన్నట్లు నాకు గాన్పించుచున్నది.
466.హిందూ మతమునకు బ్రాహ్మ సమాజ (మతము)నకును గల భేదమేమమని యొక బ్రాహ్మ సామాజిక భక్తుడు శ్రీ గురుదేవుని ప్రశ్నింప, గురుదేవుడిట్లు పలికెను. ‘‘ఏకస్వరమునకును శ్రుతి సమ్మేళనముతో గూడిన రాగమునకునుగల భేదమే ఈ రెండింటికిని గల భేదము. బ్రాహ్మ సమాజము బ్రహ్మమను నొక్క స్వరముతో తృప్తిపడుచున్నది. హిందూ మతము వివిధ స్వరములతో గూడి మధురమైన రాగమై యొప్పుచున్నది.
467. మేడమీదికి నిచ్చెనతోడనో, వెదురు సాయముననో, మెట్లమీదుగనో, త్రాటితో ఎకబ్రాకియో పోవవచ్చును. అటులనె భగవంతుని జేరుటకు మార్గములను ఉపాయములును అనేకముగా నున్నవి. ప్రపంచమున ప్రతి మతమును అట్టి మార్గములలో ఒకానొక దానిని జూపును.
468. (ఇచట 186 ప్రవచనమును జదువుకొనుడు)
469. నక్కలన్ని యొక్క రీతిగనే ఊలవేయును. ఇట్లే జ్ఞానులందరి బోధలును ఒకే విధముగా నుండును.
స్వమత దురభిమానమునకుకారణము, తన్నివారణము
470. సామాన్యుడు అజ్ఞాన వశమున తన మతమే సర్వోత్కృష్టమని తలచుచు దానిని గూర్చి గడబిడ చేయుచుడను. కాని తత్త్వజ్ఞానముచే వాని హృదయము వికసించినప్పుడు ఈ స్వమతాభిమాన కలహములన్నియు అంతరించును.
471. ఇద్దరు మనుజులు ఊసరవిల్లి రంగును గురించి తీవ్రముగా వాదులాడుచుండిరి. వారిలో నొకడిట్లు పల్కెను. ‘‘ఆ తాటిచెట్టుమీది ఊసరవిల్లి చక్కని యెఱ్ఱరంగుగలది’’. ఆ మాటలను ఖండించుచు రెండవవాడిట్లనెను. ‘‘నీవు పొరపడినావు. ఆ ఊసరవిల్లి ఎఱ్ఱనిది కాదు, నీలిది’’. వాదనచే నిర్థారణకు రాజాలక వారిరువురును వేరొక మనుష్యునికడకు పోయిరి. అతడు ఆ చెట్టుక్రిందనే నివసించువాడు. ఆ ఊసరవిల్లి రంగులనన్నిటిని గమనించినవాడు.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి