సబ్ ఫీచర్

కష్టమే ఆమె ఆయుధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువైన లారీలు..
ట్రాక్టర్ల చక్రాలు..
చుట్టూ మెకానిక్ పనిముట్లు..
మధ్యలో ముగ్గురు పిల్లల తల్లి..
చకచకా పనులు చేసుకుంటోంది..
తగిలే దెబ్బలకు వెరవడం లేదు..
అబ్బా.. అని ఒక్క క్షణం కూడా ఆగడం లేదు..
పనిలో అకుంఠిత దీక్ష..
మొక్కవోని ధైర్యం..
పట్టుదల, ఏకాగ్రతలనే లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తోంది ఆ తల్లి..
వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లో మంద్సోర్ గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ మెకానిక్ షాపులో ఓ మహిళ బిజీగా పనిచేసుకుంటోంది. బరువైన లారీలు, ట్రాక్టర్ల మధ్య కూర్చుని పనిముట్లతో చకచకా రిపేర్లు చేసేస్తోంది. సాధారణంగా పురుషులు మాత్రమే చేసే ఈ వృత్తిలో ప్యాంటు, షర్టు వేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి అయిన మైనా ఆరితేరిపోయింది. ఆమె చేసే పనులు మాత్రమే కఠినం కాదు.. ఆమె జీవితం కూడా చాలా కఠినంగా ఉంది. భర్త చనిపోయిన తరువాత ఆమె ఈ వృత్తిలోకి వచ్చింది. చిన్నప్పుడు తన తండ్రి వద్ద నేర్చుకున్న పనే ప్రస్తుతం ఆమెకు జీవనాధారం అయ్యింది. ఈ వృత్తిలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఎన్నో అవహేళనలను చవిచూసింది. అలాంటి ఆమె జీవన పోరాటం ఆమె మాటల్లోనే..
3మా నాన్న ఈ పని చేసేవారు. నేను కూడా చిన్నప్పటి నుంచీ నాన్న దగ్గర టైర్లు రిపేరు చేయడం నేర్చుకున్నాను. పనైతే నేర్చుకున్నాను కానీ నాన్న పనిచేయనివ్వలేదు. పెళ్లయింది. అత్తగారింటికి వెళ్లాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్నదానికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు. అప్పటికి పిల్లలు ముగ్గురూ చాలా చిన్నవాళ్లు. పెద్దదానికి ఐదేళ్లు, రెండోదానికి నాలుగేళ్లు.. నా తోడపుట్టినవాళ్లు కూడా చిన్నవారే.. వారందరినీ నేనే పోషించాలి. నాకు వేరే పనేమీ తెలీదు. చిన్నప్పుడు నాన్న దగ్గర సరదాగా నేర్చుకున్న ఈ పనినే చేపట్టాను. తోబుట్టువులను చదివించాను. ఒకవైపు నేను ఈ పని చేస్తూనే మరోవైపు వాళ్ల బాగోగులన్నీ చూసేదాన్ని. అప్పట్లో ఇది వన్ వే రోడ్డు. ఒకే ఒక షాపు ఉండేది. ఈ మార్కెట్ ఉండేది కాదు. పగలు, రాత్రి తేడా లేకుండా ఈ పనిచేసేదాన్ని. తోబుట్టువులందరినీ నేనే చదివించా.. మొదట్లో మా అమ్మతో కలిసి ఉండేదాన్ని. ఇప్పుడు ఆమెతో గొడవలయ్యాయి. నా పిల్లలను మాత్రమే తీసుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చేసినాను. కొన్ని బోర్డులను ఉపయోగించి ఈ షెడ్ దగ్గరే తాత్కాలిక ఇల్లును ఏర్పాటుచేసుకున్నా.. ఒక్కోసారి పిల్లలకు పూర్తిగా కూడా తిండిపెట్టలేని పరిస్థితి. ఈ సమయంలో ఏమీలేక ఒక్కోసారి అటుకులు మాత్రమే తినాల్సిన పరిస్థితి. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఈ పనిలో దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోయాయి. టైర్లు రిపేరు చేస్తాను. వాటికి గ్రీజ్ రాస్తాను. ఈ మధ్యనే కార్ల సర్వీస్ సెంటర్‌ను కూడా ప్రారంభించాను. ఈ పనిచేస్తూ కార్ వాష్ కూడా చేస్తాను.
ఒక స్ర్తి సంపాదిస్తుంటే సమాజం ఓర్వలేదు. అలాగే నా విషయంలో కూడా.. నా ఎదుగుదలకు అడ్డుపడుతూ నన్ను ఎన్నో అవమానాలకు గురిచేశారు. అరే.. ఓ మహిళ అయ్యుండీ.. ఎంతో కష్టపడుతోంది. కనీస సాయం చేద్దాం అని అనుకోరు. చుట్టుపక్కల వాళ్లకు నన్ను చూస్తే కుళ్లు.. ఒక స్ర్తి ఇంత సంపాదిస్తోందా..? టైర్లు రిపేరు చేస్తుంది. గ్రీజింగ్ కూడా చేస్తుంది.. ఈ పనులన్నీ మాకు రావే.. అని వారి బాధ. ఈ పనికి పడే కష్టం ఎవరికి తెలుసు? పనిచేసేటప్పుడు వెనె్నముక దగ్గర విపరీతమైన నొప్పి పుడుతుంది. అయినా పని మానను రోజంతా పనిచేస్తూనే ఉంటాను. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే కాసేపు పడుకుంటాను. మళ్లీ లేచి పనులు చేయడం మామూలే.. మా షాపుకు వచ్చేవాళ్లలో 80 శాతం మంచి వాళ్లుంటే.. 20 శాతం చెడ్డవాళ్లుంటారు. అలాంటివారిని వెంనటే వెళ్లిపొమ్మని చెబుతాను. వారిని తరమడానికి ఒక్కోసారి తిట్టడం, కొట్టడం కూడా చేస్తుంటాను. టైరు రిపేరు చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటాను. పది టైర్లు వస్తే.. రోజుకు వెయ్యి రూపాయలు వస్తుంది. నేటికాలంలో ఈ సంపాదన ఏపాటిది?2 అంటోంది మైనా. మహిళలకు ఏ పనీ కష్టం కాదని ఆమె విశ్వాసం. దానే్న నమ్ముకుని జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి పోరాడుతోంది.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి