సబ్ ఫీచర్

శీతల పానీయాలతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలం ఆరంభమయ్యింది. విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. త్వరలో వేసవి సెలవులు సైతం రాబోతున్నాయి. గత మూడు, నాలుగు సంవత్సరాలనుండి వేసవికాలంలో ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. రోజు వివిధ దినపత్రికలలో ఎండ వేడిమి తాపాన్ని తట్టుకోలేక నేలకొరిగినవాళ్ళను సైతం చూశాము. జరుగుతున్న పరిస్థితుల అనుగుణంగా నడుచుకుంటూ జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు.
ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఆటలకు అలవాటుపడి, చెబితే వినకుండా ఎండలలో ఆడటం, వృద్ధులు పనిమీద బయటికివెళ్లి వివిధ ఇబ్బందులకు గురికావడం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు వేసవికాలం వచ్చిందంటే చాలు శీతల పానీయాలు తయారుచేసే ఎన్నో కంపెనీలు వివిధ శీతల పానీయాలను తయారుచేసి మారుమూల గ్రామాలకు సైతం తరలించి వ్యాపారాలు చేస్తున్నారు.
ఎండ వేడిమి తట్టుకోలేక వాటిని త్రాగి వివిధ అనారోగ్యాల బారిన పడాల్సి వస్తోంది. అలాగే ఐస్‌క్రీమ్స్, పొరుగు రాష్ట్రాలనుండి వచ్చి గల్లీ గల్లీకి ఒకరిద్దరు అమ్ముతూ ఉండటం, చిన్నపిల్లలు తల్లిదండ్రులతో మారాం చేసి ఇప్పించుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. కానీ వాటిని తయారుచేసే విధానంలో నాణ్యత కలిగిన పదార్థాలను వాడకపోగా, అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేయడం, దానివలన కూడా వివిధ అనారోగ్యాల బారిన పడినట్లు సామాజిక మాధ్యమాలలో తరచుగా చూస్తూనే ఉన్నాము.
కావున ఈ వేసవికాలంలో రోజురోజుకు ఉష్ణోగ్రత పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురిచేయబోతున్నది. కావున దానికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

చేయకూడని పనులు
- వీలైనంతవరకు పగటిపూట బయటకు వెళ్ళకుండా ఉండడం.
- ఆల్కహాలను తీసుకోకూడదు. శరీరంలో ఇంకా ఎక్కువ వేడిని కల్గించి, డీహైడ్రేషన్‌కు గురిచేసి, శరీరంలోని నీటిని చెమట రూపంలో బయటికి పంపుతుంది.
- ఫ్రిజ్‌లో నీటిని చల్లబరచుకొని త్రాగితే, వెంటనే చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది.
- రసాయనాలతో తయారుచేసిన శీతల పానీయాలను సేవించరాదు.
- మార్కెట్‌లలో లభించే వివిధ ఐస్‌క్రీమ్స్‌లకు దూరంగా ఉండాలి.
- మసాలాలు, నూనెలతో తయారుచేసిన పదార్థాలు, మాంసాహారాలను తినకూడదు.
- వేపుడు పదార్థాలకు స్వస్తి పలకాలి.
- నల్లటి, రంగు రంగుల, మందమైన దుస్తులను వేసుకోకూడదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఉదయం 12 గంటలనుండి 3 గంటలవరకు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లవలసి వస్తే పాదరక్షకులు గొడుగును తీసుకెళ్లాలి. ద్విచక్రవాహనాలపై వెళ్ళేవారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే సాధారణ కాలంలో రోజుకు 5లీటర్ల నీటిని సేవించాలి. కానీ వేసవికాలంలో కనీసం 7 లీటర్లనీటిని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- శీతల పానీయాలను సేవించకుండా, చిరుధాన్యాలతో చేసుకున్న అంబలిని, నిమ్మరసాలను, కొబ్బరినీళ్లను, చెరుకు రసాలను సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
- ఇంట్లోనే మట్టితో చేసిన కొత్త కుండలను, కూజాలను తీసుకొని నీటిని చల్లబెట్టుకోవాలి.
- నల్లటి దుస్తులను, రంగు రంగుల వస్త్రాలను ధరించకూడదు. కేవలం తెలుపు, లేత రంగుల దుస్తులనే వేసుకోవాలి.
- ఇంటి ఆవరణలో పచ్చటి మొక్కలు, తీగబారు చెట్లను పెంచుకొని ఇంటిని సైతం చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
-ఐస్‌క్రీమ్స్ మరియు ఎలాంటి చల్లని పదార్థాలను తీసుకోకుండా పాలతో పెరుగును చేసుకొని దానిని మజ్జిగగా చేసకొని త్రాగితే ఇంకా మంచిది.
- అన్ని చిరుధాన్యాలతో అంబలి చేసుకున్నా, ఎక్కువగా తైదలతో అంబలి చేసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- గ్లూకోజ్ పౌడర్‌ను తెచ్చుకొని నీళ్లలో కలుపుకొని తాగాలి.
చెమట రూపంలో..
వేసవికాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం మూలంగా శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగే చెమట రూపంలో శరీరంలోని నీరు సైతం బయటకు వెళ్లి తీవ్ర అవాంఛనీ పరిస్థితులకు దారితీస్తుంది. గనుక దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వేసవి తాపం నుండి బయటపడటానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మార్గంలో నడుచుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ వహించాలి.

-డా. పోలం సైదులు 94419 30361