సబ్ ఫీచర్

సమాజానికి తరగతి గది ప్రేరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది సమాజానికి గొప్ప కానుకగా పిల్లలకు క్రమశిక్షణను నేర్పుతుంది. భాగవతంలో కూడా విద్య స్వరూపాన్ని ప్రహ్లాదునితో చెప్పించారు. విజయానికి, ప్రవర్తనకు చాలా దగ్గరి సంబంధం ఉంది. తరగతి గదిలో ఒక్క విద్యార్థి అల్లరి చేసినా బోధనా కార్యక్రమం చిన్నాభిన్నం అవుతుంది. పిల్లలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని సామూహిక ప్రయోజనం కోసం ఉపాధ్యాయుడు చెప్పే ప్రతిమాటను శ్రద్ధగా వింటారు. ఇదే తరగతి గది మన పార్లమెంటుకు, శాసనసభలకూ ఇచ్చే సందేశం.
ఉపాధ్యాయుడు కేవలం చదువుచెప్పటమే కాదు, ప్రతి విద్యార్థిని ప్రేరేపిస్తాడు. ఏ ఉపాధ్యాయుడైతే ప్రేరేపిస్తాడో వారిని పిల్లలు కూడా ఆరాధిస్తారు. ఉపాధ్యాయుడు చెప్పే తీపిమాటలు ఎంతోమంది జీవితాలను మార్చాయి. విద్యార్థులను కార్యోన్ముఖులను చేశాయి. ఉపాధ్యాయుడు ప్రేరణగా చెప్పే మాటలు కొంతమందిని వారి పనిలో ముందుకు తీసుకుపోయాయి. ఇది చూసిన తర్వాత నాకు శాసన మండలిలో ఆనాటి చైర్మన్ చక్రపాణి పాత్ర జ్ఞప్తికి వస్తుంది. ఆయన వేసే కొన్ని చురకలు ప్రభుత్వాన్ని కదిలించేవి. సమాజంలోని అవకతవకలపై చక్రపాణికి మంచి అవగాహన ఉండేది. గ్యాలరీలో కూర్చున్న అధికారులు సమస్య తీవ్రతను గమనించి దాని పరిష్కారానికై ప్రయత్నం చేసేవారు. తరగతి గది క్రమశిక్షణతో సమాజానికి మంచి సందేశం ఇస్తుంది. అప్పుడప్పుడూ శాసనమండలి చైర్మన్ వేసే ఛలోక్తులు ప్రభుత్వ కదలికకు కారణభూతమవుతుంది. తరగతి గది జ్ఞానసముపార్జనలో చూపించిన మార్గం సమాజానికి ఆదర్శం. పార్లమెంటులో జరుగుతున్న చర్చలకు స్ఫూర్తినిచ్చేలా ఉండే విద్యార్థుల క్రమశిక్షణ ప్రజల మన్ననను పొందుతుంది. ఇదే పిల్లలకు, సమాజానికి ఉన్న సంబంధం.
వైకల్యంతో పనిలేదు...
ప్రపంచంలో ఏదైనా సాధించేవాళ్లు కీర్తి గురించి ఆలోచించరు. ఏకాగ్రత మనిషి మానసిక వైఖరికి సంబంధించిన అంశం. పరిపూర్ణత వచ్చేంతవరకు పనిమీదనే కొందరు దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆ పని పూర్తయిన తర్వాత వచ్చిన ఫలితంతో సమాజంతోపాటు తానూ ఆనందపడుతుంటాడు. అంగ వైకల్యం ఉన్నప్పటికీ కొందరు ఎన్నో గొప్ప విజయాలను సాధించారు. జాన్ మిల్టన్ దివ్యాంగుడు. పెరిమన్ ప్రపంచ ప్రఖ్యాత వయొలనిస్ట్. కానీ ఆయన పక్షవాతంతో బాధపడ్డాడు. జేమ్స్ కర్బర్ ఒక కార్టూనిస్టు. ఆయనకు కళ్లు కనిపించవు. వైట్‌స్టోన్ 1994లో మిస్ అమెరికాగా ఎంపికైంది. కానీ ఆమెకు వినబడదు. స్టీఫెన్ హాకింగ్ కేంబ్రిడ్జిలో గొప్ప అధ్యాపకుడు. కానీ ఆయన నడవలేడు. అవయవ లోపమున్నా కొందరు తాము చేసే పనిలో వెనుకపడలేదు. శారీరక వైకల్యం లేనివారే అన్నీ సాధించగలరని భావించడం పొరపాటు. లేని దాని గురించి పరితపించే కన్నా సాధించే పనిమీద ఏకాగ్రత పెడితే ఎవరైనా ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతారు. వారి ఆకారం కన్నా, వారు చేసే పనే ఇతరులకు ప్రేరణ కల్గిస్తుంది. అంగవైకల్యం ఉన్నవారే సాధిస్తే మనమెందుకు సాధించకూడదన్న ఆలోచన సాధకుల్లో ఏర్పడుతుంది. అంగ వైకల్యం ఉన్నా అద్భుతాలు సాధించిన మహనీయులకు ప్రపంచం అగ్రతాంబూలం ఇస్తుంది. వారే మనకు, వచ్చే తరానికి ఆదర్శం. అలాంటి మనుషులను స్మరించి ప్రేరణ పొందటం యువకుల లక్ష్యం కావాలి. అది యువ సాధకుల లక్ష్యంగా మారాలి.
సమయం విలువైనది...
టైమ్ మేనేజ్‌మెంట్ నాకు తరగతి గది నేర్పిన పాఠం. ఫస్ట్ బెల్ కాగానే ఏం చేయాలి? సెకండ్ బెల్ కాగానే ఏం చేయాలి? థర్డ్ బెల్ కాగానే ఏం చేయాలి? స్కూల్లో టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఎంతో ప్రధానం. 45 నిమిషాలు కాగానే పాఠం అయిపోతుంది. మొదటి ఐదు నిమిషాలు ఆనాటి పాఠ్యాంశాన్ని ఎలా ప్రవేశపెట్టాలో అన్న నిర్ణయంతో తరగతి గదికి ఒక దశ వస్తుంది. ఆనాటి పాఠ్యాంశానికి లక్ష్యం ఏమిటి? ఐదు నిమిషాలు కాగానే ఉపాధ్యాయుడు ఆనాటి పాఠ్యాంశం పద్ధతులు, ఈ పాఠ్యాంశంలో ఏమి నేర్చుకున్నామో దాని సారాంశాన్ని తీసుకవస్తారు. ఇది టైమ్ మేనేజ్‌మెంట్‌తో వస్తుంది. మనకు ప్రకృతిలో టైమ్ మేనేజ్‌మెంట్ కనిపిస్తుంది. ప్రతి వృత్తిలో టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. సమయానికి చేస్తేనే ఆ పని లక్ష్యం పూర్తయినట్లవుతుంది. తాను చెప్పిన సబ్జెక్టు విద్యార్థుల వద్దకు వచ్చిందా? రాలేదా? అని ఉపాధ్యాయుడు చూసుకుంటాడు. పాఠంలో దేనిమీద గురిపెట్టాలో నాకు తరగతి నేర్పింది. ఈ చర్చంతా గురివైపే పోవాలి. మొదట గ్రంథకర్త ఏ అంశంపైన గురిపెడుతున్నాడో చూడాలి. తర్వాత దాని మీద లక్ష్యం ఏర్పాటు చేసుకుంటాం. పాఠంపై గురిపెట్టి దాన్ని లక్ష్యం వైపుతీసుకుపోవాలి. చివరకు తాను అనుకున్నది, తాను చెప్పిన దాంట్లో ఆబ్జెక్టివ్ వచ్చిందా అన్నది చూసుకోవాలి. ఇవన్నీ 45 నిమిషాల పిరియడ్‌లో టీచర్‌కు ఎవరూ చెప్పకుండా అలవాటైపోతుంది. ఇదే నమూనాను నేను అసెంబ్లీలో చూశాను. అక్కడ కూడా టైం మేనేజ్‌మెంట్ ఉంటుంది. ప్రజల అభ్యున్నతికి, సంక్షేమానికి ఏం చేయాలి? ఈ సంవత్సరానికి ప్రభుత్వ లక్ష్యమిది అని బడ్జెట్ ప్రవేశపెడతారు.

-చుక్కా రామయ్య